కెకె

వికీపీడియా నుండి
(కె. కె నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కృష్ణకుమార్ కున్నత్
జాకీ క్లబ్ ఆడిటోరియం, హాంగ్‌కాంగ్ లో ప్రదర్శన
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుకెకె, కె. కె, కేకే
జననం(1968-08-23)1968 ఆగస్టు 23
ఢిల్లీ
మరణం2022 మే 31(2022-05-31) (వయసు 53)[1]
కలకత్తా, పశ్చిమ బెంగాల్
సంగీత శైలినేపథ్య గానం, ఇండీపాప్, రాక్ సంగీతం
వృత్తిగాయకుడు, సంగీత దర్శకుడు, గేయ రచయిత
వాయిద్యాలుగాత్ర సంగీతం
క్రియాశీల కాలం1996–2022
వెబ్‌సైటుఅధికారిక వెబ్ సైటు

ఫేస్ బుక్ పేజీ

ట్విటర్ పేజీ

కెకె గా ప్రసిద్ధుడైన కృష్ణకుమార్ కున్నత్ (1968, ఆగస్టు 23 - 2022, మే 31) ఒక భారతీయ గాయకుడు. ప్రముఖంగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200కుపైగా పాటలు పాడాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కృష్ణకుమార్ ఆగస్టు 23, 1968న ఢిల్లీ లో మలయాళీ దంపతులైన సి. ఎస్. నాయర్, కున్నత్ కనకవల్లి దంపతులకు జన్మించాడు.[3][4] అతని విద్యాభ్యాసం ఢిల్లీలోని మౌంట్ సెయింట్ మేరీస్ పాఠశాల,[5] ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలయైన కిరోరి మాల్ కళాశాలలో సాగింది.[6]

తెలుగు పాటలు

[మార్చు]

కెకె పాడిన కొన్ని ప్రాచుర్యం పొందిన తెలుగు పాటలు.

సినిమా పాట
స్టూడెంట్ నంబర్ 1 ఒకరికి ఒకరై ఉంటుంటే
ఆర్య ఫీల్ మై లవ్
ఇంద్ర దాయి దాయి దామ్మా
గుడుంబా శంకర్ లే లే లే లే ఇవాళే లేలే
శంకర్ దాదా ఎంబిబిఎస్ చైల చైల చైలా చైలా
నేనున్నాను నీ కోసం నీ కోసం
జయం ప్రేమ ప్రేమా ప్రేమా
సంతోషం దేవుడే దిగివచ్చినా
జై చిరంజీవ హే జాణ
ఘర్షణ చెలియా చెలియా
నా ఆటోగ్రాఫ్ గుర్తుకొస్తున్నాయి
బంగారం చెడుగుడంటే భయ్యం
సైనికుడు గో గో అదిగో

మరణం

[మార్చు]

53 ఏళ్ళ కెకె 2022 మే 31న నజ్రుల్ మంచా వివేకానంద కళాశాల ఫెస్ట్‌లో పాటల ప్రదర్శన తరువాత కోల్‌కతాలోని ది గ్రాండ్ హోటల్‌లో గుండెపోటుతో మరణించాడు.[7][8][9] లైవ్ కన్సర్ట్ లో ఆయన చివరి సారిగా ‘హమ్ రహే యా నా రహే యాడ్ ఆయెంగే యే పల్’ అనే పాటను పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.[10]

మూలాలు

[మార్చు]
  1. K, K. "Hindustan Times KK Death". Retrieved 31 May 2022.
  2. "The right note". The Hindu. 9 December 2006. Retrieved 2 October 2017.
  3. Lasrado, Richie (25 November 2006). "A Kandid Konversation with KK". Daijiworld.com. Archived from the original on 23 August 2017. Retrieved 8 January 2018.
  4. R, Balaji (6 June 2005). "The KK factor". The Hindu. Archived from the original on 5 November 2012. Retrieved 8 January 2018.
  5. "KK sang 3,500 jingles before Bollywood break". Sify movies. 28 April 2009. Archived from the original on 12 April 2015. Retrieved 8 January 2018.
  6. "KK". www.saavn.com. Retrieved 2017-12-15.
  7. "Bollywood playback singer KK passes away at the age of 53 owing to cardiac arrest". Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-31.
  8. "Singer KK Dies After Concert In Kolkata". NDTV. 31 May 2022.
  9. Sakshi (1 June 2022). "సింగర్‌ కేకే హఠాన్మరణం:విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి". Archived from the original on 1 June 2022. Retrieved 1 June 2022.
  10. "The singer KK died in Kolkata after a concert, Tributes Pour in - Moviezupp" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-06-01. Retrieved 2022-06-01.
"https://te.wikipedia.org/w/index.php?title=కెకె&oldid=3813651" నుండి వెలికితీశారు