కిషోరి సిన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిషోరి సిన్హా
వైశాలి లోక్ సభ నియోజకవర్గం
In office
1980–1989
భారతదేశ ప్రధానమంత్రిఇందిరా గాంధీ,
రాజీవ్ గాంధీ
అంతకు ముందు వారుదిగ్విజయ్ నారాయణ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం1925 మార్చి 25
బీహార్, భారతదేశం
మరణం2016 డిసెంబర్ 19
పాట్నా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్,
జీవిత భాగస్వామిసత్యేంద్ర నారాయణ్
సంతానంనిఖిల్ కుమార్
నివాసం, పాట్నా
As of సెప్టెంబర్ 7, 2008
Source: [1]

కిషోరి సిన్హా ( 1925 మార్చి 25 - 2016 డిసెంబరు 19) ఒక భారతీయ రాజకీయవేత్త, [1] సామాజిక కార్యకర్త, న్యాయవాది వైశాలి నియోజకవర్గం నుండి రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికయింది.[1][2][3] కిషోరిసిన్హా బీహార్ మాజీ ముఖ్యమంత్రి సత్యేంద్ర నారాయణ్ సిన్హాను వివాహం చేసుకుంది, ఆయన ఔరంగాబాద్ నియోజకవర్గం నుండి ఏడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు.[4][5][6] ఆమె కుమారుడు నిఖిల్ కుమార్ కేరళ గవర్నర్‌గా నాగాలాండ్ గవర్నర్‌గా పనిచేశారు.[7]

రాజకీయ జీవితం[మార్చు]

కిషోరి సిన్హా 1980లో వైశాలి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు ఆ; నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి మహిళ. కిషోరి సిన్హా 1984లో మళ్లీ ఆ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కిశోరి సిన్హా ఆమె భర్త సత్యేంద్ర నారాయణ్ సిన్హా [8] ఇద్దరూ ఆ సంవత్సరంలో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కిషోరిసిన్హా [1] రాజకీయ జీవితం ఆరు దశాబ్దాలకు పైగా సాగింది.

మరణం[మార్చు]

పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కిశోరీ సిన్హా శస్త్రచికిత్స తర్వాత కోలుకో సాగింది. ఆకస్మాత్తుగా ఒక రోజు ఆమె అనారోగ్యం విషమించింది.[9] దీంతో ఆమె కన్ను మూసింది. బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్, నితీష్ కుమార్, బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, జితన్ రామ్ మాంఝీ, జగన్నాథ్ మిశ్రా, బీజేపీ నేతలు రాజీవ్ ప్రతాప్ రూడీ, మంగళ్ పాండే, సుశీల్ కుమార్ మోదీ తదితరులు, కాంగ్రెస్ నేతలు అశోక్ చౌదరి, సుబోధ్ కాంత్ సహాయ్, ఆర్జెడి నాయకులు శివానంద్ తివారీ, రామచంద్ర పూర్వే, ముండ్రికా సింగ్ యాదవ్ ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు.

అంత్యక్రియలు[మార్చు]

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ [9] కిషోరి సిన్హా అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో చెయ్యాలని అధికారులను ఆదేశించారు.[10]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Staff, PatnaDaily. "Former MP and Social Activist Kishori Sinha Cremated with Full State Honors - PatnaDaily". patnadaily.com. Archived from the original on 26 డిసెంబర్ 2016. Retrieved 20 January 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "Kishori Sinha, former MP". Election commission. Archived from the original on 20 April 2008. Retrieved 2008-02-04.
  3. "Vaishali MP-Kishori Sinha". Parliament of India. Retrieved 2008-07-06.
  4. Official website. "PM condoles passing away of Satyendra Narayan Sinha". PM's Messages. Archived from the original on 13 June 2011. Retrieved 2006-09-05.
  5. Magnificent Bihar. "Nikhil Kumar On Bihar". Archived from the original on 8 December 2007. Retrieved 2007-09-20.
  6. Home Page on the Parliament of India's Website]. "Member Bio Data". Loksabha. Archived from the original on 3 July 2011. Retrieved 2006-09-25. {{cite web}}: |last= has generic name (help)
  7. "Former MP Kishori Sinha dies after a protracted illness". webindia123.com. Archived from the original on 20 December 2016. Retrieved 20 January 2017.
  8. "7th Lok Sabha youngest in India's 28-year history of parliaments 15021980". indiatoday.in. Retrieved 20 January 2017.
  9. 9.0 9.1 Staff, PatnaDaily. "Kishori Sinha, Wife of former CM S. N. Sinha, is no more - PatnaDaily". patnadaily.com. Archived from the original on 25 డిసెంబర్ 2016. Retrieved 20 January 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  10. "Ex-MP Kishori Sinha dies passes away". intoday.in. Retrieved 20 January 2017.