చింతా అప్పలనాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చింతా అప్పలనాయుడు ఉత్తరాంధ్రకు చెందిన రచయిత, కవి. శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ఆయన మంచి నటుడు కూడా. ఆయన రాసిన "దుక్కి" కవిత్వానికి 2009 ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. ఆయన రాసిన "శృతితప్పిన వానపాట" కవితకు 2010 లో రంజని కుందుర్తి అవార్డు వచ్చింది.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన ఉత్తరాంధ్ర బతుకు దుఃఖాన్ని తన కవితా వస్తువుగా చేసుకొని తన మాతృ యాసలో కవిత్వాన్ని రాస్తున్న రచయిత. తను కథలు, కవిత్వంతో ఈ ప్రాంత వాసుల జీవన వెతలను తెలియజెస్తుంటారు. వర్తమాన తెలుగు కవితా దీపస్తంభం కె.శివారెడ్డి గారు ఈ సంకలనానికి రాసిన ముందుమాటలోని వాక్యాలు : "చింతా అప్పలనాయుడు మనముందు కూర్చొని శ్రీకాకుళం యాసలో కబుర్లు చెబుతున్నట్లు హాయిగా ఉంటుంది. చాలా సూటిగా, హాయిగా సాగిపోయే శైలి, పల్లెటూళ్ళ జీవనంలో అతలాకుతులమయిన పల్లెల జీవన దృశ్యాల్ని కతచెపుతున్నట్టు చెప్పుకుంటూ పోతున్నాడు, అతని కథా కథన పద్ధతి జానపదకథకుడు చెప్పే పధ్ధతి. అనుభవసారం గుండెనిండుగా వున్నవాడు, గొప్ప ఊహాశీలి, సంక్షోభాల్ని వర్ణించేటప్పుడు, కుతూహలం తగ్గకుండా, కన్నీళ్ళు తెప్పిస్తూ కథనడుపుతాడు. బహుశా అప్పల్నాయుడు శిల్పంకూడా యిదేనేమో" అన్నారు.

తన ప్రతి కవితలోను కరుణ రసాన్ని మేళవించి ఈ నేల ఆనుపానుల్ని ఎరిగిన ఈ తరం కవి ఆయన. ప్రతి కవితలోనూ శ్రమజీవుల కష్టాలనీకన్నీళ్లనీ సహజాతి సహజంగా చిత్రిస్తాడు. ఈయన రాసిన కవితల్లో కథల నిండా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జీవన సంఘర్షణలు, దోపిడీ, అడవి బిడ్డల బతుకుల్లోని చీకటి, మైదాన ప్రాంతాల వారు గిరిజన జాతులను ఎలా దోచుకుంటున్నదీ కనబడుతుంది.[1]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]