అక్షాంశ రేఖాంశాలు: 17°52′03″N 79°33′03″E / 17.867583°N 79.550802°E / 17.867583; 79.550802

ఐనవోలు మండలం (హన్మకొండ జిల్లా)

వికీపీడియా నుండి
(ఐనవోలు మండలం (వరంగల్ పట్టణ జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఐనవోలు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°52′03″N 79°33′03″E / 17.867583°N 79.550802°E / 17.867583; 79.550802
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ జిల్లా
మండల కేంద్రం ఐనవోలు
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ {{{pincode}}}
ఐనవోలు తహసిల్దార్‌ కార్యాలయం

ఐనవోలు మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] అపుడు వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది.[3][4] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు

[మార్చు]

లోగడ ఐనవోలు గ్రామం వరంగల్ జిల్లా, వరంగల్ రెవెన్యూ డివిజను పరిధిలోని వర్థన్నపేట మండలానికి చెందినది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా ఐనవోలు గ్రామాన్ని (1+09) పది గ్రామాలుతో నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన వరంగల్ (పట్టణ) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 154 చ.కి.మీ. కాగా, జనాభా 43,537. జనాభాలో పురుషులు 21,762 కాగా, స్త్రీల సంఖ్య 21,775. మండలంలో 11,247 గృహాలున్నాయి.[5]

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ఐనవోలు
  2. సింగారం
  3. పున్నేలు
  4. నందనం
  5. కక్కిరాలపల్లి
  6. పంతిని
  7. కొండపర్తి
  8. వనమాలకనపర్తి
  9. వెంకటాపురం
  10. గర్మిళ్లపల్లి

మండలం లోని చూడదగ్గ ప్రదేశాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]