చర్చ:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి/GA1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసాన్ని సమీక్షకు స్వీకరించాను. వచ్చే నాలుగు రోజుల్లో సమీక్షను ముగిస్తాను. __చదువరి (చర్చరచనలు) 08:38, 21 ఆగస్టు 2018 (UTC)

Rate ప్రమాణం సమీక్షా వ్యాఖ్య
1. చక్కగా రాసినదై ఉండాలి:
వ్యాసంలోని వచనంలో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు ఉండకూడదు.. .
అది శైలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.. .
2. మౌలిక పరిశోధన లేకుండా నిర్ధారించదగి ఉండాలి:
దానిలో అన్ని మూలాల జాబితా, వ్యాసం లేఅవుట్‌కి అనుగుణంగా ఉండాలి. .
వ్యాసంలో వాక్యం పక్కనే ఇచ్చే మూలాలు వికీపీడియా:నమ్మదగ్గ మూలాల నుంచి ఉండాలి. నేరుగా ప్రస్తావిస్తున్న కొటేషన్లు, ప్రచురితమైన అభిప్రాయాలు, సహజ విరుద్ధమైన అంశాలు, వివాదాస్పదమైన వాక్యాలు వంటి ప్రశ్నించదగ్గ, సందేహించదగ్గ అంశాలు, జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివాదాస్పదమైన సమాచారం మరీ ముఖ్యంగా ఈ నమ్మదగ్గ మూలాలతో సమర్థించాలి.. .
దానిలో మౌలిక పరిశోధనలు లేకుండా ఉండాలి. .
కాపీహక్కుల ఉల్లంఘనలు గాని, గ్రంథచౌర్యం గానీ ఉండకూడదు.. .
3. విస్తృత పరిధి కలిగి ఉండాలి:
వ్యాస విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పరామర్శించాలి. .
అనవసరమైన అంశాల జోలికి పోకుండా వ్యాస విషయంపైననే దృష్టిని నిలిపి ఉంచాలి (en) (వికీపీడియా:సారాంశం శైలి (en) చూడండి). .
4. తటస్థం: నిష్పాక్షికంగా ఉంటూ, వివిధ దృక్కోణాలకు తగు విలువను ఇస్తూ చూపించాలి..
5. స్థిరత్వం: దిద్దుబాటు యుద్ధాల వలన గాని, పాఠ్య సంబంధ వివాదాల వలన గానీ వ్యాసంలో అనునిత్యం మార్పుచేర్పులు జరుగుతూ ఉండరాదు..
6. సచిత్రం: వీలైనంతవరకు బొమ్మలు, వీడియో (en), ఆడియో (en) వంటివి వాడాలి.:
మీడియాకు వాటి కాపీహక్కుల స్థితికి సంబంధించిన వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా ఉండాలి. అలాగే, స్వేచ్ఛగా అందుబాటులో లేని (en) మీడియాకు సముచిత వినియోగపు హేతుబద్ధతను (en) సూచించాలి.. .
మీడియా, విషయానికి సంబంధించినవై (en) ఉండాలి. వాటికి సముచితమైన వ్యాఖ్యలు (en) ఉండాలి. .
7. సమీక్షా ఫలితం.

స్థూలంగా[మార్చు]

వ్యాసాన్ని ఆమూలాగ్రం ఒకసారి చదివాను. తొలిచూపులో నేను గమనించినవివి:

 • ఈ వ్యాసానికి "మంచి వ్యాసం" అనే ఇంటిపేరు తగిలించుకోవడానికి అన్ని హక్కులూ ఉన్నై. వ్యాస రచయితలు చేసిన పరిశోధనా కృషి వ్యాసమంతా పరుచుకుని ఉంది.
 • కొన్ని హంగులు ఇంకా ఉంటే మరింత బాగుంటుంది. కొన్ని:
  • ఫోటోలు (ఆ కాలంనాటి తెలుగువారి ఫోటోలు దొరకడం గగనమే)
  • మరికొన్ని మూలాలు ఉంటే బాగుంటుంది.
  • మరికొంత విస్తారమైన ప్రవేశిక

వివరమైన సమీక్ష త్వరలో రాస్తాను.

పేరు[మార్చు]

పేరు చెళ్ళపిళ్ళ చెళ్లపిళ్ల - ఈ రెంటిలో ఏ పేరు సరైనదో (ఏది ఎక్కువ ప్రాచుర్యంలో ఉందో) గమనిస్తే చెళ్ళపిళ్ళ ఎక్కువగా వాడుతున్నారని గూగుల్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. చెళ్ళపిళ్ళ:1,02,000 చెళ్లపిళ్ల: 2,320. అయితే, దాన్ని ధ్రువీకరించే ముందు, ఆయన రాసిన పుస్తకాల్లో, ఆయన గురించి రాసిన పుస్తకాల్లో ఎలా ఉందో పరిశీలించాలి.

