Jump to content

గుమ్మడి

వికీపీడియా నుండి
(కూశ్మాండము నుండి దారిమార్పు చెందింది)


గుమ్మడి
Scientific classification
Kingdom:
Division:
పుష్పించే మొక్కలు - మాగ్నోలియోఫైటా
Class:
ద్విదళబీజాలు - మాగ్నోలియోప్సిడా
Order:
Family:
Genus:
జాతులు

C. maxima
C. mixta
C. moschata
C. pepo

గుమ్మడి లేదా తియ్య గుమ్మడి దీని శాస్త్రీయ నామము "cucurbita pepo లేదా cucuebita mixta ", Pumpkin Cucurbita moschata, N.O. cucurbitaceae.

గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శుభప్రథమైన తరచూ వాడబడు కూర.ఇది ప్రపంచములో అన్ని దేశాలలో దొరుకు తుంది . గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. గుమ్మడి కాయను భారత సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండడం విశేషం. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ చాలా విధాల ఉపయోగపడే గుమ్మడిలో నిజంగా గమ్మత్తైనదే. చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు.

భౌతిక రూపము

[మార్చు]

పూవుయొక్క, కాయయొక్క పరిమాణమున ఈ కుటుంబము లోని జాతులందు గుమ్మడి అగ్రస్థానము వహించును, అందుకే దీనిని గుమ్మడి జాతి అంటారు. పౌష్టిక శక్తిలోకానీ, తినుట కింపుగా ఉండుటయందు కూడా ఇదే మంచిది. గుమ్మడి కాయ రకరకాల వంటగా చేసుకొని తినవచ్చును, జ్యూస్ గా తయారుచేసుకొని తీసుకోవచ్చును, సూప్ లా వాడుకోవచ్చు .. గుమ్మడితీగ చాలా ఎక్కువగా పాకు మోటు జాతి తీగ. కాండము గరుసుగా ఉండు రోమములు కలిగి ఉండునును. ఆకులు హృదయాకారము కలిగినవి. ... కూరగాయలలో అన్నిటికంటే అతి పెద్ద పరిమాణము కలిగినది గుమ్మడి కాయ. ఇది యాబై కిలోల బరువువరకు కూడా కాస్తాయి.

ఔషధ ఉపయోగాలు

[మార్చు]

ఇందులో చాల ఎక్కువగా "బీటా కెరోటిన్ ఉంటుంది, శరీరానికు తక్కువ క్యాలరీలు అందిస్తుంది . కళ్ళకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది . ఇందులో విటమిన్ సి కుడా సంవృద్దిగా లభిస్తుంది . డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది . బి.పి.ని నియంత్రిస్తుంది, పీచు పదార్ధము ఎక్కువగా ఉన్నందున కొలెస్టరాల్ను తగ్గిస్తుంది, గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంభంద వ్యాధులు తగ్గుతాయి .

ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూచుకుంటే మంచిది. వీటిలో మెగ్నీషియం మెండుగా ఉంది. ఇంకా మినరల్స్‌ అత్యధికంగా పోగుపడ్డ గింజలు. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట! గుమ్మడి ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి విత్తనాలు తినడం వలన మలబద్ధకం నివారణ ఆవుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతుంది. తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఆయుర్వేదములో గుమ్మడి :

[మార్చు]
తీయ గుమ్మడి

గుమ్మడికాయ పండినది:-Pumpkin-ripe బాగుగా ముదిరిన, పండిన గుమ్మడి కాయ వండిన మధురముగ నుండును. రుచిబుట్టించును. దేహ పుష్టి, బలము, వీర్యవృద్ధి, మేహశాంతి, దాహము, తాపము, కడుపుబ్బు లను తగ్గించును. చెడు రక్తమును బుట్టించును. అలస్యముగ జీర్ణమగును; వాతము జేయును; దీనికి విరుగుళ్ళు 1 శొంఠి, 2 కాక ఔషధములు, 3 కానుగ వేరు రసము. ఔషధ సేవలో పథ్యమైన వస్తువు. గుమ్మడి కాయ లేతది:- Pumpkin-tender. దీని కూర మిక్కిలి వాతము, రక్త పైత్యము, అగ్నిమాంద్యము జేయును; దుర్బల దేహులు, రోగులు దీనిని పుచ్చుకొనగూడదు; మిక్కిలి అపథ్యమైనది. దీనికి విరుగుళ్ళు గుమ్మడి పువ్వులు :-Flowers of pumpkin plant. పైత్యమును, సన్నిపాతములను హరించును; వీనిని కూరవండుదురు. గుమ్మడికొసల కూర :-Curry of the tender leaves of pumpkin plant. తియ్య గుమ్మడి తీగె కొసలు అనగా లేత ఆకుల కూర ఆమ్ల దోషము, వాతము, గుల్మము, జ్వరము, ఉబ్బు, విదాహము వీని నణచును; జఠరదీప్తి నిచ్చును

పుట్టుక

[మార్చు]

దక్షిణ అమెరికాలోని అతి ప్రాచీన రెడ్ ఇండియన్ సమాధుల్లో లభించిన అవశేషాలను బట్టి వేల ఏండ్ల క్రితం నుంచీ గుమ్మడిని మానవులు ఆహారంగా వాడేవారని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. భారతదేశంలో చరిత్ర పూర్వ యుగాల నుంచీ గుమ్మడిని పండించడం ఉంది. అయినా గుమ్మడి జాతి తొట్టతొలి జన్మస్థలం మాత్రం పదివేల సంవత్సరాలకు పూర్వమే ఉభయ అమెరికా ఖండాల్లో అత్యుష్ణ ప్రాంతాల్లో ఆవిర్భవించిందని వారి అంచనా.

