Coordinates: 8°52′42″N 76°35′43″E / 8.878204°N 76.595194°E / 8.878204; 76.595194

క్యాషూ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్యాషూ ఎక్స్పోర్ట్  ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్  ఇండియా ( జీడిపప్పు ఎగుమతి ప్రోత్సాహక మండలి) ని (The Cashew Export Promotion Council of India or CEPC or CEPCI) 1955లో భారత ప్రభుత్వం జీడిమామిడి పరిశ్రమ సహకారంతో, జీడిపప్పు ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేసింది. సంస్థ లక్ష్యం జీడిపప్పు గింజలు, వాటి నుంచి వచ్చే ద్రవాల ఎగుమతులను ముమ్మరం చేయడానికి, ప్రోత్సహించడానికి ఉపయోగపడే వివిధ విధులను నిర్వర్తించడానికి అవసరమైన సంస్థాగత సహాయం,నిర్మాణం కౌన్సిల్ అందచేస్త్తుంది[1].

క్యాషూ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
సి ఇ పి సి ఐ

I

దస్త్రం:Cashew Export Promotion Council of India Logo.png
సంస్థ అవలోకనం
స్థాపనం 1955
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధాన కార్యాలయం [[ముంద్దక్కల్

]], కొల్లం, భారతదేశం
8°52′42″N 76°35′43″E / 8.878204°N 76.595194°E / 8.878204; 76.595194

Minister responsible పీయూష్ గోయల్,
వాణిజ్య శాఖ మంత్రి
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/లు డాక్టర్ నూర్దీన్ అబ్దుల్,
అధ్యక్షుడు (చైర్మన్)
ఎ. అబ్దుల్ సలాం,
ఉపాధ్యక్షుడు (వైస్ చైర్మన్)[2]
Parent Agency వాణిజ్య శాఖ. భారత ప్రభుత్వం

అవలోకనం

[మార్చు]

జీడిపప్పు ఎగుమతి ప్రోత్సాహక మండలి (సిఇపిసి) భారతదేశం నుండి జీడిపప్పు  ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో జీడిపప్పు పరిశ్రమ  క్రియాశీల సహకారంతో 1955 ఆగస్టు 17 న భారత ప్రభుత్వంచే స్థాపించబడింది.

జీడిపప్పు గింజలు, జీడిపప్పు, అనుబంధ ఉత్పత్తులును భారతదేశ ఎగుమతులను ,ప్రోత్సహించడానికి ఉపయోగపడే వివిధ విధులను నిర్వహించడానికి అవసరమైన సంస్థాగత వ్యవహారాలను  కౌన్సిల్ అందిస్తుంది.  లాభాపేక్షలేని సంస్థ, ఎగుమతి ఆదాయాలను పెంచడానికి, వాణిజ్యానికి సేవలు అందిస్తుంది. కౌన్సిల్ తన సభ్య ఎగుమతిదారులకు అందించే వివిధ సేవలలో వాణిజ్య సమాచారం, వాణిజ్య విచారణలు, వ్యాపార గణాంకాలు,, అంతర్జాతీయ వాణిజ్య సమ్మేళనాలలో(world trade fair )  కౌన్సిల్ స్టాళ్లలో ఉచిత భాగస్వామ్యం, వివిధ దిగుమతి దేశాలకు వాణిజ్య ప్రతినిధి బృందాలతో చర్చలు మొదలైనవి సంస్థా గత కార్యకలాపాలలో ఉన్నాయి. సభ్య ఎగుమతిదారులకు ఆర్థిక సహాయం అందించడం, ఫ్యాక్టరీల ఆధునీకరణ ( ప్రాసెస్ అప్ గ్రేడేషన్),  విలువలను పెంచేందుకు  కొత్త ప్యాకింగ్ సౌకర్యాలు, ఐ ఎస్ ఓ /హెచ్ ఏ సి సి పి ( ISO / HACCP )వంటి అంతర్జాతీయ నాణ్యతా ప్రామాణిక ధృవీకరణలను అమలు చేయడం మొదలైనవాటి కొరకు భారత ప్రభుత్వ పంచవర్ష ప్రణాళిక పథకాలను కౌన్సిల్ నిర్వహిస్తుంది. ఈ కౌన్సిల్ సభ్య ఎగుమతిదారులు కౌన్సిల్ జారీ చేసిన రిజిస్ట్రేషన్-కమ్-మెంబర్షిప్ సర్టిఫికేట్ను ఉపయోగించి డిఇపిబి, వికెజియువై వంటి భారత ప్రభుత్వం అందించే ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