వికీ నియమాలు మార్గదర్శకాలు[మార్చు]

 • గారు, బహువచనం వంటి మర్యాద వాచకాలు ఉన్నాయి. వికీ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని సవరించాలి.
గారు, -రు వంటివి సవరిస్తున్నాను. అయితే అవధాన్లు, శాస్త్రులు వంటివి గౌరవపురస్సరంగా వచ్చాయో, పేరులో భాగమో చెప్పడం కాస్త కష్టం. ఈ విషయంలో ఏం చేద్దాం అన్నదానిపై సమీక్షకుని స్పందన కోరుతున్నాను (పవన్)
చదువరి గారూ! కొటేషన్లో ఉన్న గారులు మాత్రం ఉంచేశాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:58, 4 జనవరి 2019 (UTC)
 • వీసెల్ వర్డ్ లు (లాంటివి), వాడుకరి దృక్కోణాలూ ఉన్నాయి.
  • Yes check.svg Done "ఎందరో అవధానులు, కవులు తయారయ్యారో లెక్కలేదు" - ఎందరు అవధానులు, కవులు తయారయ్యారో లెక్కలేదు అని ఉండాలి. అయితే, "లెక్కలేదు" అనేది వీసెల్ వర్డ్ అని సందేహం.
  • Yes check.svg Done ప్రదర్శించని ఊరు కానీ, ఆలయం కానీ ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. - వికీకనుగుణంగా మార్చాలి. లేదా (వ్యాసంలో మరోచోట చెప్పినట్టు) అది ఎవరో అన్నమాట అయితే, దాన్ని ఉదహరించాలి
  • Yes check.svg Done (ఆశు కవిత్వమంటే మౌఖిక కవిత్వం వంటి ఛాయాల్లో అర్థం చేసుకోవాలి) - ఇది వాడుకరి దృక్కోణంలాగా ధ్వనిస్తోంది.

పాఠ్యం[మార్చు]

