చిలుముల మదన్ రెడ్డి
చిలుముల మదన్ రెడ్డి | |||
| |||
పదవీ కాలం 2014–2018, 2018 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1951, జనవరి 1న కౌడిపల్లి, కౌడిపల్లి మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | మాణిక్య రెడ్డి - లలితమ్మ | ||
జీవిత భాగస్వామి | సుజాత రెడ్డి |
చిలుముల మదన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1][2] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[3][4] ఈయన నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన చిలుముల విఠల్ రెడ్డి గారి అన్న కుమారుడు[5]
జననం, విద్య
[మార్చు]మదన్ రెడ్డి 1951, జనవరి 1న మాణిక్య రెడ్డి - లలితమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలంలోని కౌడిపల్లి గ్రామంలో జన్మించాడు. 1971లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బద్రుకా కాలేజీ నుండి బికాం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు.[6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]మదన్ రెడ్డికి సుజాత రెడ్డితో వివాహం జరిగింది.
రాజకీయ విశేషాలు
[మార్చు]తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మదన్ రెడ్డి, 1999,2004లో ఆ పార్టీ తరపున నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిపై చేతిలో 25817 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009 లో పొత్తులో భాగంగా సిపిఐ అభ్యర్థి తన సోదరుడు చిలుముల క్రిష్ణా రెడ్డి కి మద్దతు తెలిపారు, ఆ తరువాత తన మిత్రుడు కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిపై 14,217 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిపై 38,120 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7][8] రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గా, ఒకసారి మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పనిచేశాడు.
నరసాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చిలుముల మదన్ రెడ్డికి 2023లో శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ కాకుండా మెదక్ ఎంపీ సీటు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నచ్చచెప్పడంతో నర్సాపూర్ ఎమ్మెల్యే సీటు సునీతా లక్ష్మా రెడ్డికి కేటాయించగా[9] ఆమె గెలుపులో కీలకంగా పని చేసాడు, కానీ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మెదక్ ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న చిలుముల మదన్ రెడ్డి 2024 ఏప్రిల్ 15న బీఆర్ఎస్ పార్టీని వీడి ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[10]
ఇతర వివరాలు
[మార్చు]రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సందర్శించాడు.
మూలాలు
[మార్చు]- ↑ admin (2019-01-09). "Narsapur MLA Chilumula Madan Reddy". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-27.
- ↑ "Member's Profile – Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-27.
- ↑ "Chilumula Madan Reddy(TRS):Constituency- NARSAPUR(MEDAK) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-08-27.
- ↑ "Chilumula Madan Reddy MLA of Narsapur Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-27.
- ↑ Sakshi (26 October 2023). "నర్సాపూర్‌ను శాసించిన మదన్‌రెడ్డి వంశస్తులు!". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ "Chilumula Madan Reddy | MLA | Narsapur | Medak | Telangana | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-06. Retrieved 2021-08-27.
- ↑ "Narsapur Assembly election: TRS MLA Chilumula Madan Reddy wins by 38,320 votes". www.timesnownews.com. Retrieved 2021-08-27.
- ↑ "Narsapur Election Result 2018 Live Updates: Chilumula Madan Reddy of TRS Wins". News18 (in ఇంగ్లీష్). 11 December 2018. Retrieved 2021-08-27.
- ↑ A. B. P. Desam (25 October 2023). "సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్ బీఆర్ఎస్ బీఫాం - సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎంపీ టిక్కెట్ ఆఫర్ !". Archived from the original on 10 May 2024. Retrieved 10 May 2024.
- ↑ Gullapelli, Shashank (15 April 2024). "బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ లో చేరిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ నేత." www.hmtvlive.com. Archived from the original on 10 May 2024. Retrieved 10 May 2024.