Jump to content

ఎల్లో-బ్రెస్టెడ్ గ్రీన్ ఫించ్

వికీపీడియా నుండి

ఎల్లో-బ్రెస్టెడ్ గ్రీన్ ఫించ్ (క్లోరిస్ స్పినోయిడ్స్)
గ్రీన్ ఫించ్ పక్షి
Scientific classification
Kingdom:
అనిమాలియా
Phylum:
చోర్డేటా
Class:
పక్షులు
Order:
పాసెరిఫార్మ్స్
Family:
ఫ్రింగిల్లిడే
Genus:
క్లోరిస్
Species:
సి. స్పినోయిడ్స్
Binomial name
క్లోరిస్ స్పినోయిడ్స్
(నికోలస్ ఐల్వార్డ్ విగోర్స్, 1831)
Synonyms

కార్డ్యులిస్ స్పినోయిడ్స్

టౌలౌస్ ఎంహెచ్ఎన్టి మ్యూజియంలో గుడ్లు

ఎల్లో-బ్రెస్టెడ్ గ్రీన్ ఫించ్ (Chloris spinoides) భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాలకు చెందిన ఫ్రింగిల్లిడే కుటుంబానికి చెందిన ఒక చిన్న పాసెరైన్ పక్షి.

వర్గీకరణ

[మార్చు]

ఎల్లో-బ్రెస్టెడ్ గ్రీన్ ఫించ్ ను 1831లో ఐరిష్ జంతుశాస్త్రవేత్త నికోలస్ ఐల్‌వర్డ్ విగోర్స్ కార్డ్యూలిస్ స్పినైడ్స్ అనే ద్విపద పేరుతో వర్ణించాడు.[2][3] మాలిక్యులర్ ఫైలోజెనెటిక్ అధ్యయనాలు గ్రీన్ ఫించ్‌లు కార్డ్యూలిస్ జాతికి చెందిన జాతులతో దగ్గరి సంబంధం కలిగి లేవని నిరూపించాయి, అందువల్ల అవి 1800లో ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త జార్జెస్ క్యూవియర్ ద్వారా క్లోరిస్ జాతికి మార్చబడ్డాయి.[4][5][6] క్లోరిస్ అనే పదం ప్రాచీన గ్రీకు పదం ఖ్లారిస్ నుండి వచ్చింది. వీటిలో రెండు ఉపజాతులు ఉన్నాయి.[5]

రెండు ఉపజాతులు

లక్షణాలు

[మార్చు]

ఎల్లో-బ్రెస్టెడ్ గ్రీన్ ఫించ్ పొడవు 12–14 సె.మీ. (4.7–5.5 అం.), బరువు 15 -21 గ్రా. మధ్య ఉంటుంది. ఇది గోధుమ రంగు శంఖాకార ముక్కు, ప్రకాశవంతమైన పసుపు రంగు రెక్కలను కలిగి ఉంటుంది. దాని కింద భాగం ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటుంది. మగ, ఆడ పక్షులు ఒకే విధమైన ఈకలను కలిగి ఉంటాయి. ఆడ పక్షి మాత్రం తక్కువ ప్రకాశవంతమైన రంగులో ఉంటుంది.[7] హిమాలయన్ ఫించ్ 13 సెం.మీ పొడవును కలిగి ఉంటుంది, ఫించ్ (క్లోరిస్ క్లోరిస్) కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. మగ పక్షి తలపై నలుపు, చెవుల చుట్టూ పెద్ద నల్లటి మచ్చలు, ముక్కు వద్ద పసుపు గీతలు, కళ్ళు, చెవులు, మెడ, ఛాతీపై పసుపు రంగుఉంటుంది. పసుపు గీతలతో నలుపు రెక్కలు, నలుపు తోక ఉంటుంది. మగ పక్షిలో నల్లగా ఉండే ప్రాంతాలు ఆడ పక్షిలో గోధుమ-నలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి.

జీవన శైలి

[మార్చు]

ఈ జాతులు ప్రధానంగా హిమాలయాల మధ్య ఎత్తులో, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇవి ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, థాయిలాండ్, టిబెట్, వియత్నాం అంతటా ఉన్నాయి. దీని సహజ ఆవాసాలు సమశీతోష్ణ అడవులు, సమశీతోష్ణ పొదలు. వీటి సంతానోత్పత్తి కాలం జూలైలో ప్రారంభమయి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇవి కప్పు ఆకారంలో గూడును హిమాలయన్ పైన్, హిమాలయన్ దేవదారు వృక్షముల మీద 4 నుండి 9 మీటర్ల ఎత్తులో కడతాయి. ఈ పక్షులు 3 నుండి 5 నీలం-తెలుపు లేదా ఆకుపచ్చ-తెలుపు గుడ్లు పెడతాయి, వాటిని 13-14 రోజులు పొదుగుతాయి. మగ పక్షి గూడు కట్టడంలో సహాయం చేయదు, కానీ గుడ్లను పొదిగేటప్పుడు ఆడ పక్షికి ఆహారం ఇస్తుంది. ఇవి ఆహారంగా పొద్దుతిరుగుడు గింజలు, మొక్కలు, ఆకులు, పువ్వులు, పండ్లను తింటాయి.

మూలాలు

[మార్చు]
  1. https://www.iucnredlist.org/species/22720344/94665324
  2. Vigors, Nicholas Aylward (1831). "Carduelis spinoïdes". Proceedings of the Committee of Science and Correspondence of the Zoological Society of London. Part 1: 44.
  3. Paynter, Raymond A. Jnr., ed. (1968). Check-list of birds of the world, Volume 14. Vol. 14. Cambridge, Massachusetts: Museum of Comparative Zoology. p. 237.
  4. Zuccon, Dario; Prŷs-Jones, Robert; Rasmussen, Pamela C.; Ericson, Per G.P. (2012). "The phylogenetic relationships and generic limits of finches (Fringillidae)" (PDF). Molecular Phylogenetics and Evolution. 62 (2): 581–596. doi:10.1016/j.ympev.2011.10.002. PMID 22023825. Archived from the original (PDF) on 2018-09-26. Retrieved 2023-05-26.
  5. 5.0 5.1 Gill, Frank; Donsker, David (eds.). "Finches, euphonias". World Bird List Version 7.3. International Ornithologists' Union. Retrieved 23 October 2017.
  6. Cuvier, Georges (1800). Leçons d'anatomie comparée. Vol. Volume 1. Paris: Baudouin. Table 2. {{cite book}}: |volume= has extra text (help) The year on the title page is An VIII.
  7. Clement, P. (2017). del Hoyo, J.; Elliott, A.; Sargatal, J.; Christie, D.A.; de Juana, E. (eds.). "Yellow-breasted Greenfinch (Chloris spinoides)". Handbook of the Birds of the World Alive. Lynx Edicions. Retrieved 23 October 2017.