Jump to content

గద్దె రామ్మోహన్ రావు

వికీపీడియా నుండి
గద్దె రామ్మోహన్ రావు
గద్దె రామ్మోహన్ రావు


పదవీ కాలం
1994-1999
ముందు ముసునూరి రత్నబోసు
తరువాత దాసరి వెంకట బాలవర్థన్ రావు
నియోజకవర్గం గన్నవరం

పదవీ కాలం
1999-2004
ముందు పర్వతనేని ఉపేంద్ర
తరువాత లగడపాటి రాజగోపాల్
నియోజకవర్గం విజయవాడ

పదవీ కాలం
2014-2019
ముందు యలమంచిలి రవి
నియోజకవర్గం విజయవాడ(తూర్పు)

వ్యక్తిగత వివరాలు

జననం (1959-01-09) 1959 జనవరి 9 (వయసు 65)
గన్నవరం, కృష్ణా జిల్లా
రాజకీయ పార్టీ తెలుగుదేశం
జీవిత భాగస్వామి గద్దె అనూరాధ
నివాసం విజయవాడ

గద్దె రామ్మోహన్ రావు కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు.విజయవాడ లోక్ సభ స్థానం నుంచి 13 వ లోక్ సభకు ఎన్నిక అయినారు. 1999 లో గన్నవరం శాసనసభ నియోజకవర్గం నుంచి, 2014 లో విజయవాడ (తూర్పు) నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

విశేషాలు

[మార్చు]

గద్దె రామమోహన్ 1959, జనవరి 9వ తేదీన కృష్ణాజిల్లా గన్నవరంలో గద్దె సుబ్బయ్య, శ్రీనివాసులమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు గన్నవరంలోని వి.కె.ఆర్.కాలేజీలో డిగ్రీ చదివాడు. ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి. (మైక్రోబయాలజీ) చదివాడు. 1982లో ఇతని వివాహం అనూరాధతో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఇతడు వ్యాపారస్థుడు, పారిశ్రామిక వేత్త, సంఘసేవకుడు.[1]

రాజకీయరంగం

[మార్చు]

ఇతడు 1994 శాసనసభ ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన దాసరి బాలవర్ధనరావుపై పదివేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తరువాత ఇతడు తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యుడైనాడు. తిరిగి 2014లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికైనాడు.

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Thirteenth Lok Sabha Members Bioprofile". Parliament of India LOK SABHA HOUSE OF THE PEOPLE. Lok Sabha Secretariat. Archived from the original on 3 జూన్ 2020. Retrieved 3 June 2020.