కొత్తగూడ ఫ్లైఓవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తగూడ ఫ్లైఓవర్
ప్రదేశం
కొత్తగూడ, హైదరాబాదు, తెలంగాణ
జంక్షన్ వద్ద
రహదార్లు
హఫీజ్‌పేట్ - గచ్చిబౌలి
నిర్మాణం
రకంఫ్లైఓవర్
లైన్స్4
నిర్మాణం చేసినవారునిర్మాణంలో ఉంది by హైదరాబాదు మహానగర పాలక సంస్థ
గరిష్ట
వెడల్పు
3 కిలోమీటర్ల పొడవు

కొత్తగూడ ఫ్లైఓవర్ అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కొత్తగూడ ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్‌.[1] ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణంతో హఫీజ్‌పేట్ వైపు నుండి గచ్చిబౌలి వైపు వచ్చేవైపు, బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌, కొత్తగూడ జంక్షన్లలో ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకడంతోపాటు, కొండాపూర్‌ జంక్షన్‌లో 65 శాతం మేర ట్రాఫిక్‌ తగ్గుతుంది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో పూర్తయిన 18వ ఫ్లైఓవర్ ఇది.[2]

నిర్మాణం[మార్చు]

హఫీజ్‌పేట నుంచి కొత్తగూడ, కొండాపూర్‌, బొటానికల్‌ గార్డెన్‌, గచ్చిబౌలి వరకు 2.21 కిలో మీటర్ల మేర రూ. 263 కోట్ల బడ్జెట్‌తో (అండర్‌పాస్‌ పొడవు 470 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు) ఈ మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ నిర్మించబడింది.[3] ఈ ప్రాజెక్టులో భాగంగా నాలుగు లైన్ల రహదారి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వద్ద ఒక రెండు లైన్ల అప్ ర్యాంప్‌తోపాటు ఐదు లైన్ల ఫ్లైఓవర్ (18 మీటర్లు)గా మారుతుంది. ఆ తర్వాత కొండాపూర్‌లోని ఆర్‌టీఏ కార్యాలయం వరకు మూడు వరుసల ఫ్లైఓవర్‌గా విభజించబడుతుంది. హఫీజ్‌పేట నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ కోసం కొత్తగూడ వద్ద 470 మీటర్ల మేర అండర్‌పాస్‌ ఏర్పాటుచేశారు.[4]

కొత్త ఫ్లైఓవర్ ప్రయోజనాలు[మార్చు]

 • గచ్చిబౌలి నుంచి ఆల్విన్ కాలనీ కూడలి వైపు వన్ వే ఫ్లైఓవర్ గా ఇది అందుబాటులోకి వచ్చింది.
 • గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు, మసీద్ బండా, బొటానికల్ గార్డెన్ నుండి వచ్చే వాహనాలు ఈ కొత్త ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తాయి.
 • ఈ ఫ్లైఓవర్ మీది నుంచి మాదాపూర్, హఫీజ్ పేట్ వైపు వెళ్లవచ్చు.
 • ఈ నూతన ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొత్తగూడ జంక్షన్ల వల్ల ట్రాఫిక్ తగ్గుతుంది.
 • ఈ ఫ్లైఓవర్ తో మాదాపూర్, కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభతరంగా రాకపోకలు సాగించవచ్చు.
 • ఈ కొత్త ఫ్లైఓవర్ తో కొండాపూర్ బొటానికల్ గార్డెన్, కొత్తగూడ కూడళ్లలో ట్రాఫిక్ తగ్గుతుంది.
 • ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు సిగ్నల్ ప్రయాణం సులభం.
 • గచ్చిబౌలి జంక్షన్ నుంచి బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ, ఆల్విన్ కాలనీ, మాదాపూర్ ప్రాంతాలకు ఈ ఫ్లైఓవర్ మీది నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లొచ్చు.

ప్రారంభం[మార్చు]

కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను 2023 జనవరి 1న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[5] ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, చేవెళ్ల ఎంపీ జి.రంజిత్ రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, కార్పోరేటర్లు జగదీశ్వర్ గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[6]

మూలాలు[మార్చు]

 1. Today, Telangana (2022-10-16). "Hyderabad: Three new flyovers to be thrown open to public soon". Telangana Today. Archived from the original on 2022-10-15. Retrieved 2022-12-14.
 2. telugu, NT News (2022-12-14). "కొత్త ఏడాది కానుక.. కొత్తగూడ వంతెనకు తుది మెరుగులు". www.ntnews.com. Archived from the original on 2022-12-14. Retrieved 2022-12-14.
 3. "Hyderabad's Kothaguda flyover may ease long-distance travel, but not local traffic". The New Indian Express. Archived from the original on 2019-06-17. Retrieved 2022-12-14.
 4. correspondent, dc (2022-01-04). "Kothaguda flyover works hit roadblock". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-10. Retrieved 2022-12-14.
 5. HMTV (1 January 2023). "కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 6. Namasthe Telangana (2 January 2023). "హైదరాబాద్‌ అభివృద్ధి చేసేది ఇంకా ఉన్నది". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.