Jump to content

ఘోడా కటోరా సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 25°01′04″N 85°29′43″E / 25.0177°N 85.4954°E / 25.0177; 85.4954
వికీపీడియా నుండి
(ఘోరా కటూరా సరస్సు నుండి దారిమార్పు చెందింది)
ఘోడా కటోరా
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Bihar" does not exist.
ప్రదేశంరాజగిరి, బీహార్, భారత దేశం
అక్షాంశ,రేఖాంశాలు25°01′04″N 85°29′43″E / 25.0177°N 85.4954°E / 25.0177; 85.4954

ఘోడా కటోరా (ఐమీ మగండా) సరస్సు భారతదేశంలో బీహార్ రాష్ట్రంలోని రాజగిరి నగరానికి సమీపంలో ఉన్న ఒక సహజమైన సరస్సు. ఈ సరస్సుకి శీతాకాలంలో సైబీరియా, మధ్య ఆసియా నుండి పక్షులు వలస వస్తాయి.[1][2]

భౌగోళికం

[మార్చు]

సరస్సు గుర్రం ఆకారాన్ని పోలి ఉంటుంది. చుట్టూ మూడు వైపులా పర్వతాలు ఉన్నాయి. పర్యావరణ పర్యాటక ప్రదేశాలలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2009 లో మొదటిసారి ఈ సరస్సును సందర్శించారు. 2011 జనవరి 29 న దీనిని సాధారణ ప్రజలకు సందర్శన కొరకు తెరవబడింది. 2018 నవంబరులో 70 అడుగుల పొడవైన బుద్ధ విగ్రహాన్ని ఈ సరస్సు మధ్యలో ప్రతిష్ఠించారు.[3]

ప్రత్యేకత

[మార్చు]
ఘోడా కటోరా సరస్సు మధ్యలో ఇసుక రాతితో నిర్మించిన బుద్ధ విగ్రహం

ఈ సరస్సు దగ్గర బోటింగ్, భోజనశాల, అతిథి గదుల సౌకర్యం కల్పించారు. ఈ సరస్సు మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఇసుకరాయితో నిర్మించారు.[4][5]

విస్తీర్ణం

[మార్చు]

ఈ సరస్సు రాజగిరి నుండి 12 కిలోమీటర్ల (7.5 మైళ్ళు) దూరంలో ఉంది. 6.5 కిలోమీటర్ల (4.0 మైళ్ళు) పొడవైన అటవీ రహదారి రాజగిరి పట్టణాన్ని ఘోడా కటోరాతో కలుపుతుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ సరస్సు సమీపంలో మోటారు వాహనాలను నిషేధించారు.

మూలాలు

[మార్చు]
  1. "घोड़ा-कटोरा झील राजगीर (नालन्दा) आदर्श पक्षी विहार-एक विवेचना (Ghoda-Katora Lake, Rajgir (Nalanda), an Ideal Bird Sanctuary - A Review) | Hindi Water Portal". hindi.indiawaterportal.org. Archived from the original on 2019-08-16. Retrieved 2019-08-16.
  2. "Ghora Katora, Nalanda". www.nativeplanet.com (in ఇంగ్లీష్). Retrieved 2019-08-16.
  3. "Amazing : घोड़े के आकार का है घोड़ाकटोरा, सम्राट अजातशत्रु का कभी यहां था अस्तबल". Live Hindustan (in హిందీ). Retrieved 2019-08-16.
  4. "The statue of lord Buddha in the Ghora Katora lake will unveiled on 25th November in Nalanda of Bihar". Retrieved 16 August 2019.
  5. "Buddha statue to be installed in Rajgir lake by month end". Times of India. Retrieved 16 August 2019.