చర్చ:ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వ్యాస విస్తరణకు సూచనలు[మార్చు]

రహమతుల్లా గారూ! ఈ వ్యాసం మొదలు పెట్టినందుకు సంతోషం. ఇది మీకు బాగా తెలిసిన సబ్జెక్టు అనుకొంటాను. కేవలం జాబితాతో సరిపెట్టకుండా, రెవిన్యూ డివిజన్ అంటే ఏమిటి? ఈ వ్యవస్థ ఎలా మొదలయ్యింది. ఇప్పుడు పాలన ఎలా నడుస్తుంది. ముఖ్యమైన కార్య నిర్వాహక వ్యవస్థ ఎలా ఉంటుంది. సమస్యలు ఏమిటి? షుమారు ఎంత రెవిన్యూ ఉంటుంది - వంటి విషయాలు వ్రాస్తే చాలా బాగుంటుంది --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:24, 6 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పటి వరకు ఉన్న సమాచారం సమకూర్చాను.అయితే 23 జిల్లాల సమాచారంలోకూడా ఈ రెవిన్యూ డివిజన్ల వివరాలు చేర్చండి.రెవిన్యూ డివిజన్ల సంఖ్య జనాభాకు అణుగుణంగా పెరగాల్సి ఉంది.రైలు మార్గం డివిజన్ కేంద్రాలన్నిటికీ విస్తరించాలి.హైదరాబాద్ చుట్టుపక్కల 6 మండలాల్లో డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దారులుగా పనిచేస్తున్నారు.అలా కాకుండా ప్రతి ఎమ్మెల్యే నియోజక వర్గాన్నీ ఒక డివిజన్ గా ప్రకటిస్తే బౌగోళిక సరిహద్దులు ఎమ్మెల్యేకి, డిప్యూటీ కలేక్టర్ కూ సమానంగా ఉంటాయి. పాలనా వ్యూహాలు ఉమ్మడిగా రూపొందిస్తారు.ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ప్రజలకు దొరుకుతారు.ఎమ్మెల్యేలకు కూడా కార్యాలయ భవనాలు శాశ్వతంగా ఏర్పడతాయి.--Nrahamthulla 06:53, 8 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలోని "రైలు మార్గాలు లేని రెవిన్యూడివిజన్ కేంద్రాలు" విభాగంలో వికారాబాదు పేరు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని ఆ పట్టణంలో రైల్వే మార్గమే కాదు, రైల్వే జంక్షన్ కూడా ఉంది. పరిశీలించి సరిచేయగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:37, 8 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం నుండి రెవెన్యూ డివిజను సమాచారం తరలింపు గురించి[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసానికి రెవెన్యూ డివిజన్, రెవెన్యూ డివిజన్లు అనే పేజీలు దారిమార్పు చేసారు.రెవెన్యూ డివిజన్/రెవెన్యూ డివిజన్లు అనేది ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించినదికాదు.ఇది సార్వత్రిక వ్యాసాల కోవకు చెందిన వ్యాసం.దీనికి ప్రత్యేక పేజీ ఉండాల్సినవ్యాసం.కావున దీనికి దారిమార్పు చేసిన రెవెన్యూ డివిజన్, రెవెన్యూ డివిజన్లు అనే దారి మార్పు పేజీలు తొలగించి, ఈ వ్యాసంలో ఉన్న రెవెన్యూ డివిజనకు సంబందించిన సమాచారం రెవెన్యూ డివిజన్ అనే పేజీకి తరలించి,దీనిని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు జాబితాగా మార్చవలసిన అవసరంఉంది.ఆంగ్ల వికీపీడియాలో కూడా ఇలాగే En:List of revenue divisions in Andhra Pradesh, en:Revenue division అని రెండు వ్యాసాలు ఉన్నవి.రెవెన్యూ డివిజన్ అనే వ్యాసం సమాచార పెట్టెలకు కూడా లింకు కలిగి ఉంటుంది. స్పందించగలరు. -- 2020-11-10T12:16:01‎ యర్రా రామారావు

యర్రా రామారావు గారూ, మీ సూచన సమంజసంగా ఉంది. రెవిన్యూ డివిజనుకు ప్రత్యేకంగా పేజీ ఉండాలి. మీరు చెప్పినమార్పులు చేసెయ్యవచ్చు. __చదువరి (చర్చరచనలు) 07:11, 10 నవంబర్ 2020 (UTC)