కొత్తపల్లి పున్నయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తపల్లి పున్నయ్య
జననంకొత్తపల్లి పున్నయ్య
ఆగష్టు 19, 1923
సోంపేట మండలం బారువ గ్రామం
నివాస ప్రాంతంవిజయనగరం
వృత్తిన్యాయవాది, రాజకీయ నాయకుడు, కవి.

కొత్తపల్లి పున్నయ్య న్యాయ రంగం తోపాటు రాజకీయం గా, కవిగా, వివిధ కమిటీల్లో కీలకంగా వ్యవహరించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన 1923, ఆగస్టు 19 న సోంపేట మండలం బారువలో జన్మించాడు. పున్నయ్య ఇచ్చాపురం, విజయనగరం ప్రాంతాల్లో విద్యాభ్యాసము చేసాడు. క్విట్ ఇండియా జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

1955 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి యునైటెడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందినాడు . అప్పట్లోనే జిల్లాపరిషత్ తొలి వైస్ -ఛైర్మన్‌గా పనిచేసి విద్యారంగం అభివృద్ధికి కృషిచేసాడు . 1962 లో పొందూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు . చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కులవివక్షతను అంతమొందించడానికి పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు చేసారు . భారత ప్రభుత్వము రాజ్యాంగ సమీక్షా సంఘంలో పున్నయ్యను సభ్యుడిగా నియమించింది.

మూలాలు[మార్చు]

  1. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 6. Retrieved 9 June 2016. CS1 maint: discouraged parameter (link)

బాహ్య లంకెలు[మార్చు]