ఎ. జీవన్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎ. జీవన్‌రెడ్డి
ఎ. జీవన్‌రెడ్డి

ఆశన్నగారి జీవన్‌రెడ్డి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014-2018, 2018-ప్రస్తుతం
ముందు ఆలేటి అన్నపూర్ణ
నియోజకవర్గం ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1976-03-07) 1976 మార్చి 7 (వయసు 48)
ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు వెంకటరాజన్న, రాజాబాయి
జీవిత భాగస్వామి ఎ. రజితా రెడ్డి
సంతానం అనౌషికారెడ్డి, అనణ్యరెడ్డి
నివాసం హైదరాబాద్
(small) వెంకటేశ్వర కాలనీ, మామిడిపల్లి, ఆర్మూర్‌ మండలం, నిజామాబాద్‌
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకులు, న్యాయవాది, వ్యాపారవేత్త,
మతం హిందూ
వెబ్‌సైటు జీవన్‌రెడ్డి జాలగూడు

ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు. భారత్ రాష్ట్ర సమితి నుండి ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.[1][2]

జననం - కుటుంబ నేపథ్యం

[మార్చు]

జీవన్‌రెడ్డి 1976, మార్చి 7న వెంకటరాజన్న, రాజాబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు మండలంలోని జంకంపేట్ గ్రామంలో జన్మించాడు.ఈయన తండ్రి వెంకట రాజన్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున జంకంపేట్ గ్రామ ఉపసర్పంచ్ గా పనిచేయగా, మామ యల్ల రాములు కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్మూరు ఎం.పి.పి. గా పనిచేశాడు.[3]

విద్యాభ్యాసం

[మార్చు]

ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయవాదిగా పట్టభద్రుడైన[4] జీవన్‌రెడ్డి, నిజామాబాద్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జీవన్ రెడ్డికి రజితారెడ్డితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు అనౌషికా రెడ్డి, అనణ్య రెడ్డి ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

ఎ. జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పని చేసి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి సురేష్‌రెడ్డిపై 13,964 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[5][6][7] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలులో టిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల లలిత పై 28,795 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[8]

తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ప్రధాన వక్తగా, తెలంగాణ ప్రభుత్వం తరపున మాట్లాడటానికి వార్తా ఛానళ్ళలో అనేక చర్చలు, ప్రత్యక్ష చర్చలకు హాజరవుతున్నాడు.ఎ. జీవన్‌రెడ్డి 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, నిజామాబాదు జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[9]

ఇతర వివరాలు

[మార్చు]
 • ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్, మలేషియా వంటి దేశాలను సందర్శించాడు.
 • కల్వకుంట్ల తారక రామారావు తో కలిసి గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్థాగత నిర్మాణం అధ్యయనం కోసం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం మండలం సందర్శించాడు.
 • తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల కమిటీ (పీయూసీ) చైర్మన్‌గా నియమితుడై, 2019 అక్టోబరు 31న పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[10]
 • తన నియోజకవర్గ ప్రజల కోసం వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ మీడియా ద్వారా తన ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉంటాడు.
 • ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 3 నెలల స్వల్ప వ్యవధిలో పోచంపాడు నుంచి ఆర్మూరు వరకు ప్రతిష్టాత్మకమైన తాగునీటి పథకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించాడు.

మూలాలు

[మార్చు]
 1. "Constituencywise-All Candidates". Archived from the original on 18 మే 2014. Retrieved 17 May 2014.
 2. The Hindu, Hyderabad (11 April 2018). "e-NAM turned Nizamabad yard model for entire nation". The Hindu. Retrieved 19 December 2019.
 3. "Jeevan Reddy Blogspot". Archived from the original on 2 April 2015. Retrieved 17 May 2014.
 4. Eenadu (14 November 2023). "మన అభ్యర్థులవి పెద్ద చదువులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
 5. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
 6. Sakshi (6 November 2018). "గులాబీ గుబాళింపు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
 7. Sakshi (19 November 2018). "అభ్యర్థుల ప్రొఫైల్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
 8. Andhrajyothi, Politicians Biography. "Asannagari Jeevan Reddy". www.andhrajyothy.com. Archived from the original on 19 December 2019. Retrieved 19 December 2019.
 9. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
 10. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (31 October 2019). "ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం". www.andhrajyothy.com. Archived from the original on 19 December 2019. Retrieved 19 December 2019.