కట్టమూరు (పెద్దాపురం మండలం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?కట్టమూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°05′N 82°08′E / 17.08°N 82.13°E / 17.08; 82.13
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 35 మీ (115 అడుగులు)
జిల్లా(లు) తూర్పు గోదావరి జిల్లా
జనాభా 9,054 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను

• 533437
• ++91 8852


కట్టమూరు, తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 533437. ఈ గ్రామము మండల కేంద్రం పెద్దాపురమునకు 4 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ వూరికి దగ్గరగా జే.తిమ్మాపురం, కాండ్రకోట, సిరివాడ గ్రామములు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

కట్టమూరు గ్రామము చాలా పురాతనమైన, పేరెన్నికగన్న గ్రామము. ఈ గ్రామము గురించి కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన "రాజశేఖర చరిత్ర"లో కూడా ప్రస్తావించబడింది.

ఈ గ్రామమునకు కట్టమూరు అను పేరు 'కట్నం ఊరు ' అనే పదం నుంచి వచ్చింది. దీనికి కారణము అప్పటి వత్సవాయ వంశమునకు చెందిన "పద్మాపురము" (ఇప్పుడు పెద్దాపురముగా పిలవబడుఛున్నది) సంస్థానాదీసుడు ఈ ఊరిని పట్టాభిరాములవారికి కట్నముగా సమర్పించారు. పెద్దాపురం మహారాజా శ్రీ రాజా రాయపరాజ మహారాజు గారు (1607-1649)

శ్రీ రామునకుఁ కట్టమూరున గట్టించే గుళ్ళూ గోపురములు మంటపములు,
గంభీర జల తటాకమును త్రవ్వించె గృహస్తపురంబున సుస్థిరముగఁ
బొలుపుగా వాల్మీకిపురి కాండ్రకోటను ఫలభూజవాటికల్ పదిలపరచే"

ఏనుగు లక్ష్మణ కవి రచించిన రామ విలాసములో వర్ణించాడు

వ్యవసాయం, నీటి వనరులు[మార్చు]

కట్టమూరు గ్రామ ప్రజలు చాలా వరకు వ్యవసాయం మీద అధారపడి జీవించుచున్నారు. వరి, చెఱకు ముఖ్యమైన పంటలు. ఇక్కడి మెట్ట ప్రాంతంలో కర్ర పెండలము దుంప పండించెదరు.

కట్టమూరు గ్రామమునకు ముఖ్యమైన జల వనరు ఏలేరు కాలువ. ఈ కాలువ ఏలేశ్వరం దగ్గిర మొదలై, ఈ గ్రామము మీదుగా వెళుతూ చివరకు కాకినాడ దగ్గిర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంకా ఇక్కడ మంచి నీటి చెఱువు, రాయన చెఱువు, బాపనవీధి చెఱువు, కిత్తా చెఱువులు,గంగరావి చెఱువులు కూడా ఉన్నాయి. ఈ చెఱువుల నీటిని పశువుల త్రాగునీటి కొరకు మరియు పంటపొలాల కొరకు ఉపయోగించెదరు.

సౌకర్యాలు[మార్చు]

కట్టమూరు గ్రామములో ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మూదు మండల ప్రజా పరిషత్ పాఠశాలలు గలవు.

ప్రార్ధనా స్థలాలు[మార్చు]

ఇక్కడ ప్రఖ్యాతమైన పట్టాభిరాములవారి గుడి మరియు కేశవ స్వాములవారి గుడి ఉంది. ఈ రెండు గుడులు ఒకే ఆవరణలో ఉండటం వల్ల అక్కడ ప్రజలు ఈ గుడిని "జోడుగుళ్ళు" అని పిలిచెదరు. ఒక గుడిలో పట్టాభిరామ స్వామి వారు సీతాదేవి, లక్షణుడు, ఆంజనేయ స్వామితో కొలువుతీరి ఉందురు. మరియొక గుడిలో కేశవ స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉందురు. ఇక్కడ ప్రతీ యేటా ఫిబ్రవరిలో వచ్చే భీష్మ ఏకాదశి నాడు జాతర జరుపుదురు.

ఇంకా ఈ ఊరిలో శివాలయము, వినాయకుని గుడి, షిరిడి సాయిబాబావారి దేవాలయము, వీరబ్రహ్మం గారి ఆలయము, ఊరి మొదట్లో కనకదుర్గ గుడి, ఊరి చివరన పోలేరమ్మ తల్లి ఆలయము, ఇంకా శ్రీరాముని కోవెలలు, ఆంజనేయుని గుడులు ఉన్నాయి.

విశేషాలు[మార్చు]

ఈ గ్రామము నుంచి కొద్ది మంది చదువులకు, ఉద్యోగములకు విదేశములకు వెళ్ళియుండిరి.

జనాభా[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారము:

మొత్తము
గృహములు : 2350
మొత్తము జనాభా: 9054
పురుషుల సంఖ్య: 4587
స్త్రీల సంఖ్య: 4467
6 సం. లోపు పిల్లలు : 1236
6 సం. లోపు మగపిల్లలు : 0657
6 సం. లోపు ఆడ పిల్లలు: 0579
మొత్తము అక్షరాష్యులు: 4372
మొత్తము నిరక్షరష్యులు : 4782

మూలాలు[మార్చు]