Jump to content

సేతు ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
(చెన్నై - రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
సేతు ఎక్స్‌ప్రెస్
Sethu Express
(சேது விரைவு ரயில்)
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్ రైలు
స్థానికతతమిళనాడు
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వేలు
మార్గం
మొదలుచెన్నై ఎగ్మోర్
ఆగే స్టేషనులు18
గమ్యంరామేశ్వరం
ప్రయాణ దూరం603 కి.మీ. (375 మై.)
సగటు ప్రయాణ సమయం11.40 గం.లు
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)16713/16714
సదుపాయాలు
శ్రేణులుఎసి సెకండ్, థర్డ్ ఏసీ, స్లీపర్, నిబంధనలు లేని జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం51 km/h (32 mph) విరామములతో సరాసరి వేగం [1]
మార్గపటం

చెన్నై యెళుంబూరు - రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[2] ఇది చెన్నై యెళుంబూరు రామేశ్వరం మధ్య నడుస్తుంది, [3] ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 16713 చెన్నై - రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది. ఈ రైలు చెన్నై యెళుంబూరు, రామేశ్వరం మధ్య నడుస్తుంది, ఇది ఒక జ్యా (లైన్) రైలు మార్గం ద్వారా నడుస్తుంది.

చెన్నై - రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్

రైలు మార్గము

[మార్చు]

ఈ రైలు మార్గం ద్వారా ప్రధాన నగరాలు అయిన చెంగల్పట్టు, విల్లుపురం, వ్రిద్ధాచలం, అరియలూర్, తిరుచిరాపల్లి, పుదుకొట్టై, కరైక్కుడి, శివగంగ, మన్మధురై, పరంకుడి రామనాథపురం తారస పడతాయి. ఈ రైలు తిరుచిరాపల్లి, తాంబరం మధ్యలో, 110 కి.మీ./గంటకు గరిష్ఠ వేగం సాధిస్తుంది.

cantilever iron bridge for rails and concrete road bridge on the backwaters of Bay of Bengal.
రోడ్డు, రైలు పంబన్ వంతెన

సమయము

[మార్చు]

సేతు ఎక్స్‌ప్రెస్ రైలు చెన్నై యెళుంబూరు నుండి 17,00 గం.లు వద్ద బయలుదేరుతుంది, రామేశ్వరం వద్దకు 4.45 (1 రాత్రితో పాటు) గంటలకు చేరుకుంటుంది.

రైలులో 3వ తరగతి ఎసి ప్రతి ఖాతం (బే) లోను 2 మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి.

ఈ రైలు తాంబరం వరకు అత్యధిక సార్లు 30-40 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. కానీ ఈ ఆలస్యం అనేది ఏ బాధ్యత లేని సమయం (స్లాక్ టైం) ఈ రైలుకు చాలా ఉంది ఎందుకంటే ఇది ఎత్తున ఉన్న రైలుమార్గము నకు (అప్) ఎక్కుతుంది కాబట్టి స్లాక్ టైం ఉంది. ఈ రైలు చెన్నై ఎగ్మోర్ స్టేషనుకు మాత్రం సరి అయిన సమయం చేరుకుంటుంది.

రేక్ షేరింగ్

[మార్చు]

ఈ రైలుతో 16723/24 అనంతపురి ఎక్స్‌ప్రెస్ రేక్ షేరింగ్ ఒప్పందం (ఆర్‌ఎస్‌ఎ) ఉంది.

ఇంజను (లోకో)

[మార్చు]

తిరుచిరాపల్లి నుండి చెన్నై యెళుంబూరు వరకు ఈ రైలు ఆర్‌పిఎం /ఈడి / డబ్ల్యుఎపి4 ఎలక్ట్రిక్ లోకో ద్వారా నడపబడుతున్నది. తిరుచిరాపల్లి, రామేశ్వరం మధ్య విభాగం జిఒసి డబ్ల్యుడిపి3ఎ/ఈడి డబ్ల్యుడిఎం3డి డీజిల్ లోకో ద్వారా నడపబడుతుంది.

భోజన సదుపాయం

[మార్చు]

ఈ రైలుకు వంట పెట్టె వసతి లేదు. రైలు నకు ఆన్-బోర్డు, ఈ భోజనం సమకూర్చే సదుపాయ సౌకర్యం ఉంది. విల్లుపురం జంక్షన్ రైల్వే స్టేషనులో భోజన సదుపాయము ఉంది.

రామేశ్వరం చేరుకునే రైళ్ళు

[మార్చు]

రామేశ్వరం చేరుకునే ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.

