కూరమిరప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొన్ని దేశాల్లో ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ రంగులతో ఉన్న కూరమిరపకాయలను కలిపి ఒక ప్యాకెట్ గా అమ్ముతారు, వీటిని ట్రాఫిక్ లైట్ కూరమిరప అంటారు.

కూరమిరపను ఆంగ్లంలో బెల్ పెప్పర్ అని కారం లేక పోవడంవల్ల లేదా తక్కువ కారం కలిగి ఉండడం వల్ల స్వీట్ పెప్పర్ అని అంటారు. ఈ కాయలు ఎక్కువ కండకలిగి గంట ఆకారంలో ఉండడం వల్ల దీనికి బెల్ పెప్పర్ అని పేరు వచ్చింది. బెంగుళూరు, సిమ్లా పరిసర ప్రాంతాలలో విరివిగా సాగు చేయడం వల్ల వీటిని బెంగుళూరు మిరప, సిమ్లా మిర్చి అని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ మిరపకాయల్లో కారం లేకపోవడం లేదా తక్కువగా ఉండడం వల్ల వీటిని మామూలు మిరపకాయలలాగా కాకుండా కూరగాయలాగా వాడాలి. ఈ కాయలలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉండడంతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి లు టమాటోలో కన్నా ఎక్కువగా ఉంటాయి. ఈ కూరమిరపను టమాటో, వంగ లాంటి పంటలు సాగుచేసే వాతావరణంలో, ప్రదేశాలలో సాగుచేయవచ్చు. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్, మే నెలలు మినహాయించి సంవత్సరంలో ఎప్పుడైనా పంట ప్రారంభించవచ్చు. కానీ మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేసే రంగారెడ్డి, మెదక్, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో రబీ కాలంలో సాగుచేస్తున్నారు. పంట ప్రారంభించడానికి జూలై, ఆగష్టు, ఆక్టోబరు, నవంబరు నెలలు మంచి అదునుగా చెప్పుకోవచ్చు.


పోషక విలువలు[మార్చు]

Peppers, sweet, green, raw
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 20 kcal   80 kJ
పిండిపదార్థాలు     4.64 g
- చక్కెరలు  2.4 g
- పీచుపదార్థాలు  1.7 g  
కొవ్వు పదార్థాలు0.17 g
మాంసకృత్తులు 0.86 g
విటమిన్ A  18 μg2%
థయామిన్ (విట. బి1)  0.057 mg  4%
రైబోఫ్లేవిన్ (విట. బి2)  0.028 mg  2%
నియాసిన్ (విట. బి3)  0.48 mg  3%
పాంటోథీనిక్ ఆమ్లం (B5)  0.099 mg 2%
విటమిన్ బి6  0.224 mg17%
ఫోలేట్ (Vit. B9)  10 μg 3%
విటమిన్ సి  80.4 mg134%
విటమిన్ ఇ  0.37 mg2%
విటమిన్ కె  7.4 μg7%
కాల్షియమ్  10 mg1%
ఇనుము  0.34 mg3%
మెగ్నీషియమ్  10 mg3% 
భాస్వరం  20 mg3%
పొటాషియం  175 mg  4%
సోడియం  3 mg0%
జింకు  0.13 mg1%
Fluoride 2 µg
Link to USDA Database entry
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు

చిత్రమాలిక[మార్చు]


ఇవి కూడా చూడండి[మార్చు]

మిరప

మిరపకాయ

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కూరమిరప&oldid=847647" నుండి వెలికితీశారు