కాడ్మియం నైట్రేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాడ్మియం నైట్రేట్
Skeletal formula of cadmium chloride
Crystal of cadmium chloride
పేర్లు
IUPAC నామము
Cadmium(II) nitrate
ఇతర పేర్లు
Nitric acid, cadmium salt
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10325-94-7]
యూరోపియన్ కమిషన్ సంఖ్య 233-710-6
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:77732
SMILES [Cd+2].[O-][N+]([O-])=O.[O-][N+]([O-])=O
ధర్మములు
Cd(NO3)2
స్వరూపం White crystals, hygroscopic
వాసన Odorless
సాంద్రత 3.6 g/cm3 (anhydrous)
2.45 g/cm3 (tetrahdyrate)[1]
ద్రవీభవన స్థానం 360 °C (680 °F; 633 K)
at 760 mmHg (anhydrous)
59.5 °C (139.1 °F; 332.6 K)
at 760 mmHg (tetrahydrate)[1]
బాష్పీభవన స్థానం 132 °C (270 °F; 405 K)
at 760 mmHg (tetrahydrate)[2]
109.7 g/100 mL (0 °C)
126.6 g/100 mL (18 °C)
139.8 g/100 mL (30 °C)
320.9 g/100 mL (59.5 °C)[3]
ద్రావణీయత Soluble in acids, ammonia, alcohols, ether, acetone
అయస్కాంత ససెప్టిబిలిటి −5.51·10−5 cm3/mol (anhydrous)
−1.4·10−4 cm3/mol (tetrahydrate)[1]
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Cubic (anhydrous)
Orthorhombic (tetrahydrate)[1]
Fdd2, No. 43 (tetrahydrate)[4]
mm2 (tetrahydrate)[4]
α = 90°, β = 90°, γ = 90°
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS06: ToxicGHS08: Health hazardGHS09: Environmental hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదం Danger
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H301, H330, H340, H350, H360, H372, H410
GHS precautionary statements P201, P260, P273, P284, P301+310, P310
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R25, R26, మూస:R45, మూస:R46,మూస:R48/23/25, R50/53, R60, R61
S-పదబంధాలు S28, మూస:S36/37, S45, S53, S60, S61
Lethal dose or concentration (LD, LC):
300 mg/kg (rats, oral)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
[1910.1027] TWA 0.005 mg/m3 (as Cd)
REL (Recommended)
Ca[5]
IDLH (Immediate danger)
Ca [9 mg/m3 (as Cd)]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Zinc nitrate
Calcium nitrate
Magnesium nitrate
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

కాడ్మియం నైట్రేట్ఒక అకర్బన రసాయన సమ్మేళనం.నిర్జల కాడ్మియం నైట్రేట్ రసాయన ఫార్ములా Cd (NO3) 2.ఆర్ద్ర కాడ్మియం నైట్రేట్ ల సాధారణ రసాయనఫార్ములా Cd (NO3) 2.xH2O.ఈ రసాయన సమ్మేళనంలో కాడ్మియం లోహంతో పాటు నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ పరమాణువుల సంయోగం వలన ఈ రసాయన సంయోగ పదార్థం ఏర్పడినది.ఈ సంయోగ పదార్థాలలో నిరాకార, అషౌష్టవ రకం చెందినది, వోలటైల్ (తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారు/బాష్పీకరణ చెందు పదార్థాలు) పదార్థం కాగా, మిగిలినవి లవణాలు.. కాడ్మియం నైట్రేట్ సమూహానికి చెందిన అన్నియు రంగులేని స్పటికాకృతి ఘనపదార్థాలు.ఇవ్వన్నియు గాలిలోని తేమ/చెమ్మను పీల్చుకొని తడిగా /చెమ్మగా మారును.కాడ్మియం సంయోగ పదార్థాలు కాన్సరు కారకాలుగా గుర్తింపబడినవి.

భౌతిక ధర్మాలు[మార్చు]

భౌతిక స్థితి[మార్చు]

కాడ్మియం నైట్రేట్ తెల్లని స్పటికరూప ఘనపదార్థం.ఆర్ద్రతాకర్షణ కల్గిన రసాయన సమ్మేళనపదార్థం.వాసన రహితం.

