కందుల రాజారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కందుల రాజారావు ప్రముఖ రంగస్థల నటుడు. వ్యాఖ్యాతగా, గాయకునిగా, నటునిగా, దర్శకునిగా, రచయితగా, నిర్వాహకునిగా 60 సంవత్సరాలుగా నాటకరంగంలో పనిచేస్తున్నారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

రాజారావుగారు చిన్నవయస్సులోనే రంగస్థల ప్రవేశంచేశారు. తెనాలి సాలిపేటలోని నాటక సమాజంలో కృష్ణ తులాభారం నాటకంలో నళిని పాత్రను ధరించారు. జి. చినయోగానందం శిక్షణలో నారదపాత్రను నేర్చుకొని, ఆ పాత్రను పోషించి ప్రశంసలు పొందారు. కృష్ణలీలలు నాటకంలో ఆర్.కోటేశ్వరరావు నాయుడు యశోదగా నటిస్తే రాజారావు చిన్నకృష్ణుడు పాత్ర ధరించారు. ఆనాటకాన్ని చూసిన పులిపాటి సోదరులు తమ నాటకంలో రాజారావుచేత కృషుని పాత్రధారణ చేయించారు. ఆ నాటకంలో వేమూరి గగ్గయ్య (కంసుడు), పులిపాటి వెంకటేశ్వర్లు (వనుదేవుడు), సూరిబాబుగారుు (అక్ళూరుడు), తురగా పుండరీకాక్షయ్య (వసుదేవుడు), జి.శ్రీరాములుగారు, మాస్టర్ కళ్యాణి, శ్రీమతి రాజేశ్వరి (తారాశశాంకం ఫేమ్) మొదలగు నటించారు.

శ్రీ వింజరపు సూర్యప్రకాశరావు దర్శకత్వంలో తెలుగుతల్లి నాటకంలో "పెంటు" పాత్ర ధరించారు. కొంతకాలం భట్టిప్రోలులో ఉన్నారు. అక్కడి కళాకారులతో కలిసి సతీ సక్కుబాయి, తెలుగుతల్లి నాటకాలు ప్రదర్శించారు. భట్టిప్రోలులో ప్రజానాట్యమండలి శాఖను స్థాపించి వీరకుంకుమ, వాస్తవం, రాజకీయ గయోపాఖ్యానం వంటి నాటకాలు ప్రదర్శించారు. రేపల్లె తాలూకా కల్చరల్ అసోసియేషన్ ఆర్గనైజర్ గా పనిచేశారు.

తెనాలి లో స్థిరనివాసం ఏర్పరుచుకొని జనతా ఆర్ట్ థియేటర్ లో సభ్యులుగా చేరి ఇదా ప్రపంచం, భయం, వీరకుంకుమ, జైజవాన్, భలేపెళ్ళి, ఉలిపికట్టె, పరివర్తన, తుఫాన్ మొదలగు నాటకాలలో పాల్గొన్నారు. వీరు ఇతర సమాజాలవారు ప్రదర్శించిన పెండింగ్ ఫైల్, నథింగ్ బట్ ట్రూత్, చీకటితెరలు, దేవుడూ నిద్రలే మొదలైన నాటికల్లో వివిధ పాత్రలు పోషించారు. భయం నాటకంలో వీరు ధరించిన అకౌంటెంట్ పాత్రపలువురి ప్రశంసలు పొందింది.

మున్సిపల్ హైస్కూల్ నందు ఉపాధ్యాయులుగా ఉంటూ పిల్లలచే నృత్యాలు, కోలాటం, నాటకాలు, పాటలు ప్రదర్శింపచేశారు. బాలబాలికలచే ఆకాశవాణిలో ప్రోగామ్స్ ఇప్పించారు. వీరు కేవలం నటులే కాకుండా మంచి నాటకరచయితగా కూడా గుర్తింపు పొందారు. వీరు రచించిన శ్రీ తిరుపతమ్మ కథ, యజ్ఞపత్రుడు, శ్రీహరివిలాసం మొదలైన పౌరాణిక నాటకాలు ప్రదర్శనకు సిద్ధం చేస్తున్నారు.

నటించిన నాటకాలు - పాత్రలు[మార్చు]

 1. కృష్ణ తులాభారం - నళిని
 2. కృష్ణలీలలు - చిన్నకృష్ణుడు
 3. తెలుగుతల్లి - పెంటు
 4. సతీ సక్కుబాయి
 5. వీరకుంకుమ
 6. వాస్తవం
 7. రాజకీయ గయోపాఖ్యానం
 8. ఇదా ప్రపంచం
 9. భయం
 10. వీరకుంకుమ
 11. జైజవాన్
 12. భలేపెళ్ళి
 13. ఉలిపికట్టె
 14. పరివర్తన
 15. తుఫాన్

నటించిన నాటికలు - పాత్రలు[మార్చు]

 1. పెండింగ్ ఫైల్
 2. నథింగ్ బట్ ట్రూత్
 3. చీకటితెరలు
 4. దేవుడూ నిద్రలే

రచించిన నాటికలు[మార్చు]

 1. శ్రీ తిరుపతమ్మ కథ
 2. యజ్ఞపత్రుడు
 3. శ్రీహరివిలాసం

మూలాలు[మార్చు]

 • కందుల రాజారావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 223.