కొత్త మల్లాయపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త మల్లాయపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కొత్త మల్లాయపాలెం is located in Andhra Pradesh
కొత్త మల్లాయపాలెం
కొత్త మల్లాయపాలెం
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 16°10′09″N 80°22′42″E / 16.169231°N 80.378251°E / 16.169231; 80.378251
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం ప్రత్తిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి వణూకూరి వీరా రెడ్డి
 - ఉప సర్పంచి మున్నంగి సుబ్బా రెడ్డి
కాలాంశం IST (UTC)
పిన్ కోడ్ 522019
ఎస్.టి.డి కోడ్ 0863

కొత్తమల్లాయపాలెం గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలంలోని ఒక్క​ ముఖ్యమైన గ్రామ పంచాయతీ, రెవెన్యూయేతర గ్రామం.మండల కేంద్రం ప్రత్తిపాడు నుంచి​ 7 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

మండల కేంద్రము ప్రత్తిపాడు నుండి 7 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 20 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

కొత్త మల్లాయపాలెంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఏకైక పాఠశాల. ఇక్కడ చదివివే విద్యార్థులు చాలా తక్కువ. గ్రామం లోని ఎక్కువ మంది ప్రాథమిక, ఉన్నత విద్య కోసం మండల కేంద్రమైన ప్రత్తిపాడు లోని ప్రయివేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వణుకూరి వీరారెడ్డి, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. ఉప సర్పంచిగా మున్నంగి సుబ్బా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.
  2. ఈ గ్రామాన్ని కేంద్రప్రభుత్వ నిర్మల్ పురస్కారానికి ఎంపికచేసారు. ఈ పురస్కారం క్రింద రు. 2 లక్షల రూపాయల నగదు మరియూ ఆ గ్రామ ప్రజాప్రతినిధులను ప్రభుత్వం సత్కరించనున్నది. ఈ పురస్కారాన్ని, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి, కార్యదర్శి, 2015, ఆగస్టు-22న, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో, రాష్ట్రమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగానమ్మ, పోలేరమ్మ దేవస్థానం:- ఈ దేవస్థానంలో గ్రామస్థులు వార్షిక జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా, చుట్టుప్రక్కల గ్రామాల మహిళలు ఆలయానికి తరలివచ్చి, పొంగళ్ళు వండి, నైవేద్యాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

కొత్త మల్లాయపాలెంలో ప్రత్తి, మిరప ప్రదాన పంటలు. కొంత భాగం వరి కూడా పండిస్తారు. ప్రకాశం‌ బ్యారేజి గుంటూరు చానల్ ఉప కాలువ ద్వార వచ్చే నీటి వసతి వరి పంటకు ఆధారము.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

కొత్త మల్లాయపాలెంలో వ్యవసాయం ప్రధాన వృత్తి.

మూలాలు[మార్చు]