చంద్ర ప్రకాష్ చౌదరి
చంద్ర ప్రకాష్ చౌదరి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 | |||
ముందు | రవీంద్ర కుమార్ పాండే | ||
---|---|---|---|
నియోజకవర్గం | గిరిడిహ్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 డిసెంబరు 28 - 2015 ఫిబ్రవరి 20 | |||
పదవీ కాలం 2005 – 2019 | |||
ముందు | బాబూలాల్ మరాండీ | ||
తరువాత | మమతా దేవి | ||
నియోజకవర్గం | రామ్‌గఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చితార్పూర్, జార్ఖండ్, భారతదేశం | 1967 ఆగస్టు 18||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ | ||
జీవిత భాగస్వామి | సునీతా చౌదరి | ||
సంతానం | సూరజ్ చౌదరి, కుమార్ పీయూష్, సోనాల్ ప్రియా చౌదరి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
చంద్ర ప్రకాష్ చౌదరి (జననం 18 ఆగస్టు 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు గిరిడిహ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]చంద్రప్రకాష్ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2000 నుండి 2003 వరకు హజారీబాగ్ జిల్లా కన్వీనర్‌గా, రామ్‌గఢ్ జిల్లా అధ్యక్షుడిగా, కేంద్ర కోశాధికారిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2005లో రామ్‌గఢ్ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2009, 2014 ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై అర్జున్ ముండా మంత్రివర్గంలో తొలిసారిగా భూ రెవెన్యూ మంత్రిగా ఆ తరువాత రఘుబర్ దాస్ మంత్రివర్గంలో 2014 డిసెంబరు 28 నుండి 2015 ఫిబ్రవరి 20 వరకు జలవనరులు, తాగునీరు & పారిశుద్ధ్య, విపత్తు నిర్వహణ మంత్రిగా పని చేశాడు.
చంద్రప్రకాష్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గిరిడిహ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఏజేఎస్‌యూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేఎంఎం అభ్యర్థి జగర్నాథ్ మహతోపై 2,48,347 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత 2024 ఎన్నికలలో వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (2024). "Chandra Prakash Chaudhary" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "AJSU के चंद्र प्रकाश गिरिडीह से 80 हजार से अधिक वोटों के अंतर से जीते, जानिए उनके बारे में सबकुछ". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Giridih". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.