చందు భాస్కర రావు

వికీపీడియా నుండి
(చందు భాస్కరరావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చందు భాస్కరరావు విజయవాడలో హరికథ సప్తాహం చేస్తున్నారు

చందు భాస్కర రావు ప్రముఖ రంగస్థల నటుడు, హరికథా భాగవతులు.[1] వీరి తండ్రి బసవ పున్నారావు కూడా నటులే.

వీరు చదువుకొంటున్న రోజుల్లోనే నాటకాలలో నటించడం ప్రారంభించారు. హరిశ్చంద్రునిగా, వికర్ణుడు, అభిమన్యుడు పాత్రలలోనటించారు. 1983లో ప్రొద్దుటూరులో జరిగిన రాష్ట్రస్థాయి నాటక పోటీలలో మొదటి బహుమతి పొందారు. వీరు ప్రజానాట్య మండలి కార్యకలాపాలలో పాల్గొని వివిధ సాంఘిక నాటకాలలో విభిన్నమైన పాత్రలు పోషించారు.

పిదప హరికథలు చెప్పాలని అభిలాషతో శ్రీ అనంతరెడ్డి వద్ద శిష్యరికం చేసి, శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త గారి వద్ద భారత, భాగవత, రామాయణ కథలు విపులంగా నేర్చుకొన్నారు. 1988లో తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన హరికథా పోటీలలో "ద్రోణపర్వం" గానంచేసి ప్రథమ బహుమతి పొందారు. వీరు తిరుపతమ్మ కథ, భగవద్గీత, శ్రీశైల మహాత్మ్యం, శ్రీకనకదుర్గా మహాత్మ్యం మొదలైన హరికథలు రచించారు.

శ్రీ ఆలపాటి ధర్మారావు గారి ద్వారా చక్రాయపాలెంలో స్వర్ణ కంకణంతో సన్మానించబడ్డారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కూడా ఘనసన్మానం చేసి, స్వర్ణ కంకణం బహుకరించారు. వీరికి హరికథా కేసరి, హరికథా సుధార్ణవ మొదలైన బిదురులు పొందారు.

వీరు తెనాలిలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. శ్రీ చందు భాస్కర రావు, నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 205.
  2. "23మందికి కళారత్న పురస్కారం". www.andhrabhoomi.net. 2016-04-09. Archived from the original on 2016-04-10. Retrieved 2023-03-24.