Jump to content

కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి

వికీపీడియా నుండి
కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 మే 19 - ప్రస్తుతం

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డీజీపీ)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
15 ఫిబ్రవరి 2022 - 2024 మే 5

వ్యక్తిగత వివరాలు

జననం 1960
పర్లపాడు గ్రామం, రాజుపాలెం మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
వృత్తి పోలీస్ అధికారి (ఐపీఎస్ అధికారి)

కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన 2022 ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్(డీజీపీ)గా నియమితుడయ్యాడు.[1] అంతకుముందు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా విధులు నిర్వహించాడు.[2]

వృత్తి జీవితం

[మార్చు]

కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్​కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన 1994లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఏఎస్పీగా మొదటి పోస్టింగ్​లో బాధ్యతలు చేపట్టి 1996లో వరంగల్ జిల్లా జనగాంలో ఏఎస్పీగా, అనంతరం వరంగల్ ఏఎస్పీగా, 1996-97 వరకు కరీంనగర్​లో ఆపరేషన్స్ ఏఎస్పీగా విధులు నిర్వహించాడు.

కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి 1997 నుండి 1999లో విశాఖపట్నం రూరల్ ఎస్పీగా అనంతరం, సీఐడీ ఎస్పీ, గుంతకల్లు రైల్వే ఎస్పీ, విజయవాడ రైల్వే ఎస్పీగా, నెల్లూరు ఎస్పీ, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా, 2006 నుండి 2008 వరకు ఎక్సైజ్ శాఖలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టర్​గా, 2008 నుండి 2010 వరకు విజయవాడ పోలీస్ కమిషనర్‌ , 2010నుండి 2011 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌​ డీఐజీగా, ఐజీగా, 2011 నుండి 2013 వరకు నార్త్ కోస్టల్ ఐజీగా, 2013 నుండి 2014 వరకు హైదరాబాద్ వెస్ట్‌జోన్‌ ఐజీగా, రాష్ట్ర విభజన అనంతరం 2015 నుండి 2017 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పని చేశాడు.[3]

కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి 2018 నుండి 2019 వరకు డ్రగ్ కంట్రోల్ డీజీగా , 2019 నుండి 2020 వరకు విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ డీజీగా నియమితుడై 2020 నుంచి ఇంటెలిజెన్స్ డీజీగా[4]అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ 2022 ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్(డీజీపీ)గా అదనపు బాధ్యతలను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5][6]కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఫిబ్రవరి 19న భాద్యతలు చేపట్టాడు.[7][8]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్బంగా 2024 మే 5న రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది.[9] ఆయన 2024 జూన్ 19న రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.[10]

పురస్కారాలు

[మార్చు]

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పోలీస్‌ విభాగాల్లో సేవలందించిన వారికి నాలుగు రకాల మెడల్స్‌ను కేంద్ర హోంశాఖ అందజేస్తుంది. 2020సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)[11]గా ఉన్న కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 February 2022). "ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  2. Sakshi Education (12 August 2020). "ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రాజేంద్రనాథ్‌రెడ్డి". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  3. Sakshi (15 February 2022). "ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  4. The New Indian Express (12 August 2020). "KVRN Reddy is new Intelligence chief of Andhra Pradesh". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  5. Eenadu (15 February 2022). "సవాంగ్‌ బదిలీ.. ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి." Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  6. Andhra Jyothy (16 February 2022). "డీజీపీగా కసిరెడ్డి". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  7. HMTV (19 February 2022). "ఏపీ కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  8. Andhra Jyothy (19 February 2022). "ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్‌రెడ్డి". andhrajyothy. Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  9. EENADU (6 May 2024). "ఏపీ డీజీపీపై బదిలీ వేటు". Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  10. Hindustantimes Telugu (20 June 2024). "ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ - ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా మాజీ డీజీపీ". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  11. Sakshi (26 January 2020). "విజిలెన్స్‌ డీజీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ పతకం". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.