చర్చ:సుప్రసిద్ధ ఆంధ్రులు-జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇది వివిధ రంగములలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన సుప్రసిద్ధ ఆంధ్రుల జాబితా. ఈ జాబితా అసమగ్రము. ఈ జాబితా ఎటువంటి వర్గీకరణ గానీ ప్రతిష్టాత్మకతా బేరీజు కానీ కాదు. కేవలం ఆయా ప్రసిద్ధ ఆంధ్రుల వ్యాసాలకు చేరుకునేందుకు కూడలి మాత్రమే.

నమస్కారం, ఈ పేజిలొ కేవలం పురుషుల పేర్లు మాత్రమె ఉండుటకు కారణము ఎమైనా ఉన్నదా?? Kiranc 15:53, 1 జనవరి 2006 (UTC)

ఈ పేజీ మగవారికి మాత్రమే ప్రత్యేకించినదేమీ కాదు. మనం ఈ జాబితాలోకి చేరే అవకాశమున్న వారందరి పేర్లు చేర్చవచ్చు - మగవారైనా, ఆడవారైనా సరే!. __చదువరి(చర్చ, రచనలు) 16:59, 1 జనవరి 2006 (UTC)

తెలుగు ప్రముఖుల పేర్లు[మార్చు]

మన ప్రముఖుల పేర్లు ఒక పద్ధతిలో లేవు. కొన్ని ఇంటిపేరులు ముందు, తరువాత ఉన్నాయి. కొందరివి పొట్టిపేర్లున్నాయి. కొందరి పేర్లకు ముందు డా., శ్రీ, మాస్టర్ లాంటివి పెట్టబడ్డాయి. అందరికీ అమోదయోగ్యమైన పద్ధతిలో అందరూ వ్రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం.Rajasekhar1961 07:07, 7 నవంబర్ 2007 (UTC)

బిరుదులు, అవార్డుల గురించి[మార్చు]

పేర్లకు ముందు పద్మశ్రీ వంటివి చేర్చడం చట్టప్రకారం సరికాదు. పద్మశ్రీ అనేది ముందు చేర్చడం వల్ల కన్నెగంటి బ్రహ్మానందం, మోహన్ బాబు ఎదుర్కొన్న కేసులలో హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎక్కడైనా ప్రస్తావించదలుచుకుంటే పద్మశ్రీ పురస్కార గ్రహీత అనవచ్చు. అందుకే అవి సరిజేస్తున్నాను.
సవినయంగా --పవన్ సంతోష్ (చర్చ) 14:58, 14 మార్చి 2014 (UTC)