చందూ సర్వటే
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | చంద్రశేఖర్ త్రయంబక్ సర్వటే | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | సాగర్ (మధ్య ప్రదేశ్), సెంట్రేల్ ప్రావిన్సెస్, బ్రిటిషు భారతదేశం | 1920 జూలై 22|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2003 డిసెంబరు 22 ఇండోర్, మధ్య ప్రదేశ్ | (వయసు 83)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు |
| |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 34) | 1946 జూలై 20 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1951 డిసెంబరు 14 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1936 | Central Provinces and Berar | |||||||||||||||||||||||||||||||||||||||
1940–1943 | మహారాష్ట్ర | |||||||||||||||||||||||||||||||||||||||
1941–1944 | Hindus | |||||||||||||||||||||||||||||||||||||||
1943 | Bombay | |||||||||||||||||||||||||||||||||||||||
1944–1958 | హోల్కర్ | |||||||||||||||||||||||||||||||||||||||
1955–1956 | మధ్య భారత్ | |||||||||||||||||||||||||||||||||||||||
1958–1968 | మధ్య ప్రదేశ్ | |||||||||||||||||||||||||||||||||||||||
1968 | Vidarbha | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo |
చంద్రశేఖర్ త్రయంబక్ సర్వటే (1920 జూలై 22 - 2003 డిసెంబరు 23) భారతీయ క్రికెటర్, వేలిముద్ర నిపుణుడు.[1] [2] అతను 1946 - 1951 మధ్యకాలంలో భారతదేశం తరపున తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆల్ రౌండరు. అతని టెస్ట్ బ్యాటింగ్ సగటు 13.00, అతని టెస్ట్ బౌలింగ్ సగటు 124.66. అతను స్లో లెగ్ బ్రేక్ వేసేవాడు.
కెరీర్
[మార్చు]సర్వటే ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్ 32 సంవత్సరాల పాటు సాగింది. ఈ సమయంలో అతను సెంట్రల్ ప్రావిన్సులు, బేరార్, మహారాష్ట్ర, హిందువులు, బొంబాయి, హోల్కర్, మధ్యప్రదేశ్, విదర్భలకు ప్రాతినిధ్యం వహించాడు.
మే 1946లో ఓవల్‌లో సర్రేతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు తరపున ఆడుతూ సర్వటే, తన అత్యంత ప్రసిద్ధ ఇన్నింగ్స్‌ను ఆడాడు. జట్టు స్కోరు 205/9 వద్ద ఉన్నపుడు సర్వటే బ్యాటింగ్‌కు వచ్చి, షూట్ బెనర్జీతో కలిసి చివరి వికెట్‌కు 249 పరుగులు జోడించాడు. మొదటి తొమ్మిది వికెట్లన్నీ కలిసి చేసిన దానికంటే వీళ్ళు ఎక్కువ పరుగులు చేసారు. ఇద్దరూ సెంచరీలు చేసారు. 2018 నాటికి, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఇది ఒకే ఒక్క ఉదాహరణగా మిగిలిపోయింది.[3][4] వారి 249 పరుగుల భాగస్వామ్యం ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో పది, పదకొండో నంబర్ బ్యాట్స్‌మెన్ల మధ్య అత్యధిక భాగస్వామ్యంగా మిగిలిపోయింది.[5] సర్వటే 124 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తరువాత, సర్రే ఇన్నింగ్సులో 5/54 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్, తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.[6]
1951లో బెంగాల్‌పై హోల్కర్ జట్టు తరఫున ఆడుతూ సర్వటే, తన అత్యధిక ఫస్ట్‌క్లాస్ స్కోరు 246 చేసాడు. 1946లో మైసూర్‌పై హోల్కర్ తరఫున 61 పరుగులకు 9 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ బౌలింగు ప్రదర్శన. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతని బ్యాటింగ్ సగటు 32.73, బౌలింగ్ సగటు 23.54. [7] [8] [9]
సర్వటే 1980ల ప్రారంభంలో మూడు సంవత్సరాలు జాతీయ సెలెక్టరుగా ఉన్నాడు. 1983లో ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లలో ఒకడు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కాకుండా, అతను అనేక సందర్భాల్లో దాని ఎంపిక కమిటీకి ఛైర్మన్‌గా కూడా ఉన్నాడు. సర్వటే కళలు, న్యాయశాస్త్రంలో డిగ్రీలు పొందాడు. వృత్తిరీత్యా అతను వేలిముద్ర నిపుణుడు. [10] [11]
మూలాలు
[మార్చు]- ↑ Memon, Ayaz (28 December 2011). "Cricketers with a day job". Livemint. Retrieved 18 December 2018.
- ↑ "Did you know?". The Hindu. 4 November 2004. Retrieved 18 December 2018.
- ↑ Williamson, Martin (4 August 2007). "Tale of the tail". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 17 October 2018.
- ↑ "Sting in the tail". ESPNcricinfo. 13 May 2005. Retrieved 15 May 2017.
- ↑ "First-class Matches / Highest Partnerships by Wicket". ESPNcricinfo. Retrieved 18 December 2018.
- ↑ "Surrey Escapes Innings Defeat Narrowly". The Indian Express. 14 May 1946. p. 11.
- ↑ "Chandu Sarwate". ESPNcricinfo. Retrieved 17 October 2018.
- ↑ "Holkar v Mysore in 1945/46". CricketArchive. Retrieved 17 October 2018.
- ↑ "Bengal v Holkar in 1950/51". CricketArchive. Retrieved 17 October 2018.
- ↑ "Chandu Sarvate passes away". The Telegraph (in ఇంగ్లీష్). Kolkata: ABP Group. 24 December 2003. Retrieved 17 October 2018.
- ↑ "Chandu Sarwate dies at 83". ESPNcricinfo (in ఇంగ్లీష్). 24 December 2003. Retrieved 17 October 2018.