కిళాంబి కృష్ణమాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిళాంబి కృష్ణమాచార్యులు
Kilambi Krishnamacharyulu.jpg
జననంమే 5, 1900
సామర్లకోట
మరణంజూలై 27, 1959
జాతీయతభారతీయుడు
జాతితెలుగు
వృత్తిరంగస్థల నటుడు, దర్శకుడు , నాట్యాచార్యుడు
తల్లిదండ్రులుసుబ్బయ్య, సుబ్బమ్మ

కిళాంబి కృష్ణమాచార్యులు (మే 5, 1900 - జూలై 27, 1959) రంగస్థల నటుడు, దర్శకుడు, నాట్యాచార్యుడు.[1]

జననం[మార్చు]

కృష్ణమాచార్యులు 1900, మే 5న ధర్మాచార్యుల, చూడమాంబ దంపతులకు సామర్లకోటలో జన్మించాడు.

నాటకరంగ ప్రస్థానం[మార్చు]

పండితుల కుటుంబం కనుక కృష్ణమాచార్యులుకు సంగీత సాహిత్యాలు వంశపారంపర్యంగా వచ్చాయి. చిన్నతనంలోనే ఆరాధనోత్సవాలలో పాటలు పాడుతూ సంగీతాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. అంతేకాకుండా, నాటక లక్షణ గ్రంథాలు చదివి నాటకకళలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే కాకినాడకు వెళ్లి, వెదురుమూడి శేషగిరిరావు, ముప్పిడి జగ్గరాజు, ఆలమూరు పట్టాభిరామయ్య మొదలైన మహానటులతో కలిసి నటించడమేకాకుండా, అనకాపల్లి లోని లలితా సమాజం ప్రదర్శించిన ప్రదర్శనలలో నటించాడు. 1917లో లలితా సమాజానికి కొంతకాలం ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశాడు. నటులకు శిక్షణ ఇవ్వడంలో తగిన ప్రతిభ కలవాడు. ఈయన శిక్షణలో రూపొందిన నటులు నాటక, సినీరంగాలలో రాణించారు. ఈయన నాటక కృషిని గుర్తించి ఆంధ్ర నాటక కళా పరిషత్తు 1950లో ఘనంగా సన్మానించింది.

దర్శకత్వం చేసినవి[మార్చు]

  1. అనార్కలి
  2. చాణక్య
  3. ఆంధ్రశ్రీ
  4. వేనరాజు
  5. కురుక్షేత్రం

నటించిన పాత్రలు[మార్చు]

మరణం[మార్చు]

1957లో కృష్ణమాచార్యులుకు చక్కెర వ్యాధి రావడంతో కుడికాలు తొలగించవలసివచ్చింది. 1959, జూలై 27న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. కిళాంబి కృష్ణమాచార్యులు, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.263.