చర్చ:మాచర్ల (పట్టణ)
Appearance
ఈ గ్రామం ఉనికి
[మార్చు]ఈ గ్రామం అసలు ఉనికిలో ఉందా లేదా అనేది సందేహంగా ఉంది. తెలిసిన వాడుకరులు స్పందించగలరు.__చదువరి (చర్చ • రచనలు) 06:44, 28 ఆగస్టు 2019 (UTC)
- చదువరి గారూ అసలు రెవిన్యూ గ్రామం మాచర్ల (యు). మాచర్ల (గ్రామీణ) ను మాచర్ల (యు) గా తరలింపు చేయాలి. తరువాత పట్టణ వ్యాసంగా మాచర్ల (గుంటూరు జిల్లా) అనే పేజీ ఉంది.ఇది పట్టణ వ్యాసంగా పరిగణించాలి.ఇక మాచర్ల (పట్టణ) అనేది ఇంకొకటి వేరేగా ఏమీలేదు. దీనిని మాచర్ల పురపాలక సంఘం వ్యాసం పేజీగా తరలింపు చేయాలి.మూస:ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు మూసలో కూడా మాచర్ల (గుంటూరు జిల్లా) పట్టణ వ్యాసం లంకె ఇవ్యబడింది.ఇది మాచర్ల పురపాలక సంఘం పేజీకి లంకె కలపాలి. ఈ సవరణలు చేపట్టగలరు.నేను కారెంపూడి మండలపరిషత్ లో పనిచేసాను.ఎన్నికల విధుల నిర్వహణలో మాచర్లలో చేసాను.అందువలన నేను చెప్పగలుగుచున్నాను. అప్పుడు అన్ని వ్యాసాలు సెట్ అయినట్లే. మాచర్ల పురపాలక సంఘం వ్యాసం నేను అభివృద్ది చేస్తాను.గమనించగలరు.గుంటూరు జిల్లాలో ఏ ఒక్క పురపాలక సంఘానికి వ్యాసం పేజీలు లేవు.నరసరావుపెటలో ఉంటూ నరసరావుపేటకు న్యాయం చేయాలనే సంకల్పంతో నేను ఈరోజే నరసరావుపేట పురపాలక సంఘం వ్యాసం పేజీని కొత్తగా సృష్టించి అభివృద్ధి చేపట్టాను.--యర్రా రామారావు (చర్చ) 08:48, 3 సెప్టెంబరు 2019 (UTC)
- యర్రా రామారావు గారూ, వివరించినందుకు ధన్యవాదాలు. మాచర్ల (గ్రామీణ) ను మాచర్ల (పట్టణ) గా తరలించవచ్చును గదా. మాచర్ల (యు) అని అనడం ఎందుకు అర్బన్ అంటే పట్టణ యే గదా? మాచర్ల పట్టణం, మాచర్ల (పట్టణ) మధ్య తికమక ఉంటుందనా?__చదువరి (చర్చ • రచనలు) 09:52, 3 సెప్టెంబరు 2019 (UTC)
- చదువరి గారూ నాకు తరువాత ఆ ఆలోచనే వచ్చింది. ఇంకొకటి ఏదైనా పట్టణం రెవిన్యూ గ్రామంగా ఉన్నప్పుడు పట్టణ వ్యాసానికి, రెవెన్యూ వ్యాసానికి ఒకటే చూపిస్తున్నాం.గ్రామీణ వ్యాసం రెవిన్యూ గ్రామంగా ఉన్నప్పుడే పట్టణ వ్యాసం ప్రత్యేకంగా చూపిస్తున్నాం.--యర్రా రామారావు (చర్చ) 10:46, 3 సెప్టెంబరు 2019 (UTC)
- ఇది మాచర్ల పట్టణ వ్యాసం.ఇది రెవెన్యూ గ్రామం కాదు.ఇది మాచర్ల పురపాలక సంఘం ప్రధాన పరిపాలనా కేంద్రం .మాచర్ల మండలంలో మాచర్ల (గ్రామీణ) అనే పేరుతో రెవెన్యూ గ్రామం ఉంది.ఇవి రెండు వేర్వేరు. యర్రా రామారావు (చర్చ) 17:09, 15 జూన్ 2022 (UTC)