సాంద్రత[మార్చు]

సాధారణ 25 °C ఉష్ణోగ్రతవద్ద నిర్జల /అనార్ద్ర కాడ్మియం నైట్రేట్ సాంద్రత 3.6గ్రాములు/సెం.మీ3.నాలుగు జలాణువులు కల్గిన ఆర్ద్ర/జలయుత (tetrahdyrate) కాడ్మియం నైట్రేట్ సాంద్రత 2.45గ్రాములు/సెం.మీ3

ద్రవీభవన ఉష్ణోగ్రత[మార్చు]

సాధారణ వాతావరణ పీడనం దగ్గర (760 mmHg) నిర్జల /అనార్ద్ర కాడ్మియం నైట్రేట్ ద్రవీభవన స్థానం 360 °C (680 °F; 633K)., నాలుగు జలాణువులు కల్గిన ఆర్ద్ర కాడ్మియం నైట్రేట్ ద్రవీభవన స్థానం 59.5 °C (139.1 °F;332.6 K)

బాష్పీభవన ఉష్ణోగ్రత[మార్చు]

నాలుగు జలాణువులుకల్గిన ఆర్ద్ర కాడ్మియం నైట్రేట్ బాష్పీభవన స్థానం, సాధారణ వాతావరణ పీడనం దగ్గర (760 mmHg) 132 °C (270 °F; 405K)

ద్రావణీయత[మార్చు]

నీటిలో కరుగును. 100 మీ.లీ నీటిలో 0 °C వద్ద 109.7 గ్రాములు, 18 °C దగ్గర126.6 గ్రాములు, 30 °C వద్ద139.8 గ్రాములు, 59.5 °C వద్ద 320.9 గ్రాములు కరుగును.కాడ్మియం నైట్రేట్ ఇంకను ఆమ్లాలలో కరుగును.అమ్మోనియా, ఆల్కహాల్లు, ఇథర్,, ఎసిటోన్ లలోకూడా కరుగును.

ఉత్పత్తి[మార్చు]

కాడ్మియం లోహాన్ని లేదా కాడ్మియం ఆక్సైడ్ను నైట్రిక్ ఆక్సైడ్ లో కరగించి, పిమ్మట స్పటికికరించడం (crystallization) ద్వారా కాడ్మియం నైట్రేట్ ను ఉత్పత్తి కావింతురు.

Cd + 4 HNO3 → 2 NO2 + 2 H2O + Cd(NO3)2
CdO + 2HNO3 → Cd(NO3)2 +H 2O

అలాగే కాడ్మియం హైడ్రాక్సైడ్ లేదా కాడ్మియం కార్బోనేట్ను కూడా నైట్రిక్ ఆక్సైడ్ లో కరగించి, పిమ్మట స్పటికికరించడం (crystallization) ద్వారా కాడ్మియం నైట్రేట్ ను ఉత్పత్తి కావింతురు.

CdCO3 + 2 HNO3 → Cd(NO3)2 + CO2 + H2O

రసాయన చర్యలు[మార్చు]

అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాడ్మియం నైట్రేట్ విఘటన/వియోగం చెందటం వలన కాడ్మియం ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లను ఉత్పత్తి చేయును.ఆమ్లీకృతకాడ్మియం నైట్రేట్ ద్రావణం ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువును ప్రసరింపచేసిన, పసుపు వర్ణపు కాడ్మియం సల్ఫైడ్ ఏర్పడును.

కాస్టిక్ సోడా (సోడియం హైడ్రాక్సైడ్) ద్రావణంతో కాడ్మియం ఆక్సైడ్ చర్య వలన కాడ్మియం హైడ్రాక్సైడ్ అవక్షేపంగా ఏర్పడును.పలు కాడ్మియం లవణాలను ఇలా అవక్షేపరూపాలలో వేరు చేయవచ్చును.

ఉపయోగాలు[మార్చు]

కాడ్మియం నైట్రేట్ ను గాజు, పింగాణి వస్తువులకు రంగును ఇచ్చుటకై ఉపయోగిస్తారు.అలాగే పోటోగ్రఫిలో ఫ్లాష్‌పౌడర్ గా ఉపయోగిస్తారు.

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 Lide, David R., ed. (2009). CRC Handbook of Chemistry and Physics (90th ed.). Boca Raton, Florida: CRC Press. ISBN 978-1-4200-9084-0.
  2. 2.0 2.1 "MSDS of Cadmium nitrate tetrahydrate". fishersci.ca. Fisher Scientific. Retrieved 2014-06-25.
  3. Seidell, Atherton; Linke, William F. (1919). Solubilities of Inorganic and Organic Compounds (2nd ed.). New York: D. Van Nostrand Company. p. 178.
  4. 4.0 4.1 James, D. W.; Carrick, M. T.; Leong, W. H. (1978). "Raman spectrum of cadmium nitrate". Australian Journal of Chemistry. 31 (6): 1189. doi:10.1071/CH9781189.
  5. NIOSH Pocket Guide to Chemical Hazards. "#0087". National Institute for Occupational Safety and Health (NIOSH).