చర్చ:గ్రంథచౌర్యం
Jump to navigation
Jump to search
పేరు గురించి
[మార్చు]- "గ్రంథచౌర్యం అనేమాట గ్రంధాన్ని చౌర్యం చేయడమని అర్ధం సూచిస్తున్నా, 'ప్లగారిజం' పదం వలె ఈ పదాన్ని విస్తృత పరిథిలో ఉపయోగిస్తారు." అని వ్యాసంలో చెప్పేసినప్పటికీ, "గ్రంథచౌర్యం" అనే మాట ఒక్క పుస్తకాలకే వర్తిస్తున్నట్టుగా స్ఫురిస్తోంది. "మేధోచౌర్యం" "భావచౌర్యం" వంటి పేర్లను కూడా పరిశీలించవలసినది. అయితే నేను గ్రంథచౌర్యం అనే పేరుకు వ్యతిరేకం కాదు.
- వ్యాసం పేరులో బ్రాకెట్లో ఇంగ్లీషు పేరు పెట్టి క్వాలిఫై చెయ్యనక్కరలేదు. అవసరమనుకుంటే ఇంగ్లీషు పేరుతో ఒక దారిమార్పు సృష్టించవచ్చు.
- ఇంగ్లీషు మాటను పలికే విధానం "ప్లగారిజం" సరియేనా! నేను జాలంలో చూస్తే "ప్లేజరిజం" అన్నట్లుగా ఉంది. పరిశీలించగలరు.
- "గ్రంధ" కాదు "గ్రంథ"
__చదువరి (చర్చ • రచనలు) 04:43, 19 ఏప్రిల్ 2021 (UTC)
- ఈ వ్యాసం శీర్షిక గ్రంధకు బదులు గ్రంథ అని ఉండాలి.--యర్రా రామారావు (చర్చ) 03:17, 28 మే 2021 (UTC)
- అవసరమైన సవరణలు సూచించారు. చేసారు. ధన్యవాదాలు.
- గ్రంథచౌర్యం అనే పదము పరిమితమైనది. కానీ ఎక్కువమంది రచయతలు పూర్వకాలము నుండి తెలుగులో వాడటముతో అర్జున్ రావు గారు ఈపదాన్ని సూచించారు. అందుకనే నేను ఈ పదాన్నే వాడాను.
- గూగుల్ ఉచ్ఛారణ ప్రకారం ఈపదాన్ని ప్లేజరిజం అనవచ్చు. ఈ పదాన్ని వృత్తిపరంగా 'ప్లగారిజం ' అని ఉచ్ఛరిస్తారు. అందుకనే నేను ఈ పదాన్నే వాడాను. --VJS (చర్చ) 13:36, 29 మే 2021 (UTC)
ఈ వారపు వ్యాసం గా స్వీకరణ అర్ధం
[మార్చు]Cscr-featured.svg గ్రంథచౌర్యం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 32 వ వారంలో ప్రదర్శించటానికి స్వీకరించారు. అని రాసి ఉంది నాకు అర్ధం కాలేదు. వివరించండి. --VJS (చర్చ) 13:36, 29 మే 2021 (UTC)
- VJS గారూ, వికీపీడియా మొదటి పేజీలో ఈ వారం వ్యాసం అనే శీర్షిక ఒకటుంది. సమాచార పరిమాణం పరంగాను, నాణ్యత పరంగాను మేలుగా అనిపించే వ్యాసాలను ఎంచి వారానికొకటి చొప్పున ఈ శీర్షికలో ప్రదర్శిస్తూంటారు. మొదటి పేజీలో ప్రదర్శించడం వలన ఆ వ్యాసాలను మామూలు కంటే ఎక్కువ మంది పాఠకులు చదువుతారు. "గ్రంథచౌర్యం" వాసాన్ని ఈ సంవత్సరం 32 వ వారంలో (ప్రస్తుతం 21 వ వారం నడుస్తోంది. ఇప్పుడు ఘట్టమనేని కృష్ణ వ్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు) ప్రదర్శించేందుకు స్వీకరించారు.
- ఈ వ్యాసాల నాణ్యతను ఎంచేందుకు ప్రస్తుతం గీటురాయి ఏమీ లేదు. ఈ శీర్షికను నిర్వహించేవారి విచక్షణా శక్తిని బట్టి ఈ ఎంపిక ఉంటుంది. ప్రస్తుతం ఈ శీర్షికను నేను నిర్వహిస్తున్నాను.
- వాడుకరులకు మంచి వ్యాసమేదైనా కనిపించినపుడు, దానికి ఈ శీర్షికలో ప్రచురించే యోగ్యత ఉందని భావిస్తే సంబంధిత చర్చ పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అని చేర్చవచ్చు. ఈ పని ఎవరైనా చెయ్యవచ్చు. ఇలాంటి వ్యాసాలన్నీ వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గం లోకి చేరుతాయి. శీర్షిక నిర్వాహకులు దాన్ని పరిశీలించి ప్రదర్శనా యోగ్యత ఉందని తెలిస్తే దానికి వారాన్ని నిర్ణయించి, పై మూసను తీసేసి {{ఈ వారం వ్యాసం}} అనే మూసను చేరుస్తారు. ప్రతిపాదించిన తరువాతా, ఎంపిక చేసిన తరువాతా, ప్రదర్శించిన తరువాత కూడా ఈ వ్యాసాలపై పనిచేసి మరింతగా మెరుగుపరుస్తూండడం కద్దు.
- "గ్రంథచౌర్యం" వ్యాసంలో ప్రతిపాదన ఎవరూ చెయ్యలేదు - నేరుగా వారాన్ని నిర్ణయించి ప్రకటించాను.
- __చదువరి (చర్చ • రచనలు) 06:33, 30 మే 2021 (UTC)
ధన్యవాదాలు--VJS (చర్చ) 06:54, 30 మే 2021 (UTC)