విదేశీ దిగుమతిదారులను జీడిపప్పు ఎగుమతిదారులతో ఏకతాటిపైకి తీసుకురావడానికి అవసరమైన అనుసంధానాన్ని కౌన్సిల్ అందిస్తుంది. విదేశీ దిగుమతిదారుల నుంచి వచ్చిన విచారణలు కౌన్సిల్ లోని సభ్యులకు ఇవ్వటం జరుగుతుంది. ఎగుమతులు/దిగుమతుల విషయంలో నాణ్యత /లేదా ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడంలో వైవిధ్యం కారణంగా ఫిర్యాదులను సామరస్యంగా పరిష్కరించడంలో కౌన్సిల్ తన విధులను సమర్థతో నిర్వహిస్తుంది [3].

పరిశోధన

[మార్చు]

భారతదేశం నుండి ఎగుమతి అయ్యే జీడిపప్పు విత్తనాల, అనుబంధ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం 1997 లో సిఇపిసిఐ ప్రయోగశాల, పరిశోధన సంస్థను స్థాపించింది. ఈ ప్రయోగశాల, సాంకేతిక విభాగం  సేవలు భారతదేశంలోని జీడిపప్పు పరిశ్రమకు మాత్రమే కాకుండా, భారతదేశం, విదేశాల్లోని మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కూడా అందుబాటులో ఉంటాయి.

సీఈపీసీఐ ప్రయోగశాల (ల్యాబ్) లో వివిధ పరీక్షలకు అనువైన ల్యాబ్ లు, నియంత్రిత వాతావరణం( ఏర్ కండిషన్ వ్యవస్థ), అంతర్జాలం సౌకర్యం (ఇంటర్నెట్), ఫోన్లు, అగ్నిమాపక సేవలు, కంప్యూటర్లకు అవసరమయ్యే యూపీఎస్ వంటి సహాయక సేవలతో కూడిన సాంకేతిక, నైపుణ్యం కలిగిన మానవ వనరులు దీనిలో ఉన్నాయి. సీఈపీసీఐ ల్యాబొరేటరీ   నైపుణ్యం అర్హతతో ఉన్న  కలిగిన విద్యావేత్తలు, (ప్రొఫెషనల్స్),  సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్లు), అత్యాధునిక పరికరాలతో కెమికల్, మైక్రోబయోలాజికల్ పరిశీలన ( టెస్టింగ్) విభాగాలు,  ఈ ప్రయోగశాల ఐఎస్ఓ-ఐఇసి గైడ్ 25 కింద వివరించిన ప్రమాణం ప్రకారం ప్రయోగశాల నాణ్యతా వ్యవస్థతో నెలకొల్పినారు.  భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్ బోర్డ్ ఫర్ అక్రిడిటేషన్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్ఎబిఎల్) గుర్తింపు పొందింది[4].