అయితే గుమ్మడి జాతుల్లో కొన్నింటికి ఉన్న సంస్కృత పేర్లు కూడా అతి ప్రాచీన కాలం నాటివని నిర్ధారణ అయింది. ఉభయ అమెరికా ఖండాల నుంచి ఎటువంటి నౌకాయానాలు లేనట్టి అంత ప్రాచీన కాలంలోనే ఈ మొక్క భారతదేశం దాకా ఎలా విస్తరించి ఉంటుందనే దానిపైన కూడా శాస్త్రజ్ఞులు విస్తృతంగా చర్చించారు. చివరికి ఎండిన గుమ్మడిపళ్ళు అతి తేలికైనవైనందున అవి మహాసముద్రాల నీటిపై తేలుతూ, మొలకెత్తే సామర్థ్యం కోల్పోని విత్తనాలతో సహా ఒక ఖండం నుంచి మరో ఖండానికి విస్తరించి, అక్కడ అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తి ఉండవచ్చుననే నిర్ధారణకు వచ్చారు. అమెరికన్లు 'రెడ్ పంప్కిన్' అని పిలిచే మంచి గుమ్మడి భారతదేశంలో ప్రవేశించి, 'లాల్ కుమ్రా' అని పిలువబడుతున్నది.

అమెరికాలోనే పుట్టిన కషో అనే మరో జాతి గుమ్మడిని భారతీయ మార్కెట్లలో 'ఆఫ్రికన్ గోర్డ్' అనడాన్ని బట్టి మూలంలో అమెరికాలో జన్మించిన ఆ జాతి అక్కడ నుంచి ముందు ఆఫ్రికా ఖండానికి విస్తరించి, ఆ తరువాత భారతదేశానికి విస్తరించి ఉంటుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ప్రస్తుతం ఆఫ్రికన్ గోర్డ్‌గా పిలవబడుతున్నప్పటికీ, ఈ జాతి భారతదేశానికి అతి ప్రాచీన కాలంలోనే వచ్చి చేరింది. విచిత్ర వీణ, తంబూరా వంటి సంగీత వాద్యాలు తయారుచేసేందుకు అతి పెద్దవైన ఈ జాతి గుమ్మడి పండు బుర్రల్నే అత్యం త ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఉపయోగించేవారు.

ప్రయోజనాలు

[మార్చు]

గుమ్మడి పండునే కాదు; వాటి లేత ఆకులు, కాండం, పూలు కూడా కూరకు వాడుకుంటారు. గుమ్మడి గింజల్ని తింటారు. హల్వాలు వంటి స్వీట్లలో బాదం, పిస్తా, చార (సార) పప్పు లాగే ఈ గింజలలోని పప్పును కూడా డ్రెస్సింగ్‌గా వాడతారు. కొందరైతే గుమ్మడి పండుతోనే హల్వా చేసుకుంటారు. గుమ్మడిలో పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాక, విటమిన్ ఎ (అధికంగానూ), కొద్దిగా విటమిన్ సి (కొద్దిగానూ) ఉన్నందున అది ఆహారపరంగా విలువైనదని గుర్తించారు. గుమ్మడి పండుకు ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. కడుపులోని 'టేప్ వార్మ్స్' నిర్మూలన కోసం గుమ్మడి గింజల్ని పంచదారతో తినిపిస్తారు.

రాత్రి పడుకోబోయే ముందు తినిపించి, తెల్లవారుఝామునే ఆముదం తాగిస్తారు. గనేరియా, మూత్ర వ్యాధులున్న రోగులకు మూత్రం సాఫీగా వెడలేందుకు గుమ్మడి విత్తులు పంచదార లేక తేనెతో తినిపిస్తారు. సెగగడ్డలు, మొండి వ్రణాలకు గుమ్మడి పండు గుజ్జును మలాం పట్టీగా వేస్తారు. తేళ్ళు, కాళ్ళజెర్రులు, మండ్రగబ్బలు మొదలైనవి కుట్టినప్పుడు, గుమ్మడిపండు తొడిమను ఎండబెట్టి పొడి చేసి, దానితో తయారుచేసిన పేస్టును రాస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది. కాలిన గాయాలకు గుమ్మడి పండు గుజ్జుతో పట్టు వేస్తారు. గుమ్మడి విత్తులు మూత్రకారిగానే కాక, నరాల బలహీనత ఉన్నవారికి టానిక్‌లా పనిచేస్తాయి.

రకములు

[మార్చు]

సూర్య గుమ్మడి

[మార్చు]

పెద్ద గుమ్మడి

[మార్చు]

బూడిద గుమ్మడి

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గుమ్మడి&oldid=4321511" నుండి వెలికితీశారు