కన్నవారిల్లు
కన్నవారిల్లు (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రత్యగాత్మ |
---|---|
తారాగణం | నారాయణరావు, సీమ |
సంగీతం | ఆదినారాయణరావు |
ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్.కృష్ణారావు |
నిర్మాణ సంస్థ | అంజలీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కన్నవారిల్లు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆదినారాయణరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1978, మే 20వ తేదీ విడుదల అయ్యింది.
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]సంఖ్య | పాట | నేపథ్యగానం | గీతరచన | సంగీతం |
---|---|---|---|---|
1. | గడసరి అమ్మాయి నడుమొక సన్నాయి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
సి.నా.రె | పి.ఆదినారాయణరావు |
2. | విరిసిన ఆనంద దీపావళి | పి.సుశీల | వేటూరి | పి.ఆదినారాయణరావు |
3. | మూడు ముళ్లు పడిన నాడే ముగ్గురమైనాములే | వేటూరి | పి.ఆదినారాయణరావు | |
4. | నాచూపు నీపైన | సి.నా.రె. | పి.ఆదినారాయణరావు |
చిత్రకథ
[మార్చు]అయిదుగురు ఆడపిల్లల తండ్ర్రి రామారావు. అనుకూలవతి అయిన భార్య శారద. పూలబాటపి సాఫీగా సాగిపోతున్న పచ్చని సంసార నౌక వారిది. అయిదుగురు కుమార్తెలకు వారికి నచ్చిన వారితో వివాహం చేసి, తండ్రిగా తన బాధ్యత తీర్చుకుంటాడు రామారావు. అయితే జీవనయాత్రలో సహజమైన ఒడిదుడుకులు రామారావు ఎదుర్కొనక తప్పలేదు. సాఫీగా సాగిపోతున్న అతని సంసారం ఇబ్బందుల పాలవుతుంది. కుమార్తెల వివాహం కోసం కొట్టు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు తీర్చలేక పోవడంతో కొట్టు వేలం వేయబడి, ఆ కుటుంబానికి జీవనాధారం పోతుంది. పైలట్‌గా పనిచేస్తున్న పెద్ద అల్లుడు విమాన ప్రమాదానికి గురికావడంతో నిరాధార అయిన పెద్ద కుమార్తె లక్ష్మి తండ్రి పంచన చేరుతుంది. మరో కుమార్తె ఉమ భర్త రాజు దొంగనోట్ల కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉమ, కార్మికులలో అలజడిరేపిన నేరానికి భర్త శంకరం జైలు పాలుకావడంతో మరో కుమార్తె విమల, అత్తగారి చేత ఇంటి నుండి గెంటి వేయబడిన కమల, తనకు సంతానయోగం లేదని తెలిసి తన భర్తకు రెండవ వివాహం చేయడానికి మామగారు ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని కుమిలిపోయిన రమ కూడా కన్నవారింటికి వస్తారు. కుమార్తెలు కళకళలాడుతూ కాపురాలు చేసుకుంటూ ఉంటే చూసి ఆనందించాలని కలలుగన్న రామారావుకు ఈ సంఘటనలతో మనస్సు వికలమౌతుంది. అయితే ఈ కష్టాలన్నీ తాత్కాలికమై మళ్లీ కుమార్తెల సంసారాలు చక్కబడతాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ గాంధీ (26 May 1978). "చిత్ర సమీక్ష - కన్నవారిల్లు". ఆంధ్రపత్రిక. p. 4. Retrieved 15 October 2016.[permanent dead link]