Jump to content

గబ్బిట వెంకటరావు

వికీపీడియా నుండి
గబ్బిట వెంకటరావు
గబ్బిట వెంకటరావు
జననం(1928-03-15)1928 మార్చి 15
మరణం1997 అక్టోబరు 11(1997-10-11) (వయసు: 69)
మద్రాసు
వృత్తి
  • నాటక రచయిత
  • సినీ రచయిత
  • పద్యకవి
  • దర్శకుడు
  • నిర్మాత
భాగస్వామిఅన్నపూర్ణమ్మ
పిల్లలుమధుమోహన్,
ఉమాకుమార్ శేషాద్రి,
సాయినాథ్,
లక్ష్మీప్రసన్న,
దక్షిణామూర్తి,
గౌరీ విజయలక్ష్మి
తల్లిదండ్రులుదక్షిణామూర్తి,
లక్ష్మీనరసమ్మ

గబ్బిట వెంకటరావు ప్రముఖ రంగస్థల, సినిమా రచయిత.

జననం

[మార్చు]

ఈయన దక్షిణామూర్తి, లక్ష్మీ నరసమ్మ దంపతులకు 1928, మార్చి 15పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు.[1]

వివాహం - పిల్లలు

[మార్చు]

కృష్ణా జిల్లా ఆకిరిపల్లి లోని చల్లా శ్రీరాములు, పేరమ్మ దంపతుల కుమార్తెన అన్నపూర్ణమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి మధుమోహన్, ఉమకుమార్ శేషాద్రి, సాయినాథ్, లక్ష్మీ ప్రసన్న, దక్షిణా మూర్తి, గౌరీ విజయ లక్ష్మి అనే సంతానం కలిగారు.

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

సీనియర్ సముద్రాల, జగ్గయ్య ల ప్రేరణతో సినీ రంగప్రవేశం చేసి బాపు గారి కోరికపై శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రానికి కథామాటలు పాటలు పద్యాలు స్క్రీన్ ప్లే రాశారు. ఎన్.టి.రామారావు నటించిన బొబ్బిలి యుద్ధం, మాయా మశ్చీంద్ర చిత్రాలకు స్క్రీన్ ప్లే కథ మాటలు రాశారు. బి.ఏ. సుబ్బారావు దర్శకత్వం చేసిన మోహినీ భస్మాసురకూ సంభాషణలు రాశారు. శ్రీమద్భగవద్గీత లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్య సహితంగా రచించి సుసర్ల దక్షిణా మూర్తిగారి చే, స్వర కల్పన చేయించి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిచే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేశారు. సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కథా, పాటలు, సంభాషణలు, పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .

ఒరియా భాషలో సి.ఎస్.రావు దర్శకత్వం వహించిన సత్య హరిశ్చంద్ర సినిమాను నిర్మించారు. ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు. మలయాళ చిత్రాన్ని కొండవీటి మొనగాడుగా అనువాదం చేశారు, భక్త అంబరీష మాటలు సమకూర్చారు.

నాటకరంగ ప్రస్థానం

[మార్చు]

వెంకటరావు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే హనుమద్రామ సంగ్రామం అనే నాటకం రాశారు. అల్లూరి సీతారామ రాజు, మనోహర, వరూధిని వంటి ప్రసిద్ధ నాటకాలు రాశారు.

మరణం

[మార్చు]

ఈయన 1997, అక్టోబరు 11న తన 69వ ఏట మద్రాస్లో మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. సరసభారతి ఉయ్యూరు. "బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు". sarasabharati-vuyyuru.com. the original నుండి 13 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 March 2017.