చర్చ:ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

రహమతుల్లా గారూ! ఈ వ్యాసం మొదలు పెట్టినందుకు సంతోషం. ఇది మీకు బాగా తెలిసిన సబ్జెక్టు అనుకొంటాను. కేవలం జాబితాతో సరిపెట్టకుండా, రెవిన్యూ డివిజన్ అంటే ఏమిటి? ఈ వ్యవస్థ ఎలా మొదలయ్యింది. ఇప్పుడు పాలన ఎలా నడుస్తుంది. ముఖ్యమైన కార్య నిర్వాహక వ్యవస్థ ఎలా ఉంటుంది. సమస్యలు ఏమిటి? షుమారు ఎంత రెవిన్యూ ఉంటుంది - వంటి విషయాలు వ్రాస్తే చాలా బాగుంటుంది --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:24, 6 జూలై 2008 (UTC)

ఇప్పటి వరకు ఉన్న సమాచారం సమకూర్చాను.అయితే 23 జిల్లాల సమాచారంలోకూడా ఈ రెవిన్యూ డివిజన్ల వివరాలు చేర్చండి.రెవిన్యూ డివిజన్ల సంఖ్య జనాభాకు అణుగుణంగా పెరగాల్సి ఉంది.రైలు మార్గం డివిజన్ కేంద్రాలన్నిటికీ విస్తరించాలి.హైదరాబాద్ చుట్టుపక్కల 6 మండలాల్లో డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దారులుగా పనిచేస్తున్నారు.అలా కాకుండా ప్రతి ఎమ్మెల్యే నియోజక వర్గాన్నీ ఒక డివిజన్ గా ప్రకటిస్తే బౌగోళిక సరిహద్దులు ఎమ్మెల్యేకి, డిప్యూటీ కలేక్టర్ కూ సమానంగా ఉంటాయి. పాలనా వ్యూహాలు ఉమ్మడిగా రూపొందిస్తారు.ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ప్రజలకు దొరుకుతారు.ఎమ్మెల్యేలకు కూడా కార్యాలయ భవనాలు శాశ్వతంగా ఏర్పడతాయి.--Nrahamthulla 06:53, 8 జూలై 2008 (UTC)
వ్యాసంలోని "రైలు మార్గాలు లేని రెవిన్యూడివిజన్ కేంద్రాలు" విభాగంలో వికారాబాదు పేరు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని ఆ పట్టణంలో రైల్వే మార్గమే కాదు, రైల్వే జంక్షన్ కూడా ఉంది. పరిశీలించి సరిచేయగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:37, 8 జూలై 2008 (UTC)
  • Chandra Kanth Rao గారూ Thanks.తప్పు సమాచారాన్ని మీరే సరి చేయవచ్చు.--Nrahamthulla 17:52, 8 జూలై 2008 (UTC)