Jump to content

కటారి దేవేందర్ రావు

వికీపీడియా నుండి
కటారి దేవేందర్ రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2004
ముందు జువ్వాడి చంద్రశేఖర్ రావు
తరువాత ఎం. సత్యనారాయణరావు
నియోజకవర్గం కరీంనగర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1946
చెందోలి గ్రామం, గొల్లపల్లి మండలం జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం 09 అక్టోబర్ 2018
కరీంనగర్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు వెంకటేశ్వర రావు
జీవిత భాగస్వామి మంగాదేవి
నివాసం కరీంనగర్
వృత్తి రాజకీయ నాయకుడు

కఠారి దేవేందర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో కరీంనగర్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కటారి దేవేందర్ రావు 1981లో జరిగిన కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో సవరన్ స్ట్రీట్ ప్రాంతం నుంచి ఇండిపెండెంట్ కౌన్సిలర్‌గా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. ఆయన 1985లో అప్పటి మున్సిపల్ చైర్మన్ నరహరిపై అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ మద్దుతుతో మున్సిపల్ చైర్మన్‌గా తొలిసారి ఎన్నికయ్యాడు. దేవేందర్ రావు 1987లో జరిగిన మున్సిపల్ చైర్మన్ ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి చైర్మన్‌గా, 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి చైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

కటారి దేవేందర్ రావు 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి చంద్రశేఖర్ రావు పై ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2008లో టీడీపీకి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ప్రజారాజ్యం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. ENTRANCE INDIA (9 October 2018). "Karimnagar 1999 Assembly MLA Election Telangana". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  2. CEO Telangana (2009). "Devender Rao Katari Affidavit" (PDF). Archived from the original (PDF) on 13 April 2022. Retrieved 13 April 2022.