 • "ఆపై గురువు అంగీకారంతో వివాహం జరగడం వంటి అనుకోని పరిణామాలు ఎదురు కాగా, వివాహమైన అనంతరం తన సహాధ్యాయితో కలిసి సాహసించి వారణాసి బయలుదేరాడు. వారణాసికి వెళ్ళేందుకు చేతిలో డబ్బు లేకున్నా ఆయన, సహాధ్యాయి కృష్ణశాస్త్రులు విద్యాప్రదర్శనలు, కవిత్వ సభల ద్వారానే డబ్బు సంపాదించుకుని కాశీ చేరుకున్నారు."
  • Yes check.svg Done "అనుకోని పరిమాణాలు" ఇమడలేదు. "జరగడం వంటి అనుకోని పరిణామాలు ఎదురు కాగా" బదులు "జరగడంతో," అని ఉంటే బాగుంటుంది.
  • Yes check.svg Done "కృష్ణశాస్త్రులు" అనే పేరు మొదటి వాక్యంలో ఇచ్చి, రెండో వాక్యంలో "సహాధ్యాయి" అనేది తీసేస్తే బాగుంటుంది.
 • విద్యలను కూడా చెప్పుకున్నారు - నేర్చుకున్నారు అంటే బాగుంటుందేమో!
చెప్పుకున్నారు అన్నది వేదవిద్యలకు పండితులు సహజంగా వాడే పదం. పాఠకులకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి నోట్స్ ఇచ్చాను. సరిపోతుందేమో పరిశీలించగలరు. (పవన్)
 • Yes check.svg Done నోరి సుబ్రహ్మణ్యశాస్త్రులు (బ్రహ్మయ్యశాస్త్రిగారి గురువు)గారివద్ద వ్యాకరణం తరువాయి నేర్చుకోవటం మొదలుబెట్టారు. - తరువాయి ఇమడలేదు.
 • Yes check.svg Done "ఆ వాత్సల్యం చేత బలవంతపెట్టి మరీ సిద్ధాంత చంద్రోదయమనే వ్యాఖ్యాన సహితంగా తర్కసంగ్రహాన్ని ఉపదేశించారు. " - ఈ వాక్యం మరింత అర్థవంతంగా ఉండాలి.
 • Yes check.svg Done "మరికొన్నాళ్ళకు తల్లిదండ్రులు ఉత్తరం వ్రాసి, డబ్బు పంపి తిరిగి రమ్మని మరీమరీ కోరడంతో సావకాశంగా తిరిగివచ్చాడు వేంకటశాస్త్రి. " - ఈ వాక్యం తరువాత వచ్చిన గురువుల ప్రస్తావన, కాశీ నుండి తిరిగి వచ్చిన తరువాతి సంగతైతే, ఈ వాక్యం తరువాత పేరా మార్చాలి. ఆ గురువులు కూడా కశీలోని వారే అయితే, ఈ వాక్యాన్ని పేరా చివర చేర్చాలి.
 • Yes check.svg Done "సతీర్థ్య" - దీని అర్థం/సమానార్థకం రాస్తే బాగుంటుందేమో, తేలిగ్గా అర్థమవటానికి.
 • Yes check.svg Done "పోట్లాట కూడా ఆడుకుంటూ ఉండేవారు" - పోట్లాడుకుంటూ కూడా ఉండేవారు అంటే బాగుంటుందేమో!
 • Yes check.svg Done ఆదరణ వేంకటశాస్త్రికే ఎక్కువగా ఉండేవి - ఆదరణ వేంకటశాస్త్రికే ఎక్కువగా ఉండేది
 • Yes check.svg Done పద్యపాఠనం - పద్యపఠనం సరైనదేమో..
 • Yes check.svg Done షడ్డర్శనీవేది - (నాకు అర్థం తెలీలేదు. నావంటి వారు ఇంకా ఉండవచ్చు.) అర్థం వివరిస్తే బాగుంతుంది.
 • Yes check.svg Done "ఎందరో అవధానులు, కవులు తయారయ్యారో లెక్కలేదు" - ఎందరు అవధానులు, కవులు తయారయ్యారో లెక్కలేదు అని ఉండాలి. "లెక్కలేదు" అనేది వీసెల్ వర్డ్ అని సందేహం.
 • Yes check.svg Done "సహాధ్యాయి కందుకూరి కృష్ణశాస్త్రితో కలిసి" - ఈ వ్యక్తిని కృష్ణశాస్త్రులు గా పైన ఉదహరించారు. సరైన పేరు ఏదో చూసి రెండుచోట్లా అదే వాడాలి.
 • Yes check.svg Done పాండవ ప్రవాసాము - పాండవ ప్రవాసము
 • Yes check.svg Done ప్రదర్శించని ఊరు కానీ, ఆలయం కానీ ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. - వికీకనుగుణంగా మార్చాలి.
 • Yes check.svg Done సుఖాజీవనం, వివాహాగాథ వంటి అక్షర దోషాలను పరిహరించాఅలి.
 • Yes check.svg Done ఎన్నో అంశాలు ప్రస్తావించడం - ఎన్నో అంశాలను ప్రస్తావించడం
 • Yes check.svg Done వేంకటశాస్త్రి అని కొన్నిచోట్ల, వేం.శా అని కొన్నిచోట్లా ప్రస్తావించారు. అన్ని చోట్లా ఒకేలా రాస్తే బాగుంటుంది.
  • మిగిలిన అన్ని చోట్లా దిద్దాను కానీ మోదుగుల రవికృష్ణ గారి వ్యాఖ్యలో మాత్రం మూలానుగుణంగా వేం.శా. అని ఉంచేశాను, దానికి వివరణగా బ్రాకెట్లో వేంకటశాస్త్రి అని కూడా ఉంది.
 • పుస్తకం వెనుక అట్టపై ప్రచురణకర్తలు ప్రశంసించారు. - ఇక్కడ బొమ్మ పెట్టవచ్చనుకుంటా (తెవికీలో ఎక్కించి)
 • Yes check.svg Done "ఆపై బ్రహ్మయ్యశాస్త్రి వద్ద శిష్యరికం చేసే రోజుల్లో ఆనాడు సంస్కృత పండితుల్లో తెలుగు పట్ల ఉన్న అనాదరం చేత గురువు వేం.శా. తెలుగులో కవిత్వం చెప్తారు అని ఎవరైనా సంపన్న గృహస్తులకు పరిచయం చేస్తే అవమానకరంగా భావించేవారు" - ఈ వాక్యం చదవగానే గబుక్కున అర్థం కావడం లేదు, మార్చాలి. ఒక సూచన: "ఆపై బ్రహ్మయ్యశాస్త్రి వద్ద శిష్యరికం చేసే రోజుల్లో ఆనాడు సంస్కృత పండితుల్లో తెలుగు పట్ల ఉన్న అనాదరం చేత, గురువు "వేం.శా. తెలుగులో కవిత్వం చెప్తారు" అని ఎవరైనా సంపన్న గృహస్తులకు పరిచయం చేస్తే ఆయన దాన్ని అవమానకరంగా భావించేవారు"
 • Yes check.svg Done అనధ్యయనాల్లో - అచ్చుతప్పా!?
  • కాదండి. అధ్యయనం చేయకూడని రోజులను (వ్యవహార రీత్యా చెప్పాలంటే సెలవులు) అనధ్యయనా లనేవారు. చెళ్ళపిళ్ళ రాసిన కాశీయాత్రలో సరిజూసుకున్నాను, అనధ్యయనమనే ఉంది. (పవన్)
 • పెద్దషావుకారు ఒకబేడ ఇస్తే ఈ మేడే మీ బేడేమి అంటూ పద్యం చెప్పడం ప్రారంభించేసరికల్లా గల్లున రూపాయి చేతిలో పడిందట. - దీన్ని మార్చాలి. ఒక సూచన:" ఒకసారి పెద్దషావుకారొకరు ఒకబేడ ఇస్తే ఈ మేడే మీ బేడేమి అంటూ పద్యం చెప్పడం ప్రారంభించేసరికల్లా గల్లున రూపాయి చేతిలో పడిందట." దీనికి మూలం ఇస్తే బాగుంటుంది.
 • Yes check.svg Done "ఏ కారణాల వల్ల వీరి మధ్య గొడవ ప్రారంభమైనా చిలికి చిలికి గాలివానగా మారి హోరాహోరీ యుద్ధంగా పరిణమించింది." - "ఏ కారణాల వల్ల వీరి మధ్య గొడవ ప్రారంభమైనా చిలికి చిలికి గాలివానగా మారి హోరాహోరీ యుద్ధంగా పరిణమించేది."
  • సూచించిన విధం వ్యాసంలో వ్యక్తీకరిద్దామన్న భావానికి అనుగుణంగా లేకపోవడంతో వాక్యంలోని పొరబాటును "వీరి మధ్య చిన్న చిన్న కారణాల వల్ల ప్రారంభమైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి హోరాహోరీ యుద్ధంగా పరిణమించింది." అన్న వాక్యంగా దిద్దాను.
 • Yes check.svg Done చెళ్లపిళ్ల కవిత్వం ద్వారా ఎంతో ధనం సంపాదించి కుటుంబ ఆర్థిక స్థితిని దోసపాదులా పెంచాడు. - తన కవిత్వం ద్వారా ఎంతో ధనం సంపాదించి కుటుంబ ఆర్థిక స్థితిని దోసపాదులా పెంచాడు. అంటే బాగుంటుంది.
 • Yes check.svg Done అటువంటి సందర్భంలో ఒకటి - అటువంటి సందర్భాల్లో ఒకటి
 • Yes check.svg Done ఆనంద ముగ్ధుడైన - ఇది సరైన ప్రయోగమేనా అని నా సందేహం
  • తప్పు కాదు. ఆనందంతో ముగ్ధుడైన అని అర్థం రావాలి. కానీ అంత సంక్లిష్టత అనవసరమని ఆనంద పరవశుడై అని బాగా వాడుకలో ఉన్న ప్రయోగంతో మార్చాను.
 • Yes check.svg Done అనుచితమని తి.వేం.కవులు తమ శిష్యునితో బహిరంగలేఖ వ్రాయించారు. - శిష్యుని పేరు తెలిస్తే రాయాలి. తెలియని పక్షంలో శిష్యులొకరితో అంటే బాగుంతుంది.
 • Yes check.svg Done అంతేకాక శతావధానులచే ఒప్పు అని నిరూపించబడినవి తవ్వితీసి తప్పులనడం ప్రారంభించాడు. - వేరే శతావధానులచే ఒప్పు అని నిరూపించబడినవా, లేక తి.వేం. కవులచే నిరూపించబడినవా అనేది స్పష్టం చెయ్యాలి. "..నిరూపించబడినవాటిని కూడా తవ్వితీసి.." అని రాస్తే మరింత బాగుంటుంది.

