చిమ్మని మనోహర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిమ్మని మనోహర్ తెలుగు సినిమా దర్శకుడు. ఆయన ‘కల’, అలా, వెల్‌కమ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన స్వంత ఊరు వరంగల్. ఆయన ప్రస్తుతం హైదరాబాదు లో నివసిస్తున్నారు. ఆయన మెషినిస్టుగా ఫాక్టరీల్లో పనిచేసిన కొంతకాలం తర్వాత మళ్లీ చదువు వైపు దృష్టి మళ్ళించారు. తెలుగు సాహిత్యం, లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్సుల్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివారు. విశ్వవిద్యాలయ టాపర్‌గా పీజీపోస్టుగ్రాడ్యుయేషన్ లో రెండు గోల్డ్ మెడల్స్ కూడా పొందారు. తరువాత ఆయన మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేశారు. ఆయన ఆఖరి ఉద్యోగం - ఆలిండియా రేడియోలో సుమారు 11 ఏళ్లు పనిచేశాక, ఆ ఉద్యోగానికి రిజైన్ చేశారు. ప్రస్తుతం "ఇన్‌ఫొప్రెన్యూర్" (ఇన్‌ఫర్మేషన్ మార్కెటింగ్ ఆన్‌లైన్) పనిని స్వంతంగా పూర్తిస్థాయిలో చేస్తున్నారు.

రచయితగా[మార్చు]

ఆయనకు చిన్నప్పటినుంచీ చదవటం, రాయటం అలవాటు. ఆయన విద్యార్థిగా ఉన్నప్పట్నుంచే కథానికలు, వ్యాసాలు, ఫీచర్లు మొదలైనవి ఎన్నో దాదాపు అన్ని తెలుగు న్యూస్‌పేపర్లు, మేగజైన్లలో ప్రచురితమయ్యాయి. ఎక్కువగా ఆయన రాసిన కథానికలు "ఆంధ్ర భూమి" వీక్లీలో అచ్చయ్యాయి. ఆయన రష్యన్ నుంచి నేరుగా తెలుగులోకి ఒక ఇరవై వరకు కథల్ని అనువదించారు. వాటిలో ఎక్కువభాగం కథలు "విపుల", "ఆంధ్ర జ్యోతి" పత్రికల్లో అచ్చయ్యాయి.

అవార్డులు[మార్చు]

ఆయన వ్రాసిన సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకానికి 1998 లో నంది ఉత్తమ పుస్తక పురస్కారం లభించింది.[2]

మూలాలు[మార్చు]

  1. చిమ్మని మనోహర్‌ కొత్త చిత్రం 24-09-2014 23:29:43[permanent dead link]
  2. "తెలుగుసినిమా చరిత్ర: Andhra Pradesh State Nandi Film Awards (1997-2000)". Telugucinemacharita.blogspot.com. Archived from the original on 11 జనవరి 2014. Retrieved 11 Jan 2014. Check date values in: |archive-date= (help)

ఇతర లింకులు[మార్చు]