క్రమ సంఖ్య రైలు నంబరు రైలు పేరు తరచుదనం (ఫ్రీక్వెన్సీ)
1 18496 భువనేశ్వర్ - రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకరోజు (శుక్రవారం) [4]
2 16618 కోయంబత్తూరు - రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకరోజు (మంగళవారం) [5]
3 16779 తిరుపతి - రామేశ్వరం మీనాక్షి ఎక్స్‌ప్రెస్ వారానికి మూడు రోజులు (ఆది, మంగళ, శుక్రవారం) [6]
4 14260⇒15120 మండువాఢి - రామేశ్వరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకరోజు (ఆదివారం) [7]
5 16734 ఓఖా - రామేశ్వరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకరోజు (మంగళవారం) [8]
6 14260 వారణాసి - రామేశ్వరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకరోజు (ఆదివారం) [9]
7 56729⇒56829 తిరుచ్చిరాపల్లి - రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ వారానికి ఏడు రోజులు [10]
8 56721 మధురై - రామేశ్వరం ప్యాసింజర్ వారానికి ఏడు రోజులు [11]
9 56723 మధురై - రామేశ్వరం ప్యాసింజర్ వారానికి ఏడు రోజులు
10 56725 మధురై - రామేశ్వరం ప్యాసింజర్ వారానికి ఏడు రోజులు
11 16101 చెన్నై ఎగ్మోర్ - రామేశ్వరం బోట్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఏడు రోజులు [12]
12 16713 చెన్నై - రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్
13 12790⇒22622 కన్యాకుమారి - రామేశ్వరం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వారానికి మూడు రోజులు (ఆది, మంగళ, శుక్రవారం) [13]

రామేశ్వరం నుండి ప్రారంభం , బయలుదేరు రైళ్ళు

[మార్చు]
తమిళనాడు రాష్ట్రం లోని రామేశ్వరం లోని బంగాళాఖాతం దగ్గర అగ్ని తీర్థం వద్ద పవిత్ర స్నానం చేస్తున్న జనసందోహం,
రామేశ్వరం వద్ద పంబన్ వంతెన
రామేశ్వరం వద్ద పంబన్ వంతెన దృశ్యం

రామేశ్వరం నుండి ప్రారంభం, ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.[14]

క్రమ సంఖ్య రైలు నంబరు రైలు పేరు తరచుదనం (ఫ్రీక్వెన్సీ)
1 56724 రామేశ్వరం - మధురై ప్యాసింజర్ వారానికి 7 రోజులు
2 18495 రామేశ్వరం - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ వారానికి 7 రోజులు
3 56722 రామేశ్వరం - మధురై ప్యాసింజర్ వారానికి 7 రోజులు
4 56830 రామేశ్వరం - తిరుచిరాపల్లి ప్యాసింజర్ వారానికి 7 రోజులు
5 16780 మధురై - తిరుపతి ఎక్స్‌ప్రెస్ వారానికి 7 రోజులు
6 16102 రామేశ్వరం - చెన్నై ఎక్స్‌ప్రెస్ వారానికి 7 రోజులు
7 56726 రామేశ్వరం - మధురై ప్యాసింజర్ వారానికి 7 రోజులు
8 16617 రామేశ్వరం - కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్ వారానికి 7 రోజులు
9 16714 రామేశ్వరం - చెన్నై ఎక్స్‌ప్రెస్ వారానికి 7 రోజులు
10 22621 రామేశ్వరం - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ వారానికి 7 రోజులు
11 16733 రామేశ్వరం - ఓఖా ఎక్స్‌ప్రెస్ వారానికి 7 రోజులు
12 15119 రామేశ్వరం - మండువాఢి ఎక్స్‌ప్రెస్ వారానికి 7 రోజులు
13 రామేశ్వరం - చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్
14 15119 రామేశ్వరం - వారణాసి ఎక్స్‌ప్రెస్
15 18495 రామేశ్వరం - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్

కోచ్ కూర్పు

[మార్చు]

రైలు నంబరు 16713 : చెన్నై - రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది: ఈ రైలుకు కోచ్‌లు సంఖ్య మొత్తం 22 ఉంటాయి.

లోకో 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 0
ఎల్ ఎస్‌ఎల్‌ఆర్ జనరల్ జనరల్ ఎస్‌1 ఎస్‌2 ఎస్‌3 ఎస్‌4 ఎస్‌5 ఎస్‌6 ఎస్7 ఎస్8 ఎస్9 ఎస్10 ఎస్‌11 ఎస్‌12 బి3 బి2 బి1 ఎ1 జనరల్ జనరల్ ఎస్‌ఎల్‌ఆర్ <--
సేతు ఎక్స్‌ప్రెస్ - రైలు పాత నామఫలకం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • Indiarailinfo
  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.