సాగుదల

[మార్చు]
పశ్చిమ బెంగాల్ లో సాగుచేయబడిన జీడిపప్పు

ప్రపంచంలో అత్యధికంగా జీడిపప్పును ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి. జీడిమామిడి పరిశ్రమకు పెద్ద ఆర్థిక ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే  గ్రామీణ ప్రాంతాల్లోని భూములు, కర్మాగారాలలో సుమారు 10 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తుంది. భారతదేశంలో జీడిమామిడి సాగు మొత్తం 0.7 మిలియన్ హెక్టార్ల భూమితో , సంవత్సరానికి 0.8 మిలియన్ టన్నుల (ఎంటి) పైగా ఉత్పత్తి చేస్తుంది. 2019-20 - 2021-22  ల మధ్య, భారతదేశ జీడిపప్పు ఉత్పత్తి 0.70 మిలియన్ టన్నుల (ఎంటి) నుండి 0.77 మిలియన్ టన్నులకు (ఎంటి) పెరిగింది. భారతదేశంలో జీడిమామిడి సాగు ద్వీపకల్పంలోని తీర ప్రాంతాలలో విస్తరించింది.జీడిపప్పు ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో పండిస్తారు. నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్ హెచ్ బి ) ప్రచురించిన డేటా ప్రకారం, 2021-22 లో వార్షిక జీడిపప్పు ఉత్పత్తిలో మహారాష్ట్ర 0.20 మిలియన్ టన్నుల (ఎంటి) తో మొదటి స్థానంలో ఉంది.విస్తారమైన జీడిపప్పు ఉత్పత్తితో పాటు, జీడిపప్పు ప్రాసెసింగ్, జీడిపప్పు గింజలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడంలో భారతదేశం అగ్రగామిగా ఉంది. జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమ ఇంతకు ముందు కొల్లాం (కేరళ), మంగళూరు (కర్ణాటక), గోవా, వేటపాలం (ఆంధ్రప్రదేశ్) లలో కేంద్రీకృతమై ఉంది, అయితే ప్రస్తుతం  భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో సాగుదలతో విస్తరించి ఉంది. కొన్ని సంవత్సరాలుగా  జీడిపప్పు పరిశ్రమకు ప్రపంచములో “ గ్లోబల్ ప్రాసెసింగ్ హబ్ “గా భారత దేశం నిలిచింది[5].

ఎగుమతులు  

[మార్చు]
జీడీ పప్పు పై భారత ప్రభుత్వ తపాలా శాఖ వారు  1981 సంవత్సరంలో విడుదల చేసినారు  

జీడీ పప్పు ప్రపంచ ఎగుమతుల్లో 15 శాతానికి పైగా వాటాతో భారతదేశం ఎగుమతిదారుగా ఉంది. 2021-22లో జీడిపప్పు ఎగుమతులు 2020-21లో 420 మిలియన్ డాలర్ల విలువ ఉంటే, 2021-22లో 452 మిలియన్ డాలర్లకు పెరిగాయి. 2022 ఏప్రిల్-ఆగస్టు మధ్య జీడిపప్పు ఎగుమతులు 134.38 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

భారతదేశ జీడిపప్పు ఎగుమతులు 2020-21 లో 70.5 మిలియన్ కిలోల ఉంటే, 2021-22 లో 76.8 మిలియన్ కిలోలకు 9% పెరిగాయి. 2022 ఏప్రిల్-ఆగస్టు మధ్య జీడిమామిడి ఎగుమతుల పరిమాణం 18 మిలియన్ కిలోలుగా ఉంది.

2022 ఫిబ్రవరిలో 33.6 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2022 మార్చిలో 40.0 మిలియన్ డాలర్ల విలువకు ఎగుమతి చేసింది.

ముడి జీడిపప్పు దిగుమతి భారతీయ జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది, దేశంలో జీడిపప్పు గింజలకు దేశీయ, ఎగుమతి డిమాండ్లో దాదాపు సగం వాటాను కలిగి ఉంది. ఈ పెరుగుదలకు  వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ (డిఎసి అండ్ ఎఫ్డబ్ల్యు) మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడిహెచ్), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కెవివై) కింద వివిధ కార్యక్రమాలను అమలు చేసింది, తద్వారా  దేశీయంగా జీడిపప్పు ఉత్పత్తిని పెంచడానికి దారితీసింది. జీడిమామిడి సాగు కింద విస్తీర్ణాన్ని భారీగా విస్తరించడం, సంప్రదాయ, సంప్రదాయేతర రాష్ట్రాల్లో అధిక దిగుబడినిచ్చే జీడిమామిడి తోటల స్థానంలో జీడిమామిడి తోటలను ప్రవేశపెట్టడం ఇందులో భాగమే[5].

మూలాలు

[మార్చు]
  1. "The Cashew Export Promotion Council Of India - Wholesaler from Ernakulam South, Kochi, India | About Us". www.indiamart.com. Retrieved 2023-02-14.
  2. "P Sundaran re-elected CEPCI chairman ??". PTI News. Retrieved 6 October 2016.
  3. "Cashew Export Promotion Council of India". howtoexportimport.com. Retrieved 2023-02-14.
  4. "About CEPCI Laboratory & Research Institute | CEPCI Laboratory & Research Institute" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-02-14. Retrieved 2023-02-14.
  5. 5.0 5.1 "Cashew Nut Industry India: Cashew Manufacturers And Exporters In India| IBEF". India Brand Equity Foundation (in ఇంగ్లీష్). Retrieved 2023-02-14.