అక్షాంశ రేఖాంశాలు: 24°22′35″N 84°51′51″E / 24.376273°N 84.864287°E / 24.376273; 84.864287

కౌలేశ్వరి ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కౌలేశ్వరి ఆలయం
మతం
అనుబంధంహిందూ
దైవంకౌలేశ్వరి దేవి (సతీదేవి / కాళికాదేవి)
ప్రదేశం
ప్రదేశంకొల్హువా హిల్, హంటర్‌గంజ్, ఛత్రా జిల్లా, జార్ఖండ్
దేశంభారతదేశం
కౌలేశ్వరి ఆలయం is located in Jharkhand
కౌలేశ్వరి ఆలయం
కౌలేశ్వరి ఆలయం ఉన్న ప్రదేశం
కౌలేశ్వరి ఆలయం is located in India
కౌలేశ్వరి ఆలయం
కౌలేశ్వరి ఆలయం (India)
భౌగోళిక అంశాలు24°22′35″N 84°51′51″E / 24.376273°N 84.864287°E / 24.376273; 84.864287
వాస్తుశాస్త్రం.
పూర్తైనది10వ శతాబ్దం

సతీదేవి/కాళికాదేవి రూపమైన కౌలేశ్వరి దేవిని పూజించే పుణ్యక్షేత్రం కౌలేశ్వరి ఆలయం. ఇది భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో చత్రా జిల్లా కొల్హువా కొండపై నెలకొని ఉంది.

భిన్నత్వంలో ఏకత్వం

[మార్చు]

హిందూ, జైన, బౌద్ధ మతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఏడాది పొడవునా కౌలేశ్వరి ఆలయం సందర్శిస్తారు. ఈ ప్రదేశం ప్రాచీన భారతదేశంలోని సంస్కృత ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం రెండింటితోనూ ముడిపడి ఉంది. పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడ కొన్ని రోజులు గడిపారు. అలాగే రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు తమ వనవాస కాలంలో ఇక్కడకు వచ్చారు. ఇక్కడ సతీదేవి గర్భం పడటంతో ఈ ప్రదేశాన్ని శక్తిపీఠంగా కూడా పరిగణిస్తారు.[1][2]

కొండపై దొరికిన పాదముద్ర 23వ జైన తీర్థంకరుడు పార్శ్వనాథ పాదముద్ర అని నమ్ముతారు. ఈ కొండపై 1682లో నిర్మించిన జైన దేవాలయం ఉంది. ఇది ఆక్రమణదారులచే నాశనం చేయబడింది. తరువాత కొత్త ఆలయాన్ని నిర్మించారు. కూర్చున్న భంగిమలో పార్శ్వనాథుడి 2 అడుగుల విగ్రహం ఉన్న గుహ ఉంది. గుహలో అనేక విరిగిన విగ్రహాలు ఉన్నాయి. సమీపంలో ఉన్న సరస్సులో అనేక విగ్రహాలను విసిరారని నమ్ముతారు. రాతితో దిగంబర్ జైన విగ్రహాలతో నిర్మించిన ఆలయం కూడా ఉంది.[1]

గౌతమ బుద్ధుడు, జ్ఞానోదయం పొందిన తరువాత, సారనాథ్ బోధించడానికి వెళ్ళే ముందు ఇక్కడ కొంత సమయం గడిపాడు. ఇక్కడ ఆయన గుండు గీయించుకున్నాడు. చాలా మంది బౌద్ధులు ఇప్పటికీ ఇక్కడ తలనీలాలు అర్పిస్తారు.[1]

ప్రదేశం

[మార్చు]

కౌలేశ్వరి ఆలయం హంటర్‌గంజ్‌కు 6 మైళ్ల (9.7 కి.మీ) దూరంలో కొల్హువా కొండపై ఉంది. ఇక్కడ లీలాజన్ నది ప్రవహిస్తుంది. కొల్హువా కొండ 1,575 అడుగుల (480 మీ) ఎత్తు ఉంది. కొండపై నుంచి చూస్తే ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి, దీనిని ఆకాష్ లోచన్ అని పిలుస్తారు.[3]

జాతర

[మార్చు]

హిందూ పండుగలైన వసంత పంచమి, శ్రీరామనవమి సమయంలో, కొల్హువా మేళా ఇక్కడ నిర్వహించబడుతుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Kauleshwari Hill Chatra, An Important Religious Site For Hindus, Jains, And Buddhists". Monalisa Bose Roy. tripinfi. Archived from the original on 16 జనవరి 2021. Retrieved 12 January 2021.
  2. "Tourist Spots in Chatra District". The Mental Club. Retrieved 12 January 2021.
  3. "Kauleshwari Hill and Temple". Chatra district administration. Retrieved 12 January 2021.
  4. "Kauleshwari Devi, Chatra". Native Planet. Retrieved 12 January 2021.