గాండీవదారి అర్జున

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాండీవదారి అర్జున
దర్శకత్వంప్రవీణ్ సత్తారు
రచనప్రవీణ్ సత్తారు
నిర్మాతబి.వి.ఎస్‌.ప్ర‌సాద్
తారాగణం
ఛాయాగ్రహణంఅమోల్ రాథోడ్
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర
విడుదల తేదీs
2023 ఆగస్టు 25 (2023-08-25)(థియేటర్)
2023 ఏప్రిల్ 24 (2023-04-24)( నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో)[1]
సినిమా నిడివి
140 నిముషాలు[2]
దేశంభారతదేశం
భాషతెలుగు

గాండీవదారి అర్జున 2023లో విడుదలైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా. నాగబాబు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. వరుణ్‌తేజ్‌, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మోషన్‌పోస్టర్‌ను వరుణ్‌తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా 2023 జనవరి 10న చిత్ర యూనిట్ విడుదల చేయగా[3], సినిమాను ఆగస్ట్‌ 25న విడుదలైంది.[4]

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య రాజ్ బ‌హ‌దూర్ (నాజ‌ర్‌) గ్లోబ‌ల్‌ స‌మ్మిట్ కోసం లండ‌న్‌కు వ‌చ్చిన ఆయనపై దాడి జరుగుతుంది, ఈ దాడిలో ఆయనకు సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న విజయ్ (మనీష్ చౌదరి) గాయపడడంతో ఆయన స్థానంలో అర్జున్ వర్మ (వ‌రుణ్ తేజ్‌)ను సెక్యూరిటీగా నియమిస్తారు. ఈ క్రమంలో అర్జున్‌ అన్వేష‌ణ‌లో ఆదిత్య రాజ్ బ‌హ‌దూర్ (నాజ‌ర్‌) పై దాడి చేసింది ర‌ణ్‌వీర్ (విన‌య్‌రాయ్‌) అని తెలుస్తుంది. ఆదిత్య రాజ్ బ‌హ‌దూర్ (నాజ‌ర్‌) ను చంప‌డానికి ర‌ణ్ వీర్ ఎందుకు ప్ర‌య‌త్నించాడు? మంత్రికి రణ్ వీర్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆదిత్య‌ను ర‌క్షించే క్ర‌మంలో అర్జున్‌కు ఎలాంటి స‌వాళ్లు ఎదురయ్యాయి అనేదే మిగతా సినిమా కథ.[6]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర
 • నిర్మాత: బి.వి.ఎస్‌.ప్ర‌సాద్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
 • సంగీతం: మిక్కీ జే మేయర్
 • సినిమాటోగ్రఫీ: అమోల్ రాథోడ్

సంగీతం[మార్చు]

మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నీ జతై...[7]"రెహమాన్ఎల్వ్యా, న‌కుల్ అభ‌యంక‌ర్4:18

. 2: గాండీవ దారి , రచన: రహమాన్, గానం. హారికా నారాయణ్

మూలాలు[మార్చు]

 1. Andhra Jyothy (25 September 2023). "సెప్టెంబర్‌ చివరివారం సందడి ఈ చిత్రాలదే..! | Theatre and OTT Upcoming movies avm". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
 2. V6 Velugu (19 August 2023). "వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున..సెన్సారు కట్ పూర్తి..రన్ టైం ఎంతంటే?". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. Namasthe Telangana (20 January 2023). "గాండీవధారి అర్జున". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
 4. Hindustantimes Telugu (10 June 2023). "వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టైలిష్ యాక్షన్ మూవీగా." Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
 5. Namasthe Telangana (7 May 2023). "గాండీవధారి అర్జున అప్‌డేట్‌.. సాక్షి వైద్య డబ్బింగ్‌ షురూ". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
 6. Eenadu (25 August 2023). "రివ్యూ: గాండీవ‌ధారి అర్జున‌.. వరుణ్‌ తేజ్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..?". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
 7. Mana Telangana (31 July 2023). "'గాంఢీవధారి అర్జున' నుండి మెలోడీ సాంగ్ 'నీ జతై..' విడుదల". Retrieved 31 July 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)