చర్చ:క్షీరారామం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg క్షీరారామం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2016 సంవత్సరం, 11 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Updated DYK query.svg క్షీరారామం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 34 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే పేరుతో తరలింపు చేయాలి[మార్చు]

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

క్షీరారామం అనే శీర్షిక అసంపూర్తిగా ఉంది.ఇది పంచారామా క్షేత్రాలలో ఒకటి.ఇది పాలకొల్లు పట్టణం పరిధిలో ఉంది.పంచారామా క్షేత్రాలలో ఒకటి అయినప్పటికి క్షేత్రంలో ఉన్న ఆలయం [సూచిక ప్రకారం] శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం అని తెలుస్తుంది.అందువలన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం (పాలకొల్లు) అనే పేరుతో తరలింపు చేయాలని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 15:46, 26 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావుగారు, నాకు తెలిసినంతవరకు క్షీరారామం ఎక్కువ వాడుకలో వున్నందున, మీరు ప్రతిపాదించిన పేరుతో క్షీరారామంకు దారిమార్పు చేయడం మంచిది. అర్జున (చర్చ) 22:14, 26 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారూ, "నాకు తెలిసినంతవరకు క్షీరారామం ఎక్కువ వాడుకలో వున్నందున" అని తెలిపారు. ఏ రకంగానో వివరించగలరా? యర్రా రామారావు (చర్చ) 03:33, 27 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు, మీరు సూచించిన లింకులో క్షీరారామం పెద్ద అక్షరాలతో వుంది గమనించండి. నేను గతంలో పంచారామాలకుసంబంధించిన OSM పటాలు లేక అక్షాంశ రేఖాంశాలు చేర్చటానికి కృషి చేశాను. ఆ అనుభవంతో చెప్పాను. అర్జున (చర్చ) 11:54, 1 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారూ మీ స్పందనకు, సూచనలకు ధన్యవాదాలు.మనం ఇందులో ప్రామాణికంగా తీసుకోవలసింది పెద్ద అక్షరాలతో రాసారా, చిన్న అక్షరాలతో రాసారా అని కాదు.మీరు గమనించారో లేదా మీరు సూచించిన పెద్ద అక్షరాలకన్నా ముందు, వాటికన్నా చిన్న అక్షరాలతో పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం అని కూడా ఉంది. దీని మీద నేను పునరాలోచించగా కొన్ని సందేహాలు తలెత్తుతున్నవి.
 • అధికారక నామం అంటే ఆలయ నామ పలకం మీద ఎలా ఉంది?
ఈ ఈలయం అధికారక వెబ్సైటు లో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం , పాలకొల్లు అని ఉంది,
 • గూగుల్ ఫలితాలు ఎలా ఉన్నవి?
శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం (పాలకొల్లు) అనే దానికి గూగుల్ ఫలితాలు 1,51,000 , క్షీరారామం అనే దానికి 25,300 ఫలితాలు చూపుతుంది.
 • ఇది పంచారామాలు ఆలయాలలో ఒకటి. ఇవి అన్నీ ఒకే విధంగా శీర్షికలు ఉండాలి.? అలా ఉంటేనే వీటిని పంచారామాలు అనే దానికిఅర్థం ఉంది.
 • వీటిని గురించి కూడా ఈ చర్చలో ఆలోచించాలి. అయితే అవి తెవికీలో ఇలా ఉన్నాయి.
 1. ద్రాక్షారామం -పంచారామాలలో ఒకటని చెప్పబడే ఈ శీర్షిక వాస్తవంగా రామచంద్రపురం మండలంలోని ఒక గ్రామం పేరు. వాస్తవంగా పంచారామాలలో ఒకటైన ఆలయ అధికారక నామం "శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం" లేదా భీమేశ్వర స్వామి వారి ఆలయం - ద్రాక్షారామం అని ఉంది.కానీ వికీలో ప్రత్యేక వ్యాసం లేదు. ద్రాక్షారామం గ్రామ వ్యాసంలో వివరించిఉంది.
 2. కుమారభీమారామం - పంచారామాలలో ఒకటని చెప్పబడే ఈ కుమారభీమారామం క్షేత్రం సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంది.దాదాపుగా ఇది సామర్లకోట పరిధిలో ఉండి ఉంటుంది.ఈ ఆలయం కుమార భీమారామ ఆలయం అనే పేరుతో ఉంది.
 3. క్షీరారామం - ఇక క్షీరారామం సంగతి గురించి పైన కొంత చర్చ జరిగింది.
 4. భీమారామం -పంచారామాలలో ఒకటని చెప్పబడే ఒకటైన భీమారామం భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని సోమేశ్వరక్షేత్రమని అని పిలుస్తారు. సోమేశ్వరస్వామి దేవాలయం, భీమవరం దీని అసలు పేరు.
 5. అమరారామం -పంచారామాలలో ఒకటని చెప్పబడే అమరారామం అనే శీర్షికను అమరేశ్వరస్వామి దేవాలయం అనే దానికి దారి మార్పు ఇచ్చారు.ఈ ఆలయం అమరావతి లో ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే,
అందువలన ఈ చర్చలో ఎక్కువమంది చర్చించి , తగిన నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం చర్యలు తీసుకోవటానికి నేను అభిప్రాయపడుతున్నాను. చర్చ క్షీరారామం అనే ఒక్కదానికే పరిమితం కాకుండా పంచారామాలు అనే అన్నిటికి ఎలా ఉండాలి? ఏది దారిమార్పు చేయాలి? అని వివరంగా ఒక నిర్ణయం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 16:49, 1 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలితం: వికీలో పేజీ ఎలా ఉండాలనేదానికి సరైన హేతువు - అధికంగా వాడుకలో ఉన్న సరైన పేరును పేజీకి పెట్టాలి. ఇక్కడ రెండు పేర్లున్నై, రెండూ సరైనవే. తప్పు పేర్లేమీ కావు. గూగుల్ ఫలితాలు దీనికి ఒక కొలతగా భావిస్తే, వాటిలో "క్షీరారామం"కు 25 వేల ఫలితాలొచ్చాయి. "శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం (పాలకొల్లు)" అనేది చాలా విస్తృతమైన వెతుకులాట పదం. దీనిలో ఉత్త "పాలకొల్లు"కు, ఉత్త "శ్రీ" కి, "క్షీర" కు.. ఇలా ఒక్కొక్క పదానికీ వెతుకులాట ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఫలితాలు ఎక్కువగా కనబడతాయి. దీని కోసం వెతకడానికి ఈ పదాలన్నిటినీ డబుల్ కోట్ల మధ్య పెడితే సరైన ఫలితాలొస్తాయి. "శ్రీ", "పాలకొల్లు"లను తీసేసి "క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం" కోసం వెతకాలి. అలా వెతికితే వచ్చిన ఫలితాలు చాలా తక్కువ. ఆ ఫలితాలు ఇలా ఉన్నాయి:

 • "శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం (పాలకొల్లు)": 2
 • "శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం" - 6
 • "క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం" - 491
 • "క్షీర రామలింగేశ్వర స్వామి" - 11,000
 • "క్షీరరామలింగేశ్వర స్వామి" - 64
 • "క్షీరరామలింగేశ్వరస్వామి" - 36

ఏ విధంగా చూసినా క్షీరారామం మరింత వ్యాప్తిలో ఉన్న పేరని తెలుస్తోంది కాబట్టి ఇలాగే ఉంచాలని నిర్ణయిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 02:21, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.