పొందూరు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పొందూరు శాసనసభ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1962లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పొందూరు శాసనసభ నియోజకవర్గం, 1978లో రద్దయ్యి చీపురుపల్లి నియోజకవర్గంలో విలీనమైంది.[1][2]
1962లో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన ఈ నియోజకవర్గం నుండి కాంగ్రేసు పార్టీ అభ్యర్ధి కొత్తపల్లి పున్నయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే పున్నయ్యకు జిల్లా జడ్జి ఉద్యోగం రావడంతో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. 1964లో జరిగిన ఉప ఎన్నికలో ఈయన సోదరుడు, కొత్తపల్లి నరసయ్య శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1967లో ఈ నియోజకవర్గం జనరల్ కేటగిరీకి మారింది. ఆ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీకి చెందిన చౌదరి సత్యనారాయణ గెలుపొందాడు.[2]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | నియోజక వర్గం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1972 | పొందూరు | లుకలాపు లక్ష్మణదాసు | పు | కాంగ్రేసు | 22011 | టి.అక్కయ్యనాయుడు | పు | స్వతంత్ర అభ్యర్ధి | 17592 |
1967 | పొందూరు | చౌదరి సత్యనారాయణ | పు | స్వతంత్ర పార్టీ | 20773 | లుకలాపు లక్ష్మణదాసు | పు | కాంగ్రేసు | 17708 |
1964 (ఉప ఎన్నిక) | పొందూరు | కొత్తపల్లి నరసయ్య | పు | కాంగ్రేసు | 12039 | కె.నారాయణ | పు | స్వతంత్ర పార్టీ | 4797 |
1962 | పొందూరు | కొత్తపల్లి పున్నయ్య | పు | కాంగ్రేసు | ఏకగ్రీవం |
మూలాలు
[మార్చు]- ↑ కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 13.
- ↑ 2.0 2.1 "కాలగర్భంలో కలిసిన పది నియోజకవర్గాలు". ఆంధ్రజ్యోతి. 18 April 2024. Retrieved 28 September 2024.