కూచాద్రి వేంకటేశ్వరస్వామి దేవాలయం
కూచాద్రి వేంకటేశ్వరస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°04′05″N 78°13′44″E / 18.068062°N 78.228870°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | మెదక్ జిల్లా |
ప్రదేశం: | కూచన్‌పల్లి, హవేలిఘన్‌పూర్ మండలం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వేంకటేశ్వరుడు |
ప్రధాన దేవత: | శ్రీదేవి, భూదేవి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | హిందూమతము |
కూచాద్రి వేంకటేశ్వరస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం , మెదక్ జిల్లా, హవేలిఘన్‌పూర్ మండలంలోని కూచన్‌పల్లి గ్రామంలోని కొండపై ఉన్న హిందూ దేవాలయం.[1] గ్రామానికి పశ్చిమం వైపు కొండపై ఉన్న ఈ దేవాలయాన్ని స్థానికంగా “కుచాద్రి” అని పిలుస్తారు, ఇక్కడ వేంకటేశ్వరస్వామి తన భార్యలైన శ్రీదేవి, భూదేవిలతో పాటుకొలువై ఉన్నాడు.
చరిత్ర
[మార్చు]ఈ దేవాలయం చరిత్ర గురించి తెలిపే సరైన ఆధారాలు లేవు. ఇక్కడి శిల్పాలు, స్తంభాలు, మండపాల ఐకానోగ్రాఫికల్ లక్షణాల ఆధారంగా ఇది 10 – 11 వ శతాబ్దంకు చెందిన దేవాలయంగా పరిగణిస్తున్నారు.
వివరాలు
[మార్చు]పూజారులు, భక్తులు గర్భగుడికి చేరుకోవడానికి రెండు భారీ రాళ్ళ మధ్యను ప్రాక్కుంటూ వెళ్ళాల్సివుంటుంది. దేవాలయం ఉన్న కొండకు ఈశాన్యంపైపు ఒక కోనేరు ఉంది. ఈ కొనేరులో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. ఇందులో మంచినీరు వచ్చే రంధ్రాలు ఉన్నాయిని ఇక్కడి భక్తులు నమ్ముతుంటారు. కోనేరుకు దక్షిణ, ఉత్తర భాగాల్లో నాలుగు స్తంభాల మంటపాలు (రెండు) ఉన్నాయి.
గుర్తింపు
[మార్చు]ఈ దేవాలయాన్ని 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది.[2][3][4]
పునరుద్ధరణ
[మార్చు]ఈ దేవాలయ పునరుద్ధరణకు తిరుమల తిరుపతి దేవస్థానం 2019 జూన్ నెలలో అంగీకరించింది. మన్సన్‌పల్లికి చెందిన పర్వయ్యగారి నర్సింహారావు కుటుంబ సభ్యులు దేవాలయ పునరుద్ధరణ కోసం రూ .25 లక్షలు విరాళంగా ఇచ్చారు.[5]
ప్రయాణ వివరాలు
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్, వరంగల్, సిద్ధిపేట, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి నుండి మెదక్ కు బస్సులు నడుపబడుతున్నాయి. మెదక్ నుండి కూచన్‌పల్లి వరకు 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సులు/టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ Medak District, Telangana State. "Kuchadri Venkateshwara Swamy temple". www.medak.telangana.gov.in. Archived from the original on 18 January 2021. Retrieved 4 September 2021.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-09-07. Retrieved 2021-09-04.
- ↑ "Kuchadri Venkateswara Swamy Temple in Medak". Archived from the original on 18 July 2016. Retrieved 16 June 2016.
- ↑ "Kuchadri Venkateswara Swamy temple in Medak District". Youtube. Studio N.
- ↑ The Hans India, Telangana (10 June 2019). "Kuchadri temple to be renovated soon". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.