కోడలు దిద్దిన కాపురం (1970 సినిమా)
కోడలు దిద్దిన కాపురం (1970 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | డి.యోగానంద్ |
తారాగణం | సావిత్రి, ఎన్.టి.రామారావు, జగ్గయ్య, వాణిశ్రీ, నాగభూషణం, సూర్యకాంతం, రేలంగి, పద్మనాభం, రమణారెడ్డి సత్యనారాయణ, త్యాగరాజు, చిత్తూరు నాగయ్య(అతిథి పాత్ర) |
సంగీతం | టి.వి.రాజు |
నిర్మాణ సంస్థ | ఎన్.టి.అర్. ఎస్టేట్స్ |
భాష | తెలుగు |
పాటలు[మార్చు]
- అమ్మమ్మ అవ్వవ్వ ఏం మొగుడివి
- అంతా తెలిసి వచ్చానే నీ అంతే చూసి పోతానే
- ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద
- క్లబ్బంటే ఎందరికో భలే మోజు ఈ జబ్బులేనివాళ్ళు లేరు ఈ రోజు
- చూడరనాన్నా లోకం ఇదేరనాన్నా మా లోకం
- చూడవె చూడు చూడవె ఓయమ్మా ఓ ముద్దులగుమ్మ
- నిద్దురపోరా సామీ నా ముద్దు మురిపాల సామీ చలిరాతిరి తీరేదాక తెలతెలవారేదాక
- నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు - పి.సుశీల
నీ ధర్మం.. మరవద్దు పాట[మార్చు]
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
సత్యం కోసం సతినే అమ్మినదెవరూ ... హరిశ్చంద్రుడూ
తండ్రి మాటకై కానల కేదినదెవరూ ... శ్రీరామచంద్రుడూ
అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా ... లక్ష్మన్నా
పతియె దైవమని తరించిపోయిన దెవరమ్మా ... సీతమ్మా
ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే నీ ధర్మం
నీ ధర్మం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్నా
మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్నా
వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి
తెలుగు భారతిని ప్రజల భాషలో తీరిచిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం నీవు నిలిచిన ఈ సంఘం
నీ సంఘం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
స్వతంత్ర భారత రథసారథియై సమరాన దూకె నేతాజీ
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజీ
గుండు కెదురుగా గుండె నిలిపెను ఆంధ్ర కేసరీ టంగుటూరీ
తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవీ
ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం నీవు పుట్టిన ఈ దేశం
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
మహనీయులనే మరవద్దు
మూలాలు[మార్చు]
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.