Jump to content

కె.ఎస్.వెంకటరామయ్య

వికీపీడియా నుండి
కె.ఎస్.వెంకటరామయ్య
వ్యక్తిగత సమాచారం
జననం (1901-09-01) 1901 సెప్టెంబరు 1 (వయసు 123)
కరూర్, తమిళనాడు
మరణం1972 మార్చి 17(1972-03-17) (వయసు 70)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

కె.ఎస్.వెంకటరామయ్య (1901-1972) వాయులీన విద్వాంసుడు. ఇతడు పాపా వెంకటరామయ్యగా సంగీత లోకానికి సుపరిచితుడు.[1]

విశేషాలు

[మార్చు]

ఇతడు తమిళనాడు రాష్ట్రం కరూర్ గ్రామంలో 1901 సెప్టెంబరు 1వ తేదీన ములకనాడు తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[2] ఇతడు వయోలిన్‌ను మొదట తన తండ్రి కె.ఎన్.శ్రీకాంతయ్య వద్ద నేర్చుకున్నాడు. తరువాత కె.ఎన్.చిన్నస్వామి అయ్యర్ వద్ద నేర్చుకున్నాడు. తరువాత ఇతడు మాలకోట్టై గోవిందస్వామి పిళ్ళై వద్ద 13 సంవత్సరాలు గురుకుల వాసం చేసి సంగీతాన్ని అభ్యసించాడు. ఇతడు వీణ ధనమ్మాళ్ వద్ద కూడా కొంతకాలం శిష్యరికం చేశాడు.

ఇతడు నాలుగు దశాబ్దాలకు పైగా కచేరీలు నిర్వహించాడు. 1000కి పైగా సోలో కచేరీలు చేశాడు. అరియకుడి రామానుజ అయ్యంగార్, పల్లడం సంజీవరావు,ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, చెంబై వైద్యనాథ భాగవతార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, టి.ఆర్.మహాలింగం, తిట్టె కృష్ణ అయ్యంగార్, ఉమయల్పురం కె.శివరామన్, పి.ఎస్.నారాయణస్వామి వంటి అగ్రశ్రేణి కళాకారులకు వాద్య సహకారం అందించాడు.

1962లో మద్రాసు సంగీత అకాడమీ ఇతడికి సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1967లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి అవార్డును ప్రదానం చేసింది.

ఇతడు 1972, మార్చి 17వ తేదీన మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. web master. "K. S. Venkataramiah". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 29 March 2021.[permanent dead link]
  2. Strings of Carnatic Music Instrumentalists (1 ed.). Chennai: Kasturi and sons. 1 January 2003. p. 18. Retrieved 29 March 2021.
  3. web master. "Papa Venkataramiah". Sruti Magazine. Retrieved 29 March 2021.