ఘోడా కటోరా సరస్సు
ఘోడా కటోరా | |
---|---|
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Bihar" does not exist. | |
ప్రదేశం | రాజగిరి, బీహార్, భారత దేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 25°01′04″N 85°29′43″E / 25.0177°N 85.4954°E |
ఘోడా కటోరా (ఐమీ మగండా) సరస్సు భారతదేశంలో బీహార్ రాష్ట్రంలోని రాజగిరి నగరానికి సమీపంలో ఉన్న ఒక సహజమైన సరస్సు. ఈ సరస్సుకి శీతాకాలంలో సైబీరియా, మధ్య ఆసియా నుండి పక్షులు వలస వస్తాయి.[1][2]
భౌగోళికం
[మార్చు]ఈ సరస్సు గుర్రం ఆకారాన్ని పోలి ఉంటుంది. చుట్టూ మూడు వైపులా పర్వతాలు ఉన్నాయి. పర్యావరణ పర్యాటక ప్రదేశాలలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2009 లో మొదటిసారి ఈ సరస్సును సందర్శించారు. 2011 జనవరి 29 న దీనిని సాధారణ ప్రజలకు సందర్శన కొరకు తెరవబడింది. 2018 నవంబరులో 70 అడుగుల పొడవైన బుద్ధ విగ్రహాన్ని ఈ సరస్సు మధ్యలో ప్రతిష్ఠించారు.[3]
ప్రత్యేకత
[మార్చు]ఈ సరస్సు దగ్గర బోటింగ్, భోజనశాల, అతిథి గదుల సౌకర్యం కల్పించారు. ఈ సరస్సు మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఇసుకరాయితో నిర్మించారు.[4][5]
విస్తీర్ణం
[మార్చు]ఈ సరస్సు రాజగిరి నుండి 12 కిలోమీటర్ల (7.5 మైళ్ళు) దూరంలో ఉంది. 6.5 కిలోమీటర్ల (4.0 మైళ్ళు) పొడవైన అటవీ రహదారి రాజగిరి పట్టణాన్ని ఘోడా కటోరాతో కలుపుతుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ సరస్సు సమీపంలో మోటారు వాహనాలను నిషేధించారు.
మూలాలు
[మార్చు]- ↑ "घोड़ा-कटोरा झील राजगीर (नालन्दा) आदर्श पक्षी विहार-एक विवेचना (Ghoda-Katora Lake, Rajgir (Nalanda), an Ideal Bird Sanctuary - A Review) | Hindi Water Portal". hindi.indiawaterportal.org. Archived from the original on 2019-08-16. Retrieved 2019-08-16.
- ↑ "Ghora Katora, Nalanda". www.nativeplanet.com (in ఇంగ్లీష్). Retrieved 2019-08-16.
- ↑ "Amazing : घोड़े के आकार का है घोड़ाकटोरा, सम्राट अजातशत्रु का कभी यहां था अस्तबल". Live Hindustan (in హిందీ). Retrieved 2019-08-16.
- ↑ "The statue of lord Buddha in the Ghora Katora lake will unveiled on 25th November in Nalanda of Bihar". Retrieved 16 August 2019.
- ↑ "Buddha statue to be installed in Rajgir lake by month end". Times of India. Retrieved 16 August 2019.