Jump to content

వెస్టిండీస్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
(క్యూబాలో హిందూమతం నుండి దారిమార్పు చెందింది)

వెస్టిండీస్‌లోని ఇండో-కరేబియన్ కమ్యూనిటీలలో హిందూమతం ప్రధాన ఏకైక మతం. హిందువులు ముఖ్యంగా గయానా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగోలో ఎక్కువగా ఉన్నారు. 2011 నాటికి ఇక్కడి మొత్తం జనాభాలో 18 శాతం హిందువులు ఉన్నారు. కేమాన్ దీవుల్లో కూడా గణనీయమైన హిందూ జనాభా ఉంది. ఈ దేశంలో 2.4 శాతం మంది హిందువులు. ఇండో-కరేబియన్ల చిన్నచిన్న సమూహాలు కరేబియన్‌లోని ఇతర ప్రాంతాలలో కూడా నివసిస్తున్నాయి. ముఖ్యంగా ప్యూర్టో రికో, జమైకా, బెలిజ్, బార్బడోస్, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, సెయింట్ లూసియా, బహామాస్ లలో వీరు ఎక్కువగా ఉన్నారు.

వివిధ దేశాల్లో హిందూమతం

[మార్చు]

బార్బడాస్

[మార్చు]

బార్బడోస్ లో 2,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వారు గయానా నుండి వలస వచ్చినవారు. అధిక సంఖ్యలో ఉన్న భారతీయ జనాభా కారణంగా, బార్బడోస్ లోని పెరుగుతున్న మతాలలో హిందూ మతం ఒకటిగా ఉంది. 2000 జనాభా లెక్కల ప్రకారం బార్బడోస్‌లో హిందువుల సంఖ్య 840. ఇది మొత్తం జనాభాలో 0.34%. [1] 2010 జనాభా లెక్కల ప్రకారం హిందువుల సంఖ్య 215 మంది పెరిగి (25% పెరుగుదల) 1,055కి చేరుకుంది. [2] ఇది మొత్తం బార్బడోస్ జనాభాలో హిందూమతం వాటా 2000లో 0.34% ఉండగా అది 2010లో 0.46%కి పెరిగింది.

బెర్ముడా

[మార్చు]

బెర్ముడాలోని చాలా మంది హిందువులు దక్షిణ భారత / తమిళ సంతతికి చెందినవారు. బెర్ముడాలో హిందువుల జనాభా 0.2% [3]

క్యూబా

[మార్చు]

క్యూబాలో హిందూమతం మైనారిటీ మతం. దేశ జనాభాలో 0.2% మంది హిందూమతాన్ని అవలంబిస్తున్నారు. [4] [5] ఇస్కాన్ కు దేశంలో ఉనికి ఉంది.

జనాభా వివరాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
200723,927—    
సంవత్సరం శాతం మార్పు
2007 0.2% -

[6]

2007 నాటికి క్యూబాలో సుమారు 23,927 మంది హిందువులు ఉన్నారు.

జమైకా

[మార్చు]
మరిన్ని వివరాలకు చూడండి: జమైకాలో హిందూమతం.

20వ శతాబ్ది మధ్య వరకు జమైకాలో 25,000 మంది హిందువులు ఉండేవారు. అయితే, వారిలో ఎక్కువ మంది క్రైస్తవ మతంలోకి మారారు. గత కొన్ని దశాబ్దాలుగా, జమైకాలో హిందువుల జనాభా బాగా తగ్గింది. 1970లలో, 5,000 మంది హిందువులుండేవారు. అప్పటి నుండి, జమైకాలో హిందూ జనాభా పెరిగి, జమైకాలో రెండవ అతిపెద్ద మతంగా (క్రైస్తవం తరువాత) మారింది. దీపావళి ప్రతి సంవత్సరం జమైకాలో జరుపుకుంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జమైకాలో 1,453 మంది హిందువులున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ సంఖ్యకు మరో 383 మంది చేరి, 1,836 అయింది. [7] 2001లో జమైకా జనాభాలో హిందూమతం 0.06% ఉండగా అది 2011 జనాభాలో 0.07%కి పెరిగింది.

ట్రినిడాడ్, టొబాగో

[మార్చు]
సముద్రంలో దేవాలయం

ట్రినిడాడ్, టొబాగోలో హిందూ మతం మైనారిటీ మతం. కానీ ముఖ్యమైన మతం. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు జనాభాలో 18% పైగా ఉన్నారు. ఇది ద్వీపాలలో రెండవ అతిపెద్ద మతం. హిందూమతం 170 సంవత్సరాలుగా ఇక్కడ ఉనికిలో ఉంది, ఇక్కడ పని చేయడానికి వచ్చిన భారతీయులు హిందూమతాన్ని ప్రవేశపెట్టారు. [8] ప్రస్తుతం ట్రినిడాడ్, టొబాగోలో 2,40,100 మంది హిందువులు ఉన్నారు.

తాజా జనాభా లెక్కల ప్రకారం హిందూ జనాభా

[మార్చు]
  • గయానా : 2,13,282 లేదా 28.4% (2002 జనాభా లెక్కలు) [9]
  • సురినామ్ : 1,20,623 లేదా 22.3% (2012 జనాభా లెక్కలు) [10]
  • ట్రినిడాడ్ టొబాగో : 2,40,100 లేదా 18.2% (2011 జనాభా లెక్కలు) [11]
  • ప్యూర్టో రికో : 3,482 లేదా 0.09% (రిలిజియస్ ఇంటెలిజెన్స్ 2006) 
  • జమైకా : 1,836 లేదా 0.07% (2011 జనాభా లెక్కలు) [12]
  • బార్బడోస్ : 1,055 లేదా 0.38% (2010 జనాభా లెక్కలు) [13]
  • సెయింట్ లూసియా : 500 లేదా 0.3% (2010 జనాభా లెక్కలు) [14]
  • బహామాస్ : 428 లేదా 0.12% (2010 జనాభా లెక్కలు) [15]
  • US వర్జిన్ దీవులు : 400 లేదా 0.4% (2000 జనాభా లెక్కలు) 
  • ఆంటిగ్వా, బార్బుడా : 379 లేదా 0.4% (2011 జనాభా లెక్కలు) 
  • సెయింట్ కిట్స్, నెవిస్ : 860 లేదా 1.82% (2011 జనాభా లెక్కలు) [16]
  • గ్రెనడా : 156 లేదా 0.15% (2001 జనాభా లెక్కలు) [17]
  • సెయింట్ విన్సెంట్ : 83 లేదా 0.08% (2001 జనాభా లెక్కలు) [18]
  • Anguilla : 58 లేదా 0.42% (2011 జనాభా లెక్కలు) [19]
  • మోంట్సెరాట్ : 31 లేదా 0.8% (2001 జనాభా లెక్కలు) 
  • కేమాన్ దీవులు :454 లేదా 0.8%(2011 జనాభా లెక్కలు)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "2000 Round of Population and Housing Census Sub-project" (PDF). Caricomstats.org. Archived from the original (PDF) on 2018-02-05. Retrieved 2015-05-20.
  2. "2010 Population and Housing Census of Barbados Volume 1" (PDF). stats.gov.bb. Archived from the original (PDF) on 2017-01-18. Retrieved 2015-06-21.
  3. Joshua Project. "Country - Bermuda". Joshua Project. Retrieved 2015-05-20.
  4. "Cuba, Religion And Social Profile - National Profiles - International Data - TheARDA". Thearda.com. Archived from the original on 20 అక్టోబరు 2020. Retrieved 22 April 2019.
  5. "Religious Intelligence - Country Profile: Cuba (Republic of Cuba)". 27 September 2007. Archived from the original on 27 September 2007. Retrieved 22 April 2019.
  6. "Cuba, Religion And Social Profile - National Profiles - International Data - TheARDA". Thearda.com. Archived from the original on 20 అక్టోబరు 2020. Retrieved 22 April 2019.
  7. Rev. Clinton Chisholm (November 4, 2012). "Religion and the 2011 census". Jamaica Gleaner. Retrieved 26 January 2018.
  8. IANS (May 30, 2015). "Trinidad and Tobago PM Kamla Persad commemorates 170 years of Indian arrival". The Economic Times. Port of Spain. Archived from the original on March 13, 2016. Retrieved 26 January 2018.
  9. "Chapter II: Population Ccomposition: 2.1 Race/Ethnic Composition" (PDF). Statisticsguyana.gov.gy. Retrieved 2015-05-20.
  10. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2015-09-24. Retrieved 2019-03-23.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  11. [1] Archived మే 2, 2013 at the Wayback Machine
  12. "Religion and the 2011 census". jamaica-gleaner.com. Retrieved 26 January 2018.
  13. "2010 Population and Housing Census of Barbados Volume 1" (PDF). stats.gov.bb. Archived from the original (PDF) on 2017-01-18. Retrieved 2015-06-21.
  14. "Home" (PDF). Stats.gov.lc. Archived from the original (PDF) on 2011-08-30. Retrieved 2015-05-20.
  15. "Total Population by Sex, Age-Group and Religion" (PDF). Statistics.bahamas.gov.bs. Retrieved 2015-05-20.
  16. "Population by Religious Belief 2011". Retrieved 18 June 2021.
  17. "2000 Round of Population and Housing Census Sub-project" (PDF). Caricomstats.org. Archived from the original (PDF) on 2015-09-23. Retrieved 2015-05-20.
  18. "Census & Surveys". Stats.gov.vc. Archived from the original on 2015-03-27. Retrieved 2015-05-20.
  19. "Demographic Tables : Table of Contents". Gov.ai. Archived from the original (PDF) on 2007-11-24. Retrieved 2015-05-20.