పద్యాలు[మార్చు]

పద్యాలకు ముందు అది ఏ ఛందస్సో తెలియజెప్తే బాగుంటుంది.

 • పద్యంలో "లిదిగో నడిగోనని చూచుటాయె, విశ్వాస మొర్పవే" - ఈ భాగాన్ని సరిచూడాలి.
 • Yes check.svg Done నిన్నేరుగుదున్, - గణభంగమైంది. బహుశా నిన్నెరుగుదున్ అని ఉండాలి
 • Yes check.svg Done మూకల జెండుచున్నప్పుడొ - మూకన్ జెండుచున్నప్పుడొ
 • Yes check.svg Done "అల నన్నయ్యకు లేదు.." పద్యం మూడవ పాదంలో గణభంగమైనట్లు తోస్తోంది.
 • Yes check.svg Done దిగ్విజయం బోనర్చి - దిగ్విజయం బొనర్చి

మూలాలు[మార్చు]

 • తిరుపతి వేంకట కవులు విభాగంలో ఒకచోట మూలం ఇచ్చారు. ఇంకా ఉచితమైన చోట్ల (ఉదా: "కొట్టుకున్నారు") మూలాలు చూపించాలి.
 • విమర్శకులు డి.చంద్రశేఖరరెడ్డి ఆయన వ్యాసాల గురించి ప్రస్తావించారు. - ఇక్కడ మూలాన్ని సూచిస్తే బాగుంటుంది.
 • Yes check.svg Done ఉద్వేగాలు పెంచుకున్న ఆ స్థితిలో ఇద్దరూ చెప్పులు చూపించుకునే స్థితికి వెళ్ళిపోయారు. - మూలం అవసరం.
  • ఈ వివరం శ్రీపాద ఆత్మకథ అయిన అనుభవాలూ జ్ఞాపకాలూను నుంచి స్వీకరించాను, అది వ్యాసంలో చేర్చాను. పేజీ నంబరు పరిశీలించి అదీ చేరుస్తాను.
 • ..ఒకసారి ఓపిక చేసుకొని కడియం వచ్చి నాల్గు పూటలు మా యింట ఉండండి. మాట్లాడుకుందాం.- మూలం అవసరం.
 • కాశీయాత్ర పుస్తకం https://archive.org/details/KasiYatraChellapillaVenkatasastry వద్ద, కథలు-గాథలు https://archive.org/details/ChellapillaVenkataSastry20160813 వద్దా ఉన్నాయి కాబట్టి వాటిని ఉదహరిస్తే పాఠకులకు వీలుగా ఉంటుంది.

