Jump to content

ఉప్పదనం

వికీపీడియా నుండి
ఉప్పు ఉత్పత్తి చేయు దృశ్యం

ఉప్పన లేదా ఉప్పదనం (Saltiness) అనగా ఉప్పు (Salt) రుచి.[1] వివిధ పదార్ధాల ఉప్పదనానికి ప్రధారమైన కారణం వానిలోని సోడియం అణువులు. అయితే క్షారలోహాల అణువులు కూడా ఉప్పదనాన్ని కలుగుజేస్తాయి. పొటాషియం, లిథియం అయాన్ల ఉప్పదనం సోడియం అయాన్ల మాదిరిగానే ఉంటుంది. కానీ రుబీడియం, సీజియం అయాన్లు పెద్దవిగా ఉండడం వలన వాని ఉప్పదనం తేడాగా ఉంటుంది. ఉప్పులోని సోడియం యొక్క ఉప్పదనం సూచిక - 1. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే సైంధవ లవణం లోని పొటాషియం ఉప్పదనం సూచిక - 0.6.[2][3]

వివరణ

[మార్చు]

నోటిలో నాలుక గుర్తించే సరళమైన రుచి గ్రాహకం సోడియం క్లోరైడ్ (ఉప్పు) గ్రాహకం. ఉప్పదనం అనేది ప్రధానంగా సోడియం అయాన్ల ఉనికి ద్వారా ఉత్పత్తి అయ్యే రుచి. క్షార లోహాల సమూహంలోని ఇతర అయాన్లు కూడా ఉప్పదనమైన రుచిని కలిగి ఉంటాయి. అయితే సోడియం నుండి వచ్చే ఉప్పదనం కన్నా తక్కువగా ఉంటుంది.

ఇతర ఏక సంయోజక కాటయాన్స్, ఉదా. అమ్మోనియం (NH4 +), ఆవర్తన పట్టిక లోని క్షార మృత్తిక లోహాల సమూహం యొక్క ద్విసంయోజక కాటయాన్స్, ఉదా. కాల్షియం (Ca2 +), అయాన్లు సాధారణంగా ఉప్పగా ఉండే రుచి కంటే చేదుగా ఉంటాయి. అయినప్పటికీ అవి కూడా నాలుకలోని అయాన్ చానెళ్ల ద్వారా నేరుగా ప్రయాణించగలవు,

మూలాలు

[మార్చు]
  1. https://andhrabharati.com/dictionary/
  2. Guyton, Arthur C. (1991) Textbook of Medical Physiology. (8th ed). Philadelphia: W.B. Saunders
  3. McLaughlin, Susan; Margolskee, Rorbert F. (November–December 1994). "The Sense of Taste". American Scientist. 82 (6): 538–545.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉప్పదనం&oldid=3173898" నుండి వెలికితీశారు