కనుమలూరు వెంకటశివయ్య

వికీపీడియా నుండి
(కనమలూరు వెంకటశివయ్య నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కనుమలూరు వెంకటశివయ్య ప్రముఖ సాహితీవేత్త. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసస్‌లో పనిచేసి పదవీ విరమణ చేశాడు[1] ఉద్యోగంలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్టుకు డైరెక్టరుగా పనిచేశాడు[2].ఇతడు సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలలో విశేషమైన కృషి చేశాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి మండలం, అప్పలాయిగుంట గ్రామానికి చెందినవాడు. ఇతని తండ్రి ఆంధ్ర పండితుడు. ఇతడు దేశ విదేశాలలో అనేక సాహితీ ప్రసంగాలు చేసాడు.[3] కవితా సమ్మేళనాలలో పాల్గొన్నాడు.[4] ఈయన ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం వారు 1983లో ప్రచురించిన పుస్తకం కావ్య సమీక్షలు లో జక్కన వ్రాసిన విక్రమార్క చరిత్రము పై కావ్యసమీక్ష వ్రాసాడు.[5] భువన విజయం మొదలైన పలు సాహిత్యరూపకాలలో పాల్గొన్నాడు. ఈయన 1933వ సంవత్సరంలో పుట్టారు.[6]

రచనలు[మార్చు]

 1. శివామోదం
 2. సుందరకాండ
 3. శివాలోకం
 4. శివసూక్తం
 5. బుద్ధ ప్రసాద్ కల్యాణ దశకం
 6. శివభారతి
 7. శివసాహితీ కదంబం
 8. శివానువాదం
 9. వాల్మీకి రామాయణంలో వనితల దర్శనం-భాషణం
 10. Social Value in Epics
 11. భారతం పై తీర్పు ( Drama- Pressure Day Court scene) [7]

పురస్కారాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ తెలగ కాపు బలిజ సంఘం ఆధ్వర్యంలో 2012 లో ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది వేడుకలను లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్డులోని సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కనమలూరి వేంకటశివయ్యచే పంచాంగ పఠనం, ఉగాది సందేశం నిర్వహించారు. తరువాత ఆయనకు కాపురత్న పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు.[2]

మూలాలు[మార్చు]

 1. famous people in kapunadu
 2. 2.0 2.1 "ఘనంగా నందననామ ఉగాది వేడుకలు". andhrabhoomi.net. 24 March 2012. Retrieved 29 January 2016. Cite news requires |newspaper= (help)
 3. a literary speech by Kanumula Venkata Sivayya in DC
 4. REVIEW FOR PADYALA PANDIRI - A...
 5. కావ్య సమీక్షలు, సంపాదకులు: డా. ఎం.వి. సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం, 1983.
 6. పరిణతవాణి 6వ సంపుటి. కనుమలూరు వెంకటశివయ్య (సాయి లిఖిత ప్రింటర్స్ సంపాదకులు.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 286. |access-date= requires |url= (help)
 7. పరిణతవాణి 6వ సంపుటి. కనుమలూరు వెంకటశివయ్య (సాయి లిఖిత ప్రింటర్స్ సంపాదకులు.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 292. |access-date= requires |url= (help)

ఇతర లింకులు[మార్చు]