ఇతరాలు[మార్చు]

 • Yes check.svg Done అథారిటీ కంట్రోల్ మూస పెట్టాలి.
  • పెట్టాను, సంబంధిత వెబ్సైట్లలో వెతికాను. చెళ్ళపిళ్ళ వారి పేజీనే అక్కడ లేదు, మనం చేర్చే వీలూ లేదు.
 • ఎర్రలింకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తగ్గిస్తే బాగుంటుంది.

2019 ఫిబ్రవరి 18 నాటి పరిశీలన[మార్చు]

నాకు దోషాలుగా తోచినవి కొన్ని ఇక్కడ ఇచ్చాను. పక్కన ఇచ్చినవి సరైన రూపాలు. అయితే, ఇవి దోషాన్ని వివరించేందుకు రాసినవే తప్ప మరోటి కాదు. పరిశీలించండి.

 • రూపురేకలు - రూపురేఖలు☑Y
 • వేంకట కవులులో ఒకడు - వేంకట కవులలో ఒకడు☑Y
 • అతను మరణానంతరం - అతని మరణానంతరం☑Y
 • సాహిత్యరంగంలో, భాషాశాస్త్రంలోనూ - సాహిత్యరంగంలోను, భాషాశాస్త్రంలోనూ ☑Y
 • రెండు మూడు చోట్ల వేంకట బదులు వెంకట అని పడింది -మార్చాలి☑Y
 • కడియద్ద కు లింకు ఇవ్వాలి☑Y
 • ఇతరత్రా వేద భాగం - ఇది సరైన మాటేనా, లేక ఇతరత్రా వేద భాగాలు అని గాని, మరోలా గానీ అనాలా!?☑Y
 • " కాశీ నుంచి తిరిగి చర్ల బ్రహ్మయ్యశాస్త్రి శిష్యరికానికి వచ్చిన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అవధానాలు చేస్తానంటే తన వద్దే శిష్యరికం చేస్తున్న దివాకర్ల తిరుపతిశాస్త్రిని తనకు జోడీగా స్వీకరించమని సూచించడంతో 1891లో కాకినాడలో వారిద్దరి తొలి శతావధానం జరిగింది. " - ఈ వాక్య్యాన్ని విడగొట్టి రెండు వాక్యాలుగా రాస్తే మరింత బాగుంటుందేమో పరిశీలించగలరు. ☑Y
 • "తిరుపతి వేంకట కవులన్న పేరుతో చేసిన ఆ శతావధానంలో ప్రతిభ, పాండిత్యాలకు తోడు యుక్తితో చిన్న వయసులోని అవధానులు ఉద్ధండులైన పండితులను గెలిచి విజయవంతంగా అవధానం చేయడంతో జంటకవుల్లో ఒకనిగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి విజయపరంపర ప్రారంభమైంది." - వాక్యాన్ని విడగొడితే బాగుంటుంది. ఒక సూచన: "తిరుపతి వేంకట కవులన్న పేరుతో చేసిన ఆ శతావధానంలో ప్రతిభ, పాండిత్యాలను ప్రదర్శించడంతో పాటు, యుక్తితో ఉద్ధండులైన పండితులను గెలిచి విజయవంతంగా అవధానం ముగించారు. జంటకవుల్లో ఒకనిగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి విజయపరంపర ప్రారంభమైంది."☑Y
 • రూపురేఖలు - పునరుక్తిని నివారించగలరేమో చూడండి.☑Y
 • సంపాదించిపెట్టడంతో - సంపాదించి పెట్టడంతో ☑Y
 • వివాహం, బ్రాహ్మణులు, సుకన్య,.. వగైరా పదాలకు అసందర్భంగా లింకులిచ్చి ఉన్నాయ్. (ఇచ్చింది మీరు కాదని నాకు తెలుసులెండి.) అలాంటి వాటిని పరిశీలించి తీసెయ్యండి.☑Y
 • "నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద అప్పటివరకూ బ్రహ్మయ్యశాస్త్రి వద్ద నేర్చుకున్న వ్యాకరణభాగానికి తరువాయి నేర్చుకోవటం మొదలుబెట్టాడు" - "అప్పటివరకూ బ్రహ్మయ్యశాస్త్రి వద్ద నేర్చుకున్న వ్యాకరణభాగానికి తరువాయి భాగాన్ని నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద నేర్చుకోవటం మొదలుబెట్టాడు"☑Y
 • వ్రాసి / రాసి - ఎక్కువగా వ్రాసి వాడారు. ఒకటో రెండో చోట్ల మాత్రం రాసి వాడారు. అన్ని చోట్లా ఒకటే వాడాలి.☑Y
 • "..రాజాస్థానాల్లో గౌరవాలు వంటివన్నీ కలిసే పొందారు." - "..రాజాస్థానాల్లో గౌరవాలు వంటివన్నీ ఇద్దరూ కలిసే పొందారు." అంటే మరింత బాగుంటుంది.☑Y
 • "కాశీ వెళ్ళి పలు శాస్త్రాలను చదువుకుని తిరిగి వచ్చాకా వేంకటశాస్త్రి చదువులో ముందుకు వచ్చాక పెద్దవాడైన తిరుపతిశాస్త్రికి సహాధ్యాయి అయ్యాడు. " - వాక్యాన్ని కొద్దిగా మారిస్తే బాగుంటుంది, ఇలా - "కాశీ వెళ్ళి పలు శాస్త్రాలను చదువుకుని తిరిగి వచ్చాకా వేంకటశాస్త్రి, పెద్దవాడైన తిరుపతిశాస్త్రికి సహాధ్యాయి అయ్యాడు. " ☑Y
 • "ముఖ్యంగా తిరుపతిశాస్త్రి, వేంకటశాస్త్రి గురువు తలపెట్టిన గణపతి ఉత్సవానికి డబ్బు సేకరించడం కోసం గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఆదరణ వేంకటశాస్త్రికే ఎక్కువగా ఉండేది." - ఈ వాక్యాన్ని పరిశీలించండి. ఒక సలహా - "ముఖ్యంగా, గురువు తలపెట్టిన గణపతి ఉత్సవానికి డబ్బు సేకరించడం కోసం వారిద్దరు గ్రామాలు తిరుగుతున్నప్పుడు వేంకటశాస్త్రికే ఆదరణ ఎక్కువగా లభించేది."☑Y
 • "ఇలా సాగుతుండగా వేంకటశాస్త్రి తోవఖర్చుల కోసం అప్పుచేసి పంపించిన ముప్పై రూపాయలు తీర్చుకోవలసి అవధానాలు చేయడానికి బయలుదేరినప్పుడు.." - ఈ వాక్యం మరింత విపులంగా ఉంటే బాగుంటుంది. తోవఖర్చుల కోసం అప్పు ఎవరు చేసారు, ఏ సందర్భంలో చేసారు అనే వివరం లేకపోవడంతో కొంత అయోమయం ఉంది. అలాగే ఈ వాక్యంతో కొత్త పేరా మొదలైతే బాగుంటుందేమో పరిశీలించండి.☑Y
 • "..చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జీవితంలో చాలావరకూ.." - "..చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జీవితం చాలావరకూ.."☑Y
 • "షట్‌దర్శనీవేది అయిన చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద అభ్యసించడమే కాక అతనే వేంకటశాస్త్రిని, తిరుపతి శాస్త్రిని జంటగా అవధానం చేయమని చెప్పడం విశేషం." - ఈ వాక్యం ఇలా ఉంటే బాగుంటుంది - "షట్‌దర్శనీవేది అయిన చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద అభ్యసించడమే కాక, ఆయన ఆజ్ఞ మేరకే తిరుపతి శాస్త్రితో కలిసి జంటగా అవధానం చేయడం విశేషం." ☑Y
 • "తయారు అయ్యారు" - "తయారయ్యారు"☑Y
 • "అవధానంతో పలు సంస్థానాలు, ప్రదేశాలు దిగ్విజయ యాత్ర తరహాలో తిరిగి ప్రతీచోటా ప్రతిభను చాటుకుని విజయవంతులయ్యారు." - " పలు సంస్థానాలు, ప్రదేశాల్లో దిగ్విజయ యాత్ర తరహాలో తిరిగి ప్రతీచోటా అవధాన ప్రతిభను చాటుకుని విజయవంతులయ్యారు."☑Y
 • "ప్రాచుర్యం తీసుకువచ్చిన వారు తిరుపతి వేంకట కవులు." - "ప్రాచుర్యం తీసుకువచ్చిన వారు మాత్రం తిరుపతి వేంకట కవు(లు/లే)."☑Y
 • "..భాగమైపోయింది) తొలి శతావధానం చేశారు." - "..భాగమైపోయింది) తొలి శతావధానం చేశాడు."☑Y
 • "ఒంటరిగా అష్టావధానాలు చేశారు." - "ఒంటరిగా అష్టావధానాలు చేశాడు."☑Y
 • "కలిసి అవధానాలు ప్రారంభించారు." -"కలిసి అవధానాలు ప్రారంభించాడు."☑Y
 • "ఉదహరించి ఎగరగొట్టారు" -"ఉదహరించి, పండితుల సందేహాలను ఎగరగొట్టారు"☑Y
 • "అవధానాల్లో ప్రధాన అంశాలైన సమస్యాపూరణం, దత్తపది, ఆశువు, నిషిద్ధాక్షరి వంటి అంశాల్లో వ్రాసిన పద్యాలు ఆయా సభలకు హాజరైన శ్రోతల్నే కాక అనంతర కాలంలో వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సందర్భాల్లో ప్రచురించిన పలు గ్రంథాల్లో వాటిని చదివిన పాఠకులూ ఆస్వాదించారు." - ఈ వాక్యాన్ని సవరించాలి.☑Y
 • "అంతా సులభంగా" -"అంత సులభంగా"☑Y
 • "మత్సర గ్రస్తులైన" / "మత్సర గ్రస్థులైన" - ఏది సరైనదో పరిశీలించగలరు
 • "అతను మరణంతో భార్య మహాలక్ష్మమ్మ" - "అతని మరణంతో భార్య మహాలక్ష్మమ్మ" ☑Y
 • "సత్యలింగం కాలంనాటి నుంచీ ఫ్రెంచివారితో స్నేహం కొద్దీ" - "సత్యలింగం కాలంనాటి నుంచీ ఫ్రెంచివారితో ఉన్న స్నేహం కొద్దీ" (స్నేహాన్ని పురస్కరించుకొని అంటే మరింత బాగుంటుందేమో) ☑Y
 • "ఆదరాన్ని ప్రదర్శించిన" - "ఆదరించిన" బాగుంటుందేమో! ☑Y
 • "ఏలా నది గురించి చివరకు" -"ఏలా నది గురించి, చివరకు" కామా ఉంటేనే చదవ వీలుగా అనిపించింది. ☑Y
 • "అనుకూల్యానుకూల్యతలను" లో అనుకూలత సరైన మాటనుకుంటాను.. ఇలా- "అనుకూలాననుకూలతలను" ☑Y అనుకూల్యత అన్నది నిఘంటువులో ఉంది, కానీ తేలిగ్గా అర్థం కావడానికి అనుకూలం, ప్రతికూలం బావుంటుందని అలా చేశాను (పవన్)
 • వచన రచనలు చేశారు- వచన రచనలు చేశాడు - కొన్నిచోట్ల ఏకవచనం, కొన్నిచోట్ల ఇలా గౌరవ సూచకాలను వాడారు. సరిచెయ్యాలి.
 • "వ్యావహారికంలోకి ది." - ఇక్కడ పదం ఏదో లుప్తమైనట్లుంది.☑Y
 • "అతను వ్యాసాల గురించి"- "అతని వ్యాసాల గురించి"☑Y
 • అంశాలli - సరిచెయ్యాలి.☑Y
 • "తిరుపతి వేంకట కవులకు మరీముఖ్యంగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రికి " -"తిరుపతి వేంకట కవులకు, మరీముఖ్యంగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రికి "☑Y
 • శతృత్వాలు - శత్రుత్వాలు?☑Y శత్రుత్వాలే సరి, దిద్దాను.
 • చిన్నా పెద్ద - చిన్నా పెద్దా ☑Y
 • "..జరిగిన వివాదాల గురించి సవివరంగా గ్రంథరూపంలో పదిలపరిచారు." -"..జరిగిన వివాదాలను సవివరంగా గ్రంథరూపంలో పదిలపరిచారు." ☑Y
 • "గుంటూరి సీమ" - ఇది వాలు ఆకృతిలో ఉంటే బాగుంటుంది.
  • వాలు కేవలం ఇతర భాషా పదజాలానికే కదా. కాబట్టి డబుల్ కోట్స్ పెట్టాను. (పవన్)
 • "ఆ పట్టుదలలోనే సామర్లకోటలో లఘుకౌముది ప్రారంభించిన రోజుల్లో మాత్రం వ్యాకరణం పూర్తి అయేదాకా కవిత్వం చెప్తే ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోవాల్సి వస్తుందని రచన ఆపుచేశారు." - వాక్య నిర్మాణాన్ని సవరించాలి.☑Y
 • గృహస్తులకు -గృహస్థులకు?☑Y
  • పర్యాయపద నిఘంటువులో గృహస్తు ఉంది. కానీ గృహస్థు అనేక నిఘంటువుల్లో కనిపిస్తోంది, కాబట్టి మరింత ప్రాచుర్యం పొందిన రూపం కాబట్టి అలా దిద్దాను. (పవన్)
 • వృద్ధిపొందింది - వృద్ధి పొందింది☑Y
 • "..శరపరంపరతో చేసిన అవధానాలైనా.." -"..శరపరంపరగా చేసిన అవధానాలనూ.."☑Y
 • "వెల్చేరు విశ్లేషించారు. " - పూర్తి పేరు రాయాలి. ఆ పేరుకు లింకు ఇవ్వాలి.☑Y
 • "వచనంలో కూడా గ్రాంథిక భాషలోప్రారంభించి సరళ వ్యావహారికం వ్రాయడం ప్రారంభించాడు. " - "వచనం గ్రాంథిక భాషలో ప్రారంభించి, తరువాతి కాలంలో సరళ వ్యావహారికంలో కొనసాగించాడు."☑Y
 • "పొగడుతూ చెప్పిన పద్యం చూడండి:" - "పొగడుతూ చెప్పిన పద్యం:"☑Y
 • "వీరి మధ్య చిన్న చిన్న కారణాల వల్ల ప్రారంభమైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి హోరాహోరీ యుద్ధంగా పరిణమించింది." - ఏ గొడవ గురించిన ప్రస్తావన ఇది - ☑Y
  • తిరుపతి వేంకటకవులకు వేంకట రామకృష్ణకవులతో ఏర్పడిన గొడవ గురించా, లేక
  • తిరుపతి వేంకటకవులకు రెండు జంటలతోటీ (కొప్పరపు కవులు, వేంకట రామకృష్ణకవులు) ఏర్పడిన తగువుల గురించా?
ఒకవేళ మొదటిదైతే, ఈ వాక్యం కొప్పరపు కవులతో జరిగిన గొడవ తరువాత రావాలి (ఔచిత్యం కోసం). రెండోదైతే వాక్యాన్ని మార్చాలి.☑Y
 • ఖండనలు, మండనలతో - ఖండనమండనలతో అంటే సముచితంగా ఉంటుందా!? ☑Y అవును, అలాగే బావుంటుంది, మార్చాను. (పవన్)
 • "ఆయనకు వివాదాలు వదలనే లేదు." - "వివాదాలు ఆయన్ను వదలనే లేదు."☑Y
 • " అతను కాశీయాత్ర పుస్తకానికి" -" అతని కాశీయాత్ర పుస్తకానికి"☑Y
 • "అతను అంటే" -"అతనంటే"☑Y
 • సమకాలీకులు - సమకాలికులు☑Y
 • "వేంకటశాస్త్రి కోపం వెనుక వెన్నలాంటి సహృదయత కూడా ఉందని ఆయనను నేరుగా ఎరిగినవారు వ్రాసి ఉన్నారు" - మూలం అవసరం. మూలాలు మరికొన్ని చోట్ల కూడా అవసరం (గతంలో రాసాననుకుంటాను)
  • విశ్వనాథ రాసిన ఓ పద్యాన్ని ఉదాహరణగా (ఆయన సహృదయత గురించి ఉంటుంది అందులో) ఇచ్చి, మూలం చేర్చాను. సరిపోతుందేమో చూడండి. (పవన్)
 • "అతను సమకాలీనులు వేంకటశాస్త్రి గురించి వ్రాసిన మాటలివి:" -"సమకాలికులు వేంకటశాస్త్రి గురించి వ్రాసిన మాటలివి:"☑Y

ప్రస్తుతానికి ఈ సమీక్ష ముగిసినట్లే. @Pavan santhosh.s:.. ఇక మీరు నా పరిశీలనలను పరిశీలించవచ్చు (!). __చదువరి (చర్చరచనలు) 16:26, 18 ఫిబ్రవరి 2019 (UTC)

చదువరి గారూ! మీ సూచనలు చాలావరకూ స్వీకరించి తదనుగుణంగా దిద్దుబాట్లు చేశాను. ఒకటి రెండు అంశాల్లో నా అభిప్రాయం వేరే ఉన్నచోట అది రాశాను. మీరు ఇక చెప్పాలి. --పవన్ సంతోష్ (చర్చ) 14:14, 22 ఫిబ్రవరి 2019 (UTC)
పవన్ సంతోష్ గారూ, మార్పు చేర్పులు చేసినందుకు ధన్యవాదాలు. "వాలు కేవలం ఇతర భాషా పదజాలానికే కదా." - కాదు, పుస్తకాల పేర్లకు కూడా ననుకుంటా. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 15:00, 22 ఫిబ్రవరి 2019 (UTC)
శైలిలో ఇటాలిక్స్ విభాగం చూశాను. ఉంది. (వేరే సంగతి: శైలి మాన్యువల్ అనువాదంలో "Titles of works" అన్నదాన్ని శీర్షిక పేరుగా అనువదించారు. అది నాకు వ్యాస శీర్షిక పుస్తకాల గురించైతే ఆ శీర్షిక ఇటాలిక్స్ లో ఉండచ్చు అన్న తప్పుడు అభిప్రాయాన్ని కలగజేసి కన్ఫ్యూజ్ చేసింది) ఆ ప్రకారం సరిదిద్దుతున్నాను @Chaduvari: గారూ. --పవన్ సంతోష్ (చర్చ) 16:14, 22 ఫిబ్రవరి 2019 (UTC)