ఎంఫసిస్
బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇంఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సేవలందిస్తున్న ఎంఫసిస్, హ్యూలెట్-ప్యాకార్డ్ కో.కి చెందిన ఒక విభాగము. భారతీయ ఐటీ సంస్థలలో ఏడవ స్థానంలో నిలచిన ఎంఫసిస్ ని ఫార్చ్యూన్ ఇండియా 500 2011వ సంవత్సరానికి 165 వ స్థానంలో గుర్తింపబడింది. 2011 నాటికి 38,000 ఉద్యోగులు గల ఎంఫసిస్ కి భారతదేశం, శ్రీలంక, చైనా, ఉత్తర అమెరికా, ఐరోపా మొదలగు పధ్నాలుగు దేశాలలో 29 కార్యాలయాలు గలవు.
చరిత్ర
[మార్చు]1998 లో స్థాపించబడిన అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఎంఫసిస్ కార్పొరేషన్ 1992 లో స్థాపించబడిన భారతీయ సంస్థ అయిన బి ఎఫ్ ఎల్ సాఫ్ట్ వేర్ లిమిటెడ్ ని విలీనం చేసుకొని జూన్ 2000 లో ఎంఫసిస్ బి ఎఫ్ ఎల్ లిమిటెడ్ గా 1998 లో క్యాలిఫోర్నియాలో స్థాపించబడింది.
జూన్ 2006 లో ఎలెక్ట్రానిక్ డాటా సిస్టంస్ (ఈ డీ ఎస్) ఎంఫసిస్ ని $380 మిలియన్ లకి కొన్నది.
2008 మే 13 న్ హ్యూలెట్ ప్యాకర్డ్ ఈ డీ ఎస్ ని $13.9 బిలియన్ లకి కొన్నది. ఈ విలీనం 2008 ఆగస్టు 26 కి పూర్తి అయినది.
సేవలు
[మార్చు]- ఇంఫర్మేషన్ టెక్నాలజీ
- బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్
- ఇంఫ్రా స్ట్రక్చర్ టెక్నాలజీ,
- అప్లికేషన్ సర్వీసెస్ (డెవలప్ మెంట్, సపోర్ట్, మెయింటెనెంస్)
కార్యాలయాలు
[మార్చు]బెంగుళూరు, రాయ్ పూర్, చెన్నై, పూణె, ముంబయి, నోయిడా, ఇండోర్, పాండిచ్చేరి, అహ్మదాబాదు, భువనేశ్వర్, మంగళూరు