Jump to content

పొగ చుట్ట

వికీపీడియా నుండి
(చుట్ట నుండి దారిమార్పు చెందింది)
నాలుగు ప్రముఖ చుట్టల బ్రాండ్లూ (పైనుండి: హెచ్.అప్మన్, మాంటెక్రిస్టో, మకనూదో, రోమియో ఇ జూలియెత)

పొగ చుట్ట లేదా చుట్ట (Cigar) ఒక గట్టిగా చుట్టబడిన ఎండు పొగాకు కట్ట. పొగత్రాగేవారు ఒకవైపు చుట్టకు నిప్పు అంటించి రెండవ వైపును నోట్లో పెట్టుకొని పొగను నోటిలోకి పీల్చుకుంటారు.

చుట్టకు ఆంగ్ల పదమైన సిగార్, స్పానిష్ పదమైన సిగారో నుండి వచ్చింది. స్పానిష్ పదానికి మూలం మయన్ భాషలో పొగాకు యొక్క పదం సియర్

చుట్టలలో ఉపయోగించే పొగాకును గణనీయంగా బ్రెజిల్, కామెరూన్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, హోండూరస్, ఇండోనేషియా, మెక్సికో, నికరాగ్వా, అమెరికా దేశాలలో పండిస్తారు. క్యూబా చుట్టలు ప్రపంచప్రసిద్ధమైనవి.

పొగ చుట్ట యొక్క మహిమ ఆంధ్రులకు తెలియనిది కాదు. పొగ చుట్ట, బీడీ, సిగరెట్టు ఇవన్నీ ఒక కోవకే చెందినవి. మంచి పొగాకును చుట్టి షుమారుగా 5 నుంచి 6 అంగుళాల పొడుగుతో పొగ చుట్టను చేస్తారు. గుంటూరు పొగాకు చుట్టకు శ్రేష్టమైనది.

సాహిత్యంలో పొగచుట్ట

[మార్చు]

గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కంలోని గిరీశం పద్యాన్ని వినని తెలుగు వారుండరనుకుంటాను.

ఖగపతి అమృతము తేగా
భుగ భుగమని పొంగి చుక్క
భూమిన్ వ్రాలెన్ పొగ చుట్టై జనియించెను
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్.

సినిమా పాటలలో

[మార్చు]
  • సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ తాగు భలె సిగరెట్టు రాముడు భీముడు చిత్రంలోని పాట ప్రసిద్ధి చెందింది.
  • "బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు" టాప్ హీరో చిత్రంలో మరో పాట

ప్రమాదాలు

[మార్చు]

పొగ తాగడం వలన కాన్సర్ వస్తుందని వైద్యులు నిర్ధారించారు. ధూమపానం ఆపటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31 ను వరల్డ్ నో టుబాకో డే గా ప్రకటించింది. 2010 నాటికి మనదేశంలో ధూమపానం వల్ల మరణించేవారి సంఖ్య ఒక ఏడాదికి అక్షరాలా 10 లక్షలకు చేరుకుంటుందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ హెచ్చరించింది. సిగరెట్ తాగుతున్న పొగరాయుళ్ల ఆయుష్షు సుమారుగా పదేళ్లు తగ్గుతుందని వైద్యులు వెల్లడించారు. 39-69 ఏళ్ల నడుమ మరణిస్తున్న ధూమపాన ప్రియుల్లో 38 శాతం టి.బి, 32 శాతం క్యాన్సర్, 20 శాతం మందికి రక్తనాళాల సమస్యలు కారణమని పరిశోధనలో తేలింది. మనదేశంలో ఒక కోటీ 20 లక్షల మంది పొగరాయుళ్లు ఉన్నారు.

చట్టం

[మార్చు]

'పొగ తాగుట హానికరం' అని ప్రతి పాకెట్ మీద చట్టబద్దమైన హెచ్చరిక ముద్రించడం తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదని, ప్రజల ఆరోగ్యానికి చేటు చేస్తున్న గుట్కాలు, పాన్‌ మసాలాలను నిషేధించాలని ఎన్ని చట్టాలు చేసినా అవి అమలుకు నోచుకోవట్లేదు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే 200 రూపాయల జరిమానా లేదంటే జైలుశిక్ష తప్పదని కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలు పొగరాయుళ్ల చెవికెక్కడం లేదు. అధికారులుగానీ, పోలీసులుగానీ పట్టించుకోవట్లేదు. అందుకే జరిమానాను వెయ్యి రూపాయలకు పెంచి, రూల్స్ కఠినంగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఒకవేళ ఏదైనా సంస్థలో నిబంధనలను అతిక్రమిస్తే సదరు సంస్థ యజమాని 5 వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో పొగ తాగిన వారిపై చర్య తీసుకునే అధికారాన్ని టీటీఈ, ఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ ఎస్‌ఐలకు కల్పిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. (ఈనాడు7.11.2009)

పొగాకు రహిత నగరం - చండీఘర్

[మార్చు]

మనదేశంలో ఇప్పటిదాకా పొగాకు రహిత నగరంగా చండీఘర్‌ను చెప్పుకోవచ్చు. అక్కడ బహిరంగ ప్రదే శాల్లో పొగత్రాగటాన్ని గత ఏడాది నుంచి నిషేధించారు. నిషేధాజ్ఞలను వారు విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు, ఆసుపత్రులు... బస్టాండ్లు, రైల్వేస్టేషన్లవంటి రవాణా ప్రదేశాలు... ప్రైవేట్ వర్క్‌ప్లేస్‌లే కాదు...బార్లు, రెస్టారెంట్లలో సైతం పొగత్రాగితే భారీ జరిమానా ఖాయం.

"https://te.wikipedia.org/w/index.php?title=పొగ_చుట్ట&oldid=3879549" నుండి వెలికితీశారు