చర్చ:యాగంటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg యాగంటి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2018 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

యాగల్లు/యాగంటి[మార్చు]

బహుశా ఈ వ్యాసానికి సరియైన పేరు యాగల్లు అని అనుకొంటాను. "మీ ఇల్లు", "మీ ఇంటికి వస్తున్నాను" వలె, "యాగల్లు", "యాగంటి కి వెళుతున్నాను" అని అనుకొంటున్నాను. చర్చించగలరు - శశి (చర్చ) 14:39, 28 మార్చి 2014 (UTC)

యాగల్లు అనే నామవాచకం, విశేషణమయ్యే సరికి యాగంటిగా మారుతుందనేది తెలుగు వారందరికీ తెలిసిన విషయమే. మీ ప్రతిపాదన సరైనదిగానే కనిపిస్తోంది. ఐతే ప్రతిపాదిత పుణ్యక్షేత్రానికి యాగంటి అన్నది నామవాచకంగా, పేరులా రూఢమైపోయి ఉంటే మార్పు వల్ల ఆ ప్రాంతీయులకు ఇబ్బంది కలిగే అవకాశాలే ఎక్కువ అని నా అభిప్రాయం. ఎంత రీడైరెక్ట్ ఉన్నా ఈ పేరును చూసి ఇబ్బందిగా ఫీలయ్యి మనమేదో పుణ్యక్షేత్రం పేరును మార్చేశామని భావించే అవకాశాలే ఎక్కువ. ఉదాహరణకు ద్రాక్షారామం అసలు పేరు దక్షారామమని పెద్దలు చెప్తారు. కానీ దక్షారామమని అంటే అర్థం అయ్యే అవకాశం తక్కువ. వ్యాకరణం ప్రయోగాన్ని అనుసరించాలి. జనం వ్యవహారంలో ఉన్నదాన్నే వ్యాకరణం గౌరవించాలి అని నా అవగాహన.--పవన్ సంతోష్ (చర్చ) 06:14, 8 ఏప్రిల్ 2014 (UTC)
శశి గారూ, ఆంగ్ల వ్యాసం కూడా yaganti అని ఉన్నది. పైన తెలిపిన పవన్ సంతోష్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను. మీరు పై సమాధానానికి సంతృప్తి పడితే స్పందించండి. {{సహాయం కావాలి}} మూసను తొలగించవచ్చు.----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 06:24, 27 మే 2014 (UTC)