చేవెళ్ళ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేవెళ్ళ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి

చేవెళ్ళ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. రంగారెడ్డి జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 4 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం చేవెళ్ళ పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలోని చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

వివరాలు[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన[మార్చు]

చేవెళ్ళ డివిజన్‌లోని మండలాలు:[5]

క్ర.సం చేవెళ్ళ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 శంకర్‌పల్లి మండలం 26 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
2 మొయినాబాద్‌ మండలం 33 రెవెన్యూ గ్రామాలు
3 షాబాద్‌ మండలం 25 రెవెన్యూ గ్రామాలు
4 చేవెళ్ళ మండలం 36 రెవెన్యూ గ్రామాలు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-10-24.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-10-24.
  4. "DIVISIONS | RangaReddy District Government of Telangana | India". Archived from the original on 2021-11-27. Retrieved 2022-10-24.
  5. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-10-24. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)