గంగినేని వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గంగినేని వెంకటేశ్వరరావు(31.12.1924-30.6.2011) అభ్యుదయ సాహిత్యవాది, గేయ, నవలా రచయిత, వినుకొండ మాజీ శాసనసభ్యుడు. గంగినేని జన్మస్థలం నూజెండ్ల మండలం గురప్పనాయుడు పాలెం . తల్లిదండ్రులు హనుమాయమ్మ, వెంకయ్య..ఆ కాలంలో ఇంగ్లిష్ చదవ కలిగిన, మాట్లాడగలిగిన వ్యక్తిగా గుర్తింపు ఉండడంతో ఆయనను స్థానికులు ఇంగ్లిషు గంగినేనిగా పిలుచుకునేవారు. గంగినేని గుంటూరు ఏసీ కాలేజి లో డిగ్రీ చదువుతూకమ్మ హాస్టల్‌ లో ఉండేవారు. కమ్యూనిస్టు ఉద్యమ పోరాటాల్లో చురుకుగా పాల్గొనే వారు. లా డిగ్రీని పూర్తి చేశారు. నరసరావుపేట కోర్టులో క్రిమినల్ లాయర్‌గా పనిచేశారు. అంతకంటే ముందు బోధన్ షుగర్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశారు. విద్యార్థి దశలో కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్న గంగినేనిని ప్రభుత్వం అరెస్టు చేయడానికి ప్రయత్నించగా కొద్ది కాలం ఆయన అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. అప్పుడే పులుపుల శివయ్య తో గంగినేనికి సాన్నిహిత్యం ఏర్పడింది.తెనాలి ప్రాంతానికి చెందిన విద్యావంతురాలు కల్యాణితో పార్టీపెద్దలే వివాహం జరిపించారు. ఆమె చాలాకాలం గుంటూరు మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా చేస్తూ వినుకొండ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. కల్యాణి సేవలకు గుర్తుగా కళాశాలకు ఆమె పేరు పెట్టారు.ఆయన వివాహ సమయంలో ప్రసిద్ధకవుల కవితలను ఏర్చికూర్చి ఆయన భార్య కల్యాణి పేరు కలిచి వచ్చేలా కల్పన పేరుతో కవితా సంకలనం తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. ప్రముఖ సినీ రచయిత పినిశెట్టి ఆయనకు ఆత్మీయుడు.గంగినేని సోదరులలో ఒకరు గుంటూరు జి.వి.ఆర్‌. అండ్‌ ఎస్‌ విద్యాసంస్థల అధిపతి వెంకటేశ్వరావు . 1978లో సీపీఐ అభ్యర్థిగా ఆవుదారి వెంకటేశ్వర్లు పై పోటీచేసి ఓటమి చెందారు. 1981లో సీపీఐ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా ఎన్నియ్యారు. 1983లో జిల్లాలో తెలుగుదేశం 18 స్థానాలు కైవసం చేసుకోగా సీపీఐ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా వినుకొండ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1985లో టీడీపీ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి శాసనసభకు ఎన్నియ్యారు.ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అవినీతికి పాల్పడని వ్యక్తిగా పేరు గడించారు. ఆశయాలకు కట్టుబడి జీవించారు. 1977లో పట్టణంలో పులుపుల శివయ్య స్మారకార్థం స్థూపాన్ని నిర్మించారు. సినిమా థియేటర్లు నిర్మించారు. చివరివరకు డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగారు. మూత్రపిండాల వ్యాధితో 30.6.2011 న మరణించారు.

రచనలు